. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, January 31, 2013

ఆ 'జాబిలి' వైపు ఆరాదనగా చూస్తూ

ఓ ప్రేమ 'జాబిలి' నీ చల్లదనం నాక్కావాలి
నీకోసం తపన పడుతున్నా నేనొక ప్రేమ బాటసారి.

నీవొక ప్రేమ జాబిలి.వెన్నెల సిరిమళ్ళివి..నీ చెలికాని చేరరావా
నీ నవ్వుల వెన్నెల్లు నాపై కురిపించి నా మదిలో అలజడి రేపావు..!
కానీ,నా జీవితపయనంలో 'ప్రేమ' మజిలీ రగిలించి ఎక్కడ దాక్కున్నావు జాబిల్లి

ఆకసాన అందంగాఅందమైన 'జాబిలి'ని చేరుకోలేను
చెంత చేరాలి అన్న ఆశను చంపుకోలేను ప్రియా
నీవు నా గుండెలో చేసిన తీపి గాయాల గురుతులను చెరుపుకోలేను.
అందుకే,ఆ 'జాబిలి' వైపు ఆరాదనగా చూస్తూ.. చూస్తూ..
నిన్ను ఆరాధిస్తూ..అభిమానిస్తూ..ఈ చిన్ని ప్రాణం విడుస్తున్నా

Monday, January 28, 2013

సగం కాలిన శవాన్ని నేను ప్రియా


నిన్న కోసం మొన్న
నేటి కోసం నిన్న
రేపటి కోసం నేడు
బాధ పడుతూ జాలి పడుతూ
ఆవేశ పడుతూ అసహాయతతో
ఆందోళనతో బ్రతుకుతున్న
బడుగు జీవిని నేను ప్రియా

జీవితాన్ని జీవించలేక
వర్తమానంతో పోరాడ లేక
బ్రతుకు నడుస్తున్న బానిసను నేను
హృదయమే అడవిగా
మనసే ఎడారిలా రెంటికీ చెడ్డ
రేవడిలా భవిష్యత్తు భయంతో
బ్రతికే భ్రష్ట జీవిని నేను ప్రియా

కళ్ళుండీ కనపడనీ,
చెవులుండీ వినబడనీ
హృదయముండీ
స్పందించని మనసుండీ
మమత పంచని నిన్నడగలేని
నిర్బగ్యున్ని ప్రియా నేను

నీకై అడుగు ముందుకెయ్యలేని
అభాగ్య జీవిని నేను
నీతో మనసు విప్పి ఎవరు మాట్లాడినా
నా హృదయం తట్టి ఎవరు నిద్ర లేపినా
అర్థ చేసుకోలేని..ఆమోదించలేని
నేను బ్రతికున్న శవాన్ని
నా మనసంతా నిర్జీవమే
అందుకే అంటున్నాను
సగం కాలిన శవాన్ని నేను.

నాలో నీవున్నావు ప్రియా


నిన్ను చూడాలనే మనస్సు
తపన పడుతోంది..
ఆత్రంగా నీ కోసం 
మనసు తడుముతోంది 

మాయని మచ్చగా  
నిలచి పోయిన
నీజ్ఞాపకాల సాక్షిగా

ప్రియా 

నాలో నీవున్నావు 
నీలో నేనున్నానా
లేకపోయినా వున్నాని చెప్పవూ  

నువ్వు మొహం చాటేస్తే 
నిన్ను చూడలేననుకున్నావా
నాలో ఉన్ననిన్ను ప్రతిక్షనం 
చూస్తూనే ఉంటాగా ప్రియా 


Sunday, January 27, 2013

ప్రతీ రాత్రి ...లోకం అంతా నిదురపోతోంది ఒక్క నేను తప్ప



ఈ నిశీధి లో
ఎన్ని రాత్రులను
కరిగిపోతున్నాయో
కాదన్న వాస్తవాల సాక్షిగా

నీవు దూరం అవ్వడం

దూరమవుతావో అని
భయపడ్డ క్షనాలు దగ్గర అవ్వడం
బరించడం చాలా కష్టం
భావాలను బందిచాలనే
విఫల ప్రయత్నంలో
వేడెక్కిన గుండే సాక్షిగా

ప్రతీ రాత్రి 

లోకం అంతా నిదురపోతోంది
ఒక్క నేను తప్ప 
నీవు నిద్రపోతూనే ఉంటావు
నీ ఆలోచనతో నేనున్నా
నా ఆలోచనలు నీకులేవుగా ప్రియా....?

