ప్రతిసారి నన్ను నేను
ఎక్కడ మొదలు పెట్టాలో
వెతుకుతూఉంటా
నాలో ఆలోచన తగలబడి
నన్ను నాలో కలిపేసి
మనసు చినిగిన స్థానాన్ని
కుట్టుకోడానికి మనసు
లోపలికెళ్ళే దారికి
గుమ్మం ఎదురుగానే
గతం వేలాడుతూనే వుంది
మౌనంలో గాయం మిళితమై
హృదయపు పునాదులను
నెర్రులిచ్చి పగిలిపోయాయి మన జ్ఞాపకాలు
నాకు నేను ఇష్టం లేక
ఎప్పటికప్పుడు రాలిపోతుంటా
నాలో మిగిలిన
నిశబ్దాలను చీల్చుకుని
కొన్ని సార్లు
నాలో నేను
మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
అవమానాల్లోంచి చనిపోతూ
నిరుత్సాహంలోంచి లేలేతగా
చనిపోయిన ఓటమిలోంచి
నన్ను నేను
నిర్వచించుకుంటూ కొత్తగా
పుట్టాలని ప్రయత్నిస్తుంటూ
చావాలని బ్రతుకుతూ
నిజంలో కొవ్వొత్తిలా కరిగిపోతుంటా
నన్ను నేను ఎలా
నిర్వచించుకోవాలో తెలీక
నాలోకి నేను రాలిపోతూనే వుంటా
ఎక్కడ మొదలు పెట్టాలో
వెతుకుతూఉంటా
నాలో ఆలోచన తగలబడి
నన్ను నాలో కలిపేసి
మనసు చినిగిన స్థానాన్ని
కుట్టుకోడానికి మనసు
లోపలికెళ్ళే దారికి
గుమ్మం ఎదురుగానే
గతం వేలాడుతూనే వుంది
మౌనంలో గాయం మిళితమై
హృదయపు పునాదులను
నెర్రులిచ్చి పగిలిపోయాయి మన జ్ఞాపకాలు
నాకు నేను ఇష్టం లేక
ఎప్పటికప్పుడు రాలిపోతుంటా
నాలో మిగిలిన
నిశబ్దాలను చీల్చుకుని
కొన్ని సార్లు
నాలో నేను
మళ్ళీ మళ్ళీ పుడుతుంటా
అవమానాల్లోంచి చనిపోతూ
నిరుత్సాహంలోంచి లేలేతగా
చనిపోయిన ఓటమిలోంచి
నన్ను నేను
నిర్వచించుకుంటూ కొత్తగా
పుట్టాలని ప్రయత్నిస్తుంటూ
చావాలని బ్రతుకుతూ
నిజంలో కొవ్వొత్తిలా కరిగిపోతుంటా
నన్ను నేను ఎలా
నిర్వచించుకోవాలో తెలీక
నాలోకి నేను రాలిపోతూనే వుంటా