. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, December 3, 2019

సౌ0దర్య రాసి అందం తో మాది పిలకించేను

నీ అందం మనసు కల్పనలకు అందదు.. అద్భుత సౌదర్యం..ఎదురుగా కనిపిస్తే కళ్ళముందు ఏరూపం  కనిపించక అలా నిన్ను చూస్తూ ఉండిపోతానుగా

చందమామ చూపు చల్లన అంటారు...కాని నీ చిరు నవ్వు ఆ వెన్నెలను సవాలు చేసింది నన్ను దాటి నా నవ్వును కాదని మరో నవ్వు నిఉహకు కూడా వస్తూ0దా

సూర్యుడు కురిపించే వేడి, వేడి అంటారు...కాని నీ కొంటె చూపు   చూడగానే ఎదలో  వేల గంటలు ఒకేసారి మ్రోగిన గంటలు  శబ్దాలు

 నీ కురుల సిరులు వయ్యారాలు ముత్యాల ఓలె నీ వరుస పళ్ళు..బంగారు వస్త్రాన్ని మరపించే నీ అందం ముందు   పోటీ రారు వేరెవ్వరు

తేనెలొలికించే నీ పలుకులు
తామర రేకుల్లాంటి నీ పెదవులు అంచుల్లో దాగిన అందమైన ఆ చిరునవ్వుల తలుకుల కోసం ఆ కళ్ళు వెతుకుతూనే ఉంటాయి

కాటు వేసే నీ చూపులు
మాటు వేసే నీ ఒంపులు వయ్యారాలు..దేవకన్యలు కూడా నిన్నే చూస్తూ మైమరచిపోతారు..

మత్తెక్కించే మైమరపించే  నీ మాటలు కవ్వించే కనువిందు చేసే ని అందమైన రూపం.లో ఎన్నేన్ని  వర్ణాలు దాగి ఉన్నాయో మాటల్లో చెప్పలేను.. మౌన0లో దాచుకోలేని నిజాలు

Thursday, November 14, 2019

మనసు భారం మళ్ళీ మొదలైంది

అనుభూతులను బంధాలతొ  పోరాడే జీవిత0
అబద్ధపు అర్ధాలను ఆపాదింస్తో0ది
స్వేచా విహంగాలై ఎగిరి
అలుపొచ్చేలా ఆకాశపుటంచులు కొలవనీ
పరవసించి పరుగులెత్తే నదిలా మారిన విషాదాన్ని
సుదూర తీరలను శోధించనీ
అలుపెరగ వీచే పవనాల్లా
ప్రతి గంధం ఆఘ్రాణించనీ..
మదిలో ప్రజ్వలించే అగ్నిహోత్రంలా కొన్ని నిజాలు
ప్రతి అణువూ  మ్రింగ మౌనా నికి నన్ను చేరువ చేస్తోంది
గడిచే క్షణాలన్నీ  ఇప్పుడు నా మాట వినను అంటున్నాయి..
ఓ మానసు తనస్వార్థం కోసం తన దారి మార్చుకుంది ఎందుకో
నీ మనసు కోరేవే హద్దులనీ
బాధలకు మనసు మళ్ళీ భారంగా మారింది
అనుభూతులని మింగేసింది శుభోదయం మిత్రులారా

Monday, November 11, 2019

ఆలోచనలు కూడా ఆవిరి అయిపోతున్నాయి

గుప్పిట్లోంచి
నీళ్లు జారిపోతున్నట్లు-
కాలం సందుల్లోంచి
ఆలోచనలు పారిపోతున్నాయి
మనకు అంద కుండా పారిపోతున్నన్నాయి
 నిలకడలేకుండా
మనకి అందకుండా
ఆ ఆలోచనలు కూడా ఆవిరి
అయిపోతున్నాయి
తలా,తోకా లేనివి కొన్ని,
అర్ధం పర్ధం లేనివి కొన్ని,
స్వచ్చత లేనివి కొన్ని,
ఇష్టం లేనివి కొన్ని,
అక్కరకు రాని అబద్ధాల నడుమ...మెల్లగా జారిపోతున్న నమ్మకాన్ని
కాలం వడపోయలేక పోతుంది
అందుకే కాబోలు
వాటితోపాటు- ఆణిముత్యాల్లంటివి కూడా
బిజీ లైప్ లో ఎక్కడో తప్పిపోతున్నాయి
మేల్కోవాలి -- మౌనంగా రాసుకోవాలి
జారిపోని వీలులేని డైరీ అరలలో..కొన్ని  రోజులు క్షణాలు గా మారి క్షణాలు అక్షరాలు అయి.జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి

