. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, September 11, 2015

అందరూ మంచోళ్ళే ...అందరికీ నేను తప్ప

నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నిశ్చలభయాల నిర్వికారాన్ని
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి..
ఊహల్లో విహరిస్తున్నా
నన్ను నేను కాల్చుకుంటున్నా

జ్ఞాపకాల శకలాలనీ ఏరుకొంటూ
సుదూర స్వప్నాల కోసం 
ఎదురు చూస్తూ 
పగటిపూట నీతలపులతో 
రాత్రుల్లు నీజ్ఞాపకాలతో 
నన్నూ నేను 
మాయచేసుకుంటూ బ్రతికేస్తున్నా  
ఇంతా జరుగుతున్నా
మనసు మాత్రం 
ఏమీ చెప్పా పెట్టాకుండా
వెన్నెల రెక్కలు తొడుక్కుని
నీ యౌవనవనాల వైపు 
వెళ్ళిపోతూంటుంది…
అయినా ఎక్కడో వెలితి..
మనసంతా సూన్యం 
శూన్యంగా మిగిలిపోదు
పరిమళాల సంగీతం వినిపిస్తూన్నా
నాలో ఇంకా విషాదం 
సెగలు వస్తూనే వున్నాయి
ఎవరికీ చెప్పలేని 
చెప్పుకోలేని వేదాంతం 
నాలో నేను 
కుమిలిపోతున్న క్షనాలివి 
నేను నమ్మిన మనుషులు తప్ప 
అందరూ మంచోల్లే 
అందరికీ నేను తప్ప
మంచోళ్ళే అందుకే ఊహా ప్రపంచానికి 
నాలోని నన్ను హింశిచుకొంటూ 
రక్తాక్షరాలు రాసుకొంటూనే ఉన్నా

Monday, September 7, 2015

వ్యధ వెన్నెల లై నాపై అగ్ని కురిపించిన క్షనాలు

రాగం మెలిక తిరిగి 
నాలో శోకం కలిసిపోయింది
వ్యధ వెన్నెల లై నాపై 
అగ్ని కురిపించిన క్షనాలు 
గుండెను గురిచూసి కొట్టిన జ్ఞాపకాలు 
నన్ను ఇప్పటికీ ముక్కలు 
చేస్తూనే వున్నాయి

ఎప్పుడూ నాలో కనిపించే విషాదం 
నన్నూ మాత్రమే వేదించే వేదన 
నాకు తెలియకుండా నన్నేందుకు  
ఈరోజు మూగగా రోదించేలా చేస్తున్నాయి 

నీ కోసం నండె ఏనొస్తే నీ గుండె 

తలుపులు మూసే ఉంటాయి
తలుపు సందుల్లోనుండి చూస్తే 
నీమనసు ఎవ్వరో 
ప్రశాంతంగా నిద్రపోతున్నారు 
నాతాలూక ఆనవాల్లు 
కనిపిస్తాయేమో అని
నీ గుండె గదిమొత్తం వెతికాను 
ఎక్కడ లేవు..నీవు నాలో 
గుచ్చిన మాటల తూటాలు 
నీవు విసెరెసిన నిర్లక్ష్యపు 
మాటల గాయాల కత్తులు 
ఇంకా అక్కడ పడేసే వున్నాయి 


Wednesday, September 2, 2015

ఎందరిని ఏమార్చి ఇలా వంటరిని చేసి మోసం చేశావో

ఇప్పుడు నీవు 
ఎందరి మనసుల్లో ఉన్నావో
ఎవరెవరి కళ్ళల్లో నిండావో
ఎవరికి ఎన్నెన్ని జ్ఞాపకాలని మిగిల్చావో
ఎవరెవరి గమనాన్ని elA మార్చావో
ఎన్ని రహస్యాలను నింపుంటావో 

ఒప్పుడు దూరమైన నీకోసం 
గడియలు పెట్టుకుని ఎవరైనా ఏడ్చుండచ్చు
నీ కోసం చయ్యకూడని ద్రోహం చేయలేక 
అపురూపమైన మనసును మరొకరికి తాకట్టు పెట్టలేక 
నీ కోసం పోగొట్టుకోకూడని దేన్నో పోగొట్టుకుని  
నిరాశగా ఆకాశం వైపు చూస్తూ 
ఉన్నవాన్ని ఎప్పటీకీ గుర్తించలేవు
ఎందరిని ఏమార్చి 
ఇలా వంటరిని చేసి మోసం చేశావో 
నీ కవ్వించే కల్లతో ఆశపెట్టి 
అధోపాతాలానికి నెట్టేశావో 
నీకేదైనా సాద్యమే కదా 