నీ జ్ఞాపకాల సంకెళ్ళు

నాగొంతులో గుచ్చుకున్నాయి
మాట పెగలడంలేదు..
మనసు మాత్రం రగులుతోంది
అందుకే కాబోలు మాట పడిపోయింది

అందుకే పొద్దు పొడవని 

రాత్రుల్లు కావాలి
రాత్రుల్లు చీకట్లో 
ఒక్కడిగా మిగిలిపోవాలి
కాదనలేని నిజం కసుక్కున 
గుండెల్లో దిగబడితే
కదల్లేని బావాలు
నన్నే కసుకుంటున్నాయి

నీండు జాబిల్లి 

నీవెవరని అడుగుతుంది 
సమాదానం లేనిప్రశ్నల్లో
సర్దుకొని పోనా..
నిన్ను సాదించే కున్నందుకు
నన్ను నేను శిక్షించుకోనా ప్రియా

నన్నేప్పుడో చంపేశారు..ఒకసారికాదు రెండుసార్లు


ఎన్నో నెలలుగా వెతుకుతున్నా
అయినా దొరకడంలేదు..
నేను పారేసుకున్న మనసుకోసం కాదు


చుట్టూ ఎముకల గూళ్ళు
చుట్టూ చచ్చి పడిన శవాలు
ఎంతవెతికినా నాకింకా దొరకనేలేదు
నాదగ్గరకూడా చచ్చిన శవం వాసనే

నన్నేప్పుడో చంపేశారు
ఒకసారికాదు రెండుసార్లు
చంపడం వాళ్ళకిష్టంకాబట్టి ఇలా అయ్యా 
ముక్కలైన శవంలా

ఎందుకో ఒక్కసారి గతం గిర్రున తిరిగింది
ఇష్టం అని చెప్పిన మనిషి
ఎవరి వంచనో చేరి నన్ను చంపేసింది
వాడు నన్ను చంపుతుంటే తనూ నవ్వుతూ
నామీద దారుణంగా దాడి చేసి చంపేసి 
నవ్వుతూ వెళ్ళీపోయారు..అప్పుడే ఓ వింత

కొసప్రాణం ఉన్న నన్ను
ప్రాణం పోసింది..ఓ అందాల బొమ్మ
నన్ను నేను నమ్మలేనంత ప్రేమ చూపించి
ప్రపంచంలో ఇంతలా ప్రేమించే వాళ్ళుటారా అన్నంత
నిజం అని నమ్మా ..
ఆ నమ్మకం నిజంకాదని కొద్దిరోజులకే తెల్సింది

అంతే తనూ అంతకంటే దారూణంగా
చంపేస్తుంది..సేం.. మళ్ళీ దారుణంగా
 అందరిలోఅవమానిస్తూ ..
వెటకారమనే పదునైన కత్తులతోదాడి .
తనెప్పుడైనా ..జాలి పడుతుందేమో అని
తనవైపు జాలిగా చూశా..లేదు
ఆచూపుల్లో ఏం అర్దం చేసుకుందో
మళ్ళీ బంగారం అంటూ ఎవరినో తీసుకొచ్చి
దారుణంగా అతనితో చేరి దాడి చేసింది
ముక్కలు ముక్కలుగానరికేసింది నన్ను

అవును తనూ మనిషేగా..
అందుకే మనిషిలా చేసింది
తనతప్పేముంది చెప్పు..నిజాన్ని ఒప్పుకోవాలిగా..?

ఇప్పుడే నాశవం తాలూకా ముక్కలు 
ఏరుకొచ్చి కుప్పకుప్పగా పెట్టుకున్నా

కాని నేను అనుకున్నది దొరకలే 
ఎంతవెతికినా దొరకలే..
చుట్టూ శావాలే..
నేను వెతుకుతునంది మాత్రం దొరకలేదు

అదిగో ఎదో కనిపిస్తుంది 
అదేనా నేను వెతుకుతుందని దగ్గరకు వెల్లా
చూస్తే చిరాకేసింది ...అది నా మనస్సు

ఎందుకో ఒక్కసారిగా నామనస్సుమీద
నాకు చెప్పలేనంతకోపం
పదునైన కత్తి తెచ్చి ముక్కలు ముక్కలు చేద్దాం అని
నా మనస్సుమీద కత్తితో ఒక్కవేటు వేశా
నామనస్సు రెండుగా నిలువునా చీలిపోయింది  

అప్పుడో వింత జరిగింది
అప్పటినుంచి నేను వెతుకుతుంది 
కనిపించింది..అదే..నీజ్ఞాపకాలమూట
నీజ్ఞాపకాల మూట నా మనస్సులో బద్రంగా ఉంది
అమ్మయ్యనాశ్రమ ఫలించింది..
నీజ్ఞాపకాల మూటను బద్రంగా తీసుకున్నా

ఓ చెట్టు క్రిందకెళ్ళి కూర్చున్నా
నీజ్ఞాపకాల మూటనూ తీసుకేల్లా
ఎందుకో తెలుసా 
నీవు అన్నావుగా 
మన జ్ఞాపకాలనీ మూటగట్టి పెట్టు
ఏకాంతంలో జతచేరుతా అని
అందుకే ఈ స్మశానంలో
నీజ్ఞాపకాల మూటతో ఏకాంతంగా ఎదురు చూస్తున్నా
వస్తావు కదా ప్రియా..మాట మార్చవుగా..