Sunday, November 3, 2019

పున్నమి వెలుగులలో

పున్నమి వెలుగులలో నీకోసం
నా ప్రేమ మనసు నీకై ఆరాటపడింది...తడుముకుంది..అనుకున్న క్షణాల్లో నా కొసమే ప్రత్యేక్షమైన దేవతవు నీవు
 వెన్నెల  కాంతుల్లో...నడయాడుతూ నాకోసం దివి నుండి భువికి వచ్చిన సౌ0దర్య రాశివి నువ్వు

ఎక్కడి దూరంగా ఉన్న నీవు  నాకోసం వస్తున్న నిన్ను చూసి ...నా గు0డే వేగంగా కొట్టుకుంది. ..నా ఎదురుగా ఉన్న నమ్మాలేక పోయా..సుతిమెత్తగా తియ్యని స్వరం విన్నాక తెలిసింది ఇది కల కాదు నిజమే అని

నా మనసు పండువెన్నెల్లో ఊయలలూగింది..
వెన్నెల దేవతలా కదలి వచ్చి
నను కలిసి  ఆ క్షణం...ఇప్పటికీ గుండెల్లో అలా పదిలంగా మిగిలిపోయి0ది ఆ తియ్యటి జ్ఞాపకం
ని రాకతో నా జీవితంనా అణువణువు ప్రేమ స్వర్గంలో ఓలలాడింది...అప్పుడు ఇప్పుడు ఎప్పటికి

మళ్లీ ఎప్పుడొస్తావా ఆని వెన్నెలనాటి కమ్మదనాన్ని అందిస్తావని మనసు ఆశగా ఎదురు చూస్తుంది..మనది ఇప్పటి బంద0 కాదు ఎన్నో జన్మల అనుబంధం.. అందునే నేను
మళ్లీ ఆ నాటి సంధ్యా సమయపు క్షణాల్లో ఎదురుచూస్తూ...నా గుండె గదిలో పదిలంగా ఉన్న నా జ్ఞాపకాలను తడుముకు0టున్నా త్వరగా వస్తావు కదు బేబి

Wednesday, October 30, 2019

గత0 దూరమైన ప్రస్తుతం ఏడిపిస్తుంది

గత0 దూరమైన  ప్రస్తుతం ఏడిపిస్తుంది ..తరవాత గడపాల్సిన కాలం గుర్తుకువచ్చి
జీర్ణించుకోవడానికి నన్ను నేను సమాయుత్త పరచుకోవడం విఫలం అవుతునే ఉన్న....క్షణాలు గడపడం
దుర్లభం  అవుతోంది
ఎదురుగా జరుగుతున్న నిజాలు నమ్మాలి..నమ్మి తీరాలి ఎందుకో ఒక్కోసారి నన్ను నేను నియంత్రిచుకోవడంలోను విఫలమై
అర్ధం కాని అయోమయ స్థితిలో ఉహాల్లో బతికున్నానేమో..నాది కానీ దానికోసం తచ్చాడుతు నిజాన్ని మరచి..ఉహల్లో కూడ నన్ను నేను గాయపర్చుకుంటుమళ్లీ
జీవనంలో జీవశ్చవంలా మారాను..? ..మాటలు మౌనంగా నన్ను వెక్కిరిస్తున్నాయు..
ఎందుకో నా మనసు ఊపిరి ఆగే. ఆక్షణం కోసం ఎదురు చూసు0ది ....
ప్రతి సారి ఎదురైయ్యె గాయాలు తట్టుకోలేక
ఏమైనా  నా పై నాకున్న భావన సహనశీలి గా ముద్రించుకుని
ఓటమి రహదారుల్లో నడుస్తున్న ఈ నడక నాకు అలవాటే ..మళ్ళీ మళ్ళీ గాయాల పాలౌతు నడక సాగిస్తూన్న ఒంటరిగా ఉన్నాను..ఆగే ఆక్షన0 కోసం ఎదురు చూస్తూ..😔😔😔

Saturday, October 26, 2019

నీకోసం అక్షరాలు తడుము కొంటూనే ఉన్నాయి ఇంకా

ఉదయం లేచింది మొదలవుతుంది
అంతులేని నిరీక్షణ....
కోసం.నా బైల్ తడుముకున్న ప్రతిసారి
లాస్ట్ మెస్సే వైపు దినంగా చూస్తూ మరో మెస్సేజ్ ఎప్పుడు వస్తుందా అని
ఆత్రంగా ఎదురు చూస్తోంది మనసు..ఎదో సమయంలో
కొత్త మెసేజ్ కనిపించకపోదా అని

