సందానం లేని ప్రశ్నల్లొనుంచి
జవాబుల్లోకి జారి
జవాబుదారీతనాల్లోంచి
నిజంలో మునిగిపోయి
దేనికోసమో వెతుకుతున్న
అవును నీకోసమే కదూ
ఏంటో ఇంకా అర్దంకాని
ప్రశ్న్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా
ఏంటో నా ఈ ప్రయానం
రెక్కల ప్రశ్ననై ప్రయాణమయ్యాను.
జనావాసాలకీ, అరణ్యాలకీ మధ్య
నాకు తెలీని నిజాన్ని వెతుక్కంటూ
మనసు రక్తం ఓడిన
ఓ కర్కసమైన ఓ నిజం సాక్షిగా
దారులన్నీ ప్రవహిస్తున్నాయి,
అబ్ద్దపు రక్తపు టేరులై
ఈ చివరన నిలబడి చూస్తే
ఎక్కడా చిన్న చీలికైనా లేకుండా
నిజాన్ని అబద్దంలో ఇరికించి
నటనను నాకెదురుగా చూపిస్తూ
పగలబడీ నవ్వుతున్నావుగా
నేల మీద పరచుకున్న ఆకాశంలా
రోడ్డు నిజమోకనిపిస్తుంది,
బ్రమనో తెలియని
అభూత కల్పనైంది కదా నాజీవితం
కాదు కాదు నీవే నన్నలా తయారు చేసావు
జవాబుల్లోకి జారి
జవాబుదారీతనాల్లోంచి
నిజంలో మునిగిపోయి
దేనికోసమో వెతుకుతున్న
అవును నీకోసమే కదూ
ఏంటో ఇంకా అర్దంకాని
ప్రశ్న్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా
ఏంటో నా ఈ ప్రయానం
రెక్కల ప్రశ్ననై ప్రయాణమయ్యాను.
జనావాసాలకీ, అరణ్యాలకీ మధ్య
నాకు తెలీని నిజాన్ని వెతుక్కంటూ
మనసు రక్తం ఓడిన
ఓ కర్కసమైన ఓ నిజం సాక్షిగా
దారులన్నీ ప్రవహిస్తున్నాయి,
అబ్ద్దపు రక్తపు టేరులై
ఈ చివరన నిలబడి చూస్తే
ఎక్కడా చిన్న చీలికైనా లేకుండా
నిజాన్ని అబద్దంలో ఇరికించి
నటనను నాకెదురుగా చూపిస్తూ
పగలబడీ నవ్వుతున్నావుగా
నేల మీద పరచుకున్న ఆకాశంలా
రోడ్డు నిజమోకనిపిస్తుంది,
బ్రమనో తెలియని
అభూత కల్పనైంది కదా నాజీవితం
కాదు కాదు నీవే నన్నలా తయారు చేసావు