Saturday, January 26, 2013

నాగుండె గదులన్నీటికీ కూలుస్తున్నా ప్రియా


వీడ్కోలు చేస్తం
శిదిలమై ముక్కలవుతున్న 
మస్సాక్షిగా
అందరూ చేరే ఆచివరి యాత్రకు
దగ్గరుండి వెళ్ళిపో అని చెప్పాక
వెళ్ళలేక వెలుతున్నా
ఉండలేక ఓడిపోయి వెలుతున్నా
ఇప్పటికే నాశరీరాన్ని తూట్లు పొడిచావు
ఎక్కడ ఎలా కొట్టాలో తెల్సిన మనిషివి
దారికాచి దాడిచేశావు నిండా గాయాలతో
రక్తం ఓడుతున్నా శరీరం.
నాశరీరం,హృదయం 
ఎర్రని నిప్పు కనికలా కనిపిస్తోందిప్పుదు

బుజ్జీ బంగారు లేపనం పూసుకొని
ఎంత అందంగా కనిపించావ్
లేపనం పోయేకొద్దీ
నీవు ఇలా 
మనస్సుపై దాడి చేస్తావని ఊహించలే
అప్పుడు దేవుని గుడి సాక్షిగా
ఇప్పుడు నీవు ఇలా ఎందుకని 
అడుగలేను మనసు నీరశించింది

నీవు నాలోకి వచ్చిన క్షనం
నాలోంచి నన్ను వెళ్లగొట్టి మరీ
నిన్ని నా మనసులో దాచుకున్నానే

నాగుండె గదులన్నీటికీ కూలుస్తున్నా
శిదిలం అయిన మనిషిని
చిద్రం అయిన మనస్సుతో
ఘడియలు లెక్కబెట్టుకుంటూ

కాస్త సమం మిగిలుంది
ఏదోరూపంలో దాడి చేయడం నేర్చుకున్నావుగా
మళ్ళీ నీకు ఆవకాశం వస్తుందోరాదో ప్రియా
ఇక్కడిక్కడే తిరగలేక తిరుగుతున్నా దాడిచేసి కసితీర్చుకో

Friday, January 25, 2013

ప్రియా గుర్తుకున్నానా..ప్లీజ్ గుర్తున్నా అని చెప్పవూ


చీకట్లో ఈదుతూ ..
వెలుగుకోసం  ఆరాట పడుతూ
చస్తూ బ్రతుకుతున్నా
నన్ను నీకోసం మనసు వేసే   ప్రశ్నలను
కొరుక్కుతినాలని చూస్తూ..మళ్ళీ చస్తూ
చీకటీ నురగల లేపనాన్ని పూసుకొని
పేలి ముక్కలౌతూ..నలిగిపోతున్నా
నీవదలి వేసిన నీ మనసుముక్కల్లో
నీవేమన్నా కనిపిస్తామేమో అన్న ఆశతో
అర్రులు చాస్తూ ఆవేదనగా
నీకోసం పరుగులు పెడుతున్నా
పడుతూ లేస్తున్నప్పుడు తగిలిన గాయాలను
ఓడుతున్న రక్తాన్ని లెక్కచేయక..
నీవు మనసుకు పెట్టిన గాయాలకు
మరికరికోసం చేసిన
వెటకారపు అక్షరాల డైనమేట్లకు
నేను ఏప్పుడో పేలి కాలిపోయాను
నేనిప్పుడు మనిషికాదు..
మనిషిలాంటి మనిషిని
అయినా నీకోసం నా అన్వేషన ఆగడు..
నిన్ను గెలిచి ఓడిన మనిషిని
ప్రియా గుర్తుకున్నానా..
ప్లీజ్ గుర్తున్నా అని చెప్పవూ
గుర్తులేకపోయిన.. అందరిలో
నన్ను మర్చిపోయినా
నా మనస్సుకోసం
నేనె తెల్సని...మన పరిచయం
గురించి నాలోని కొన్నిజ్ఞాపకాలను
కొన్నిటిని నామనస్సులోంచి లాగి
అవి నీమనస్సులో లేకపోయినా
నేను గుర్తున్నాని ఆజ్ఞాపకాలను చూసైనా చెప్పవూ
నీ జ్ఞాపకాల్లో కాలి రాలిపోయిన మనిషిని ప్రియా ప్లీజ్