కన్నీరు అడ్డొచ్చి
వెక్కిళ్ళు మాటలను మింగేసిన క్షణంలో
నీ మౌనాన్ని వింటాను.
నాలో నువ్వు
పడుతున్న సంఘర్షణను
వ్యక్తపరచలేని నీ మాటల
లేమి నాకు వినిపిస్తుంది.
పదాల కోసం వెతుక్కునే
నీ నిస్సహాయత నిట్టూర్పును
మౌనంలో వింటాను
అక్షరాలలో ఒదగలేని
నీ భావాలను నా కళ్ళతో చూస్తాను
మాట్లాడుతూ మాట్లాడుతూ
నువ్వు హటాత్తుగా ఆగిపోతావే
అప్పుడు నీ నిశ్శబ్దం నా చెవులలో విస్పోటకాలవుతాయి….మౌనంగా
వెక్కిళ్ళు మాటలను మింగేసిన క్షణంలో
నీ మౌనాన్ని వింటాను.
నాలో నువ్వు
పడుతున్న సంఘర్షణను
వ్యక్తపరచలేని నీ మాటల
లేమి నాకు వినిపిస్తుంది.
పదాల కోసం వెతుక్కునే
నీ నిస్సహాయత నిట్టూర్పును
మౌనంలో వింటాను
అక్షరాలలో ఒదగలేని
నీ భావాలను నా కళ్ళతో చూస్తాను
మాట్లాడుతూ మాట్లాడుతూ
నువ్వు హటాత్తుగా ఆగిపోతావే
అప్పుడు నీ నిశ్శబ్దం నా చెవులలో విస్పోటకాలవుతాయి….మౌనంగా