Tuesday, September 1, 2015

కనపడవని తెలిసీ ఇంకా వెతుకుతూనే వున్నా

మనసు పూల గంపను
అటూ ఇటూ కదిల్చి
రాలిపడిన జ్ఞాపకాల తట్టలో 
నీ  గులాబి 
చేతుల స్పర్శతో
నన్ను నేను 
మైమరచిన నాకు 
చెప్పలేనంత 
భారాన్ని గుండెలో  మోపి 
ఎదలో గుచ్చిన నీ తలపుల్లో 
నా గతాన్ని గాయాలమయం చేశావుగా 

ఎప్పటికీ ఎదురు గానీ  
నీ ఆ చిన్న పలకరింతకు కూడా
నా  సమాధానం తో పనిలేకుండా 
మనసు బందంలో  సంధించే భిగువులొ 
గట్టిగా బిగుసుకుపోయిన 
నా ప్రేమను 
నిన్నటి గాలానికి 
రేపటి కాలాన్ని 
వేలాడ దీశాను 
ముక్కలు ముక్కలుగా 
విరిగి పడిపోతున్న 
కాలపు ముక్కల్లో 
వెతికినా కనపడవని తెలిసీ 
అమాయకంగా ఇంకా వెతుకుతూనే వున్నా 

Monday, August 31, 2015

నిన్ను పలకరించాలని ఆశగా చూస్తున్నా

నిన్ను పలకరించాలని 
ఆశగా చూస్తున్నా 
ఎక్కడా  నువ్వు లేవు..
ఎందుకనో చెప్పవూ 
నా మొహానికి అలసిన 
దేహమొకటి తగిలించి వెళ్లావు
తొంగి చూస్తే లోపల 
నలిగిన మనసు
పగిలిన నాజ్ఞాపకాలు తప్ప 

జీవితంలో ఒకొక్క 
మడత విప్పుతుంటే
మనసు గాజు గది 
పగులుతున్న చప్పుడు
అవన్నీ అక్కడ నీవుండి 
పగలగొడుతున్నా  
నా జ్ఞాకాలు  అడ్డుచెప్పలేను ..చెప్పను 
కారణం నీకు నాకు మాత్రమేసు  తెలుసు


