. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, December 10, 2015

రెండు మనసులు మధ్య రాపిడైతే వచ్చేది నిశ్శబ్దమేగా

అయోమయంలోనో 
అదోరకపు భ్రాంతిలోనో బ్రతికేస్తున్నాం 
మనుషులంతా ఇప్పుడు.. 
మౌనశిలలుగా మరో రూపమెత్తారు
పెదాల కదలికల్ని మనసు దారిలో విసిరేసి
గతాన్ని  వెంటేసుకుని తిరిగే 
విషాద మునులుగా మారిపోయారు

ఇప్పుడు మాట్లాడ్డానికేమున్నాయి?
రెండు మనసులు  మధ్య రాపిడైతే 
వచ్చేది నిశ్శబ్దమేగా
ఇద్దరు వ్యక్తుల మధ్య 
నిరంతరం భయంకర నిశ్శబ్దం
విధ్వంసానికి 
మహా సంగ్రామాలు అక్కర్లేదు
ఎదురెదురుగా ఉన్నా 
మాటలు రాలని మౌనం చాలు 
అందుకే ఇప్పుడు..
మాటల్ని మౌనపు 
ముద్దలుగా మూలకి విసిరేసి
మనుషులంతా నడిచే 
మౌనశిలలుగా బతుకీడ్చుతున్నారు.