నన్ను నేను తడుము కుంటున్న క్షణాల్లో
మొగ్గతొడిగిన ప్రేమ
లోలోనదాగి.ఒక్క విచ్చుకున్న పువ్వులా
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది
వయస్సు తెచ్చిన
ధైర్యమో, అనుభవమో
కథలు కథలుగా
మాటలు పొరలు పొరలుగా నా అనసులోని నివేదన విప్పి చెప్పాలని చూస్తుంది మనస్సు
మంచు పూల పల్లకిలో
అందంగా ముస్తాబయిన హేమంతం..ఋతువులా నువ్వు ని సోయగాలతో నా మనసును తడుముతూ
తనువంతా చక్కిలిగింతలు పెట్టి నవ్వించి కవ్విస్తున్నట్టు అనిపిస్తుంది
ఏమని వర్ణించనూ..? నిన్ను ఎలా చెప్పాను ని ప్రేమను
రేయంచు నుంచి జారిపడిన వేకువఝాములో
పూలకొమ్మను హత్తుకుపోయిన నీటిముత్య0లా ని ప్రేమ
తూరుపు కొండలని దాటివస్తున్న సూరీడిని
మసకతెర చాటునుంచి తొంగిచూస్తున్నట్టు ప్రతిక్షణం ని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తూన్నాయి