Saturday, August 29, 2015

నాలోని అలజడి బ్లాగులో అక్షారాలైన క్షనాన

ఏదో ఆరాటం మొదలౌతుంది. ఎక్కడా తిన్నగా ఉండనీదు, చేస్తున్న పనేంటో అర్థం కాదు. అప్పుడొకటే దారి. వీలు చేసుకుని ఎక్కడోచోట కూర్చుని ఉన్న ఫళాన రాసెయ్యాలి. హమ్మయ్య! రాసేస్తానా, అప్పుడు కాస్త ఊపిరాడటం మొదలౌతుంది.” ఎందుకో తెలియదు కాని మనసు మూలల్లో ఎదో అలజడి ...నిర్వేదం నిరాశ ..గతం చేసిన మాయలో ఇంకా బ్రతుకుతున్న ప్రస్తుతం   ....ఆ గతంలో నాతో వున్న ప్రానులు అన్నీ మర్చిపోయి కొత్త జీవితంలో పడి ఆనందంగానే వున్నారు మరి నేనెందుకు ఇలా  ఆలోచిస్తూ సంత్సరాలు గా భాద  పడుతూనే వున్నా ...ఎందుకని ఎవ్వరిని అడగాలి నేనెందూ అన్నీ మర్చిపోలేక పోతున్నా ..నేనెందుకు అందరిలా ఆనందంగా వుండలేక పోతున్నా ..“ఏదైనా కష్టమొస్తుంది కదా. చాలా పెద్ద విషాదం ఒక్కోసారి. బాగా బాధేస్తుంది. ఏడ్చినా, ఎవరితో చెప్పుకున్నా తీరదు. ఆ తీవ్రత, విషాదపు లోతు ఉన్నదున్నట్టు బయటికి పంపాలంటే రాసుకోడం తప్ప వేరే దారి లేదు.” దాచుకున్న జ్ఞాపకాలు నాలో నిలబడలేక మనసు మూలల్లోనుండీ కలం వుండీ  కాగితాల్లో జారిపడే రోజులు పోయి కంఫ్యూటర్ కీబోర్డు ఇంగ్లేషు కీబోర్డు పై తెలుగు అక్షరాలు అవలోలకంగా ..ల్యాప్ టాప్ స్త్రీన్ పై పడి నాలోని భాదను మైపరపించి నన్ను దహించి వేస్తున్న నాలోని గుండెల్లోనుంచి రగిలిన గతం వువ్వెత్తున అగ్నిలావాలా ..నాలో జివ్వుమన్న శక్తినంతా కూడాదీచుకొని కీబోర్డులపై నాలోని ఆందొలనాంటా ఎండవేడికి కిరనజన్య సమ్యోగ క్రీయ జరిగినట్టు ..కీబోర్డు పై నుండి ఒక్కోపదం ..కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించగానే ఆవేశంగా రాసుకొన్న పదాలు ...గతం జ్ఞాపకాల మటల్లోనుంచి రాలిపడిన నిప్పుకనికల్లా కనిపిస్తూ నాలోని  ఆవేశాన్ని కాస్త తగ్గిస్తాయి అవి ఈ బ్లాగులో కవితలై మెరుస్తున్నప్పుడు నాలో తెలియని శాడిష్టు ఆనందంగా కెవ్వుమని కేక వేస్తాడు ..ఆది ఆనందమో విషాదమో తెలియని ఒక తియ్యని అనుబూతి  ఏదో సాదించానన్న తృప్తి అంతలోనే ఏదో గుర్తుకొచ్చి వెంటనే కంటి  చివరన నీటి చెమ్మ బొట్లు బొట్లు గా మారి జారిపొటున్న క్షనాన మల్లీ ఏదో తలియని భాద నన్ను కమ్మేస్తూ ఉంటుంది వేళ్ల మెటికలు విరుచుకుంటూ, అప్పటిదాకా మోస్తున్న టన్నుల బరువుని దింపుకున్నవాడిలా నిట్టూర్చి రాస్తునే ఉంటాను “నేనూ ఆలోచించాను. నేనురాసేది చాలామందికి, అసలెవరికీ అర్థం కాకపోవచ్చేమో అని రూఢీగా అనిపించింది కూడా ఒకసారి. కానీ రాశాను. లోకం సంగతేమో కానీ, రాసుకున్న ప్రతిసారీ బహుశా, నాకు నేను ఏమైనా అర్థమౌతానేమో తెలుసుకోడానికి రాస్తాను.” ఎవ్వరో చదువుతారని కాదు చదివిన వాల్లు నన్ను అర్దం చేసుకుటారనీ కాదు నాలోని అవేశం అక్షరాలైతే ఇలా ఉంటుంది అని ఏదో చెప్పాలని ఏదో రాసేస్తుంటాను 

ఎంటో అందరూ ఆనందగా ఉన్నారు నేను తప్ప

ఎంత పాతబడిన గాయమైనా
మళ్ళీ మళ్ళీ ముళ్ళకంప ముల్లుల్లో
కొత్తగా రేగి రేగి జ్ఞాపకాల సుడుల్లో
పోగొట్టుకున్న అమూల్యాలను 
కలల్లోనూ వెతుక్కున్నట్టు
వెక్కిళ్ళు పెడుతూనే ఉంది నా గతం ..
ఎంటో అందరూ ఆనందగా ఉన్నారు  నేను తప్ప 
అంటే అన్నీ మర్చిపోయి 
అందరూ అబద్దంలో బ్రతికేస్తున్నారు 
నేను మాత్రమే నిజం లో నిర్వేదంతో బ్రతికేస్తున్నా 


ఎన్ని వెలుగులను మింగేసిన
చీకటిలా అనేక నిజాలను 
దాచుకొని నిబ్బరంగా ఉండలేక 
కంటీమీద కునుకు లేక 
ఇలా జీవచ్చవంలా ఎందుకునా 
నన్ను నేను  ప్రశ్నించుకుంటే 
నాకు నేను అర్దం కాక 
నాలో నేను నిలువలేక 
నిన్ను నాదగ్గర లేనప్పుడు
ఏక్కడో ఒకచోట 
చిరునవూలు చిందిస్తున్న నిన్ను
చేరలేక చేరుకోలేక 
నేను పడుతున్న మరణ యాతన