రోజులు,
గడిచిపోతున్నాయి....కాలం గిర్రున తిరుగుతుంది
కాలాలు, ఋతువులు
మారిపోతున్నాయి...కానీ నాది కానీ దానికోసం..మనసు తడుముకు0టుంది


ఎక్కన ఉన్నాయి  కొసం ఎదురు చూసే అక్షరాలు
ఏవీ?నా గుండెపై
గుప్పెడు మల్లెలు చల్లినట్లుండే
ఆ ప్రణయ పత్రాలు?
అవును నిజం కానీ నిజాలు ఊహల రూపంలో నాన్నిలా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి..నిజంగా నేను అల్ప సంతోషిని అన్ని నావే అనుకుంటా ..అందరూ నా వల్లే అనుకుంటా..కానీ ఏది నాది నాది కాదు...ఎవ్వరు నావాళ్లు కాదు..అంతా ఊహ అదంతా భ్రమ..బ్రమల్లో బ్రతకడం మనసుకు ఆలవాటు అవ్వడం పొరపాటుకాదేమో

నీ చిలిపి రాతలు చిలికిన
కవ్వింతలు ఎక్కడ?
అవి నా మనసుకి
పెట్టిన గిలిగింతలు ఎక్కడ?
అవి కనరావు..ఎక్కడో ఎప్పుడో ఎక్కడికో జరిపోతూనే ఉన్నాయి మౌనంలో..నిజం నేను నిజం లో బ్రతకాలి అనికోవడం ఈ జన్మలో జరగదేమో కదు

Thursday, October 24, 2019

నీకు ఈ నా మనసు నివేదన వినవా

నన్ను నేను తడుము కుంటున్న క్షణాల్లో
మొగ్గతొడిగిన ప్రేమ
లోలోనదాగి.ఒక్క విచ్చుకున్న పువ్వులా
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
వయస్సు తెచ్చిన
ధైర్యమో, అనుభవమో
కథలు కథలుగా
మాటలు పొరలు పొరలుగా నా అనసులోని నివేదన విప్పి చెప్పాలని చూస్తుంది మనస్సు

మంచు పూల పల్లకిలో
అందంగా ముస్తాబయిన హేమంతం..ఋతువులా నువ్వు ని సోయగాలతో నా మనసును తడుముతూ
తనువంతా చక్కిలిగింతలు పెట్టి నవ్వించి కవ్విస్తున్నట్టు అనిపిస్తుంది

ఏమని వర్ణించనూ..? నిన్ను ఎలా చెప్పాను ని ప్రేమను
రేయంచు నుంచి జారిపడిన వేకువఝాములో
పూలకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్య0లా ని ప్రేమ
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడిని
మసకతెర చాటునుంచి తొంగిచూస్తున్నట్టు ప్రతిక్షణం ని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూన్నాయి

Saturday, October 19, 2019

మనస్సు పరితపిస్తుంది నీకోసం

నా కల నీ రూపం కోసం వెతుకుతునే ఉంటుంది
నా కవిత నీ  భావం కోసం ఎప్పుడు పరితపిస్తుంది
నా  మనసు నీ చెలిమి కోసం తడుము కొంటూ పరుగెడుతుంది
నా ఊహ నీ మనసుతో..జతకట్టాలని.. నీ   రూపాన్ని అక్షరాల్లో మలచుకొని చదువుతుంటే మనసు ఊయల ఊగుతుంది

నీ జ్ఞాపకాలతో నా కాలం పయనిస్తుంది..నీ ఆలోచనలతో ప్రతి క్షణం
నీ శ్వాసతో నా గుండె ఊపిరి తీసుకొంటుంది
నీ ఊహ తో నా  ప్రపంచం ఉదయాన్నే ఆవిర్బస్తుంది ..నిన్ను తలచుకొంటు రోజుని మొదలు పెడతాను..నీతో మాట్లాడుతూ ఆరోజు ముగిస్తూ...మరుసటి రోజి ని పలరింపుతో.  మరో ఉదయాన్ని చూస్తాను

నీ కోసం నా కోరిక పరిగెడుతుంది
నీ కోసం నా ఊహ జన్మిస్తుంది
నీ కోసం నా కనులు కాంతులు విరజిమ్ముతుంది
నీ కోసం నా మనసు ఓ విశాలమైన విరంహంతో విచారిస్తూ,  తాపంతో తపనపడుతూ ని వెచ్చని కౌగిలో కరిగి పోవాలని, మైకంతో  తమకంతో ...నన్ను నేను మార్చి పోతూ ఉంటాను బేబి