. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, April 13, 2017

కన్నీళ్లే వాళ్లను బతికిస్తున్నాయి...( kvita gari matalu)


గుండెలోని ఆవేదననంతా కరిగి ద్రవించేవి కన్నీళ్లు. ఆ భావోద్వేగం వైయక్తికం. కానీ అక్కడ అది సామూహికం. బతుకుదెరువు. అందుకే వాళ్లు గుండెలు బాదుకుంటూ రోదిస్తారు. అవును అక్కడ కన్నీళ్లు వాళ్ల కడుపునింపుతున్నాయి. ఇది రాజస్థాన్‌లోని రుదాలీ మహిళల కథ.
ఎవరైనా చనిపోయారన్న వార్త వినిపిస్తే చాలు వాళ్లంతా హవేలీ ఆవరణలోకి వస్తారు. వాళ్ల ఆచార సంప్రదాయాల ప్రకారం ఆ హవేలీలోని మహిళలెవ్వరూ బయటికి రారు. ఊర్లోని మగవాళ్లంతా కలిసి ఆ చనిపోయిన వ్యక్తి చేసిన మంచి పనులను కీర్తిస్తూ ఉంటారు. ఆ పక్కనే నల్లని చీరలు ధరించిన మహిళలు... రోదిస్తూ ఉంటారు. గుండెలు బాదుకుంటూ. కన్నీళ్లు జారి చెంపలపై చారికలు పడతాయి. కానీ వాటిని తుడుచుకోరు. అలా వాళ్లు ఏడవడం ఇదే మొదటిసారి కాదు. చివరిసారీ కాదు. నిత్యం ఏడుస్తూనే ఉంటారు. ఏడుపే వృత్తిగా జీవిస్తున్నవాళ్లు. బతికేందుకు ఏడుస్తున్నవాళ్లు. యముడికి ఇష్టమైన రంగు నలుపునే ధరిస్తారు. వాళ్లంతా తక్కువ కులానికి చెందినవారు. ఈ సమాజం వారికో కుటుంబం ఉండటానికి అంగీకరించదు. వాళ్లు సంతోషంగా ఉంటే డబ్బున్న వాళ్ల చావులకు ఏడ్చేదెవరు? అందుకే ఎప్పుడూ వాళ్లు బాధితులుగానే ఉంటారు.
అగ్రకులాల హుందాతనంకోసం...
అదో వింత వృత్తిగా, వికారమైన చేష్టగా మనకు కనిపించవచ్చు. కానీ రాజస్థాన్‌లోని వెనుకబడిన ప్రాంతాల్లోని సంప్రదాయానికి వాళ్ల అవసరం ఉంది. కారణం.. ఉన్నత కులాల్లోని మహిళల భావోద్వేగాలు ఇతరుల ముందు ప్రదర్శించడానికి వీలు లేదు. అందుకే వాళ్ళు హవేలీలోని పరదాల వెనుక ఉంటారు.
''ఉన్నత కుటుంబాల్లోనివాళ్లు చనిపోయినప్పుడు ఏడవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. నిజానికి మహిళలు సున్నిత మనస్కులు. అందుకే మా కుటుంబాల్లోని మహిళలు ఏడవరు. ఇంటి బయట మా మహిళలు ఉండటానికి అనుమతి లేదు. అదీ కాక ఉన్నత కులానికి చెందిన మహిళలు సాధారణ ప్రజల ముందు ఏడవరు. భర్త చనిపోయినా సరే... వాళ్లు వారి హుందాతనాన్ని కాపాడుకోవాలి. ఈ తక్కువ కులానికి చెందిన మహిళలు.. అదే రుదాలీలు మా ఉన్నత కులాల్లోని మహిళల తరుపున ఏడుస్తారు. ఓ వ్యక్తి చనిపోతే ఊరు మొత్తం ఆ వ్యక్తిని కోల్పోతుంది కదా. ఆ ఊరి బాధనంతా వారు వ్యక్తపరుస్తారు'' ఇది అక్కడి ఠాకూర్స్‌ కుటుంబాల్లోని వ్యక్తులు చెప్పే మాటలు. ఈ రుదాలీ వృత్తి వెనుక లింగ, కుల, వర్గ, ఆర్థిక స్థాయిలు బలంగా పనిచేస్తున్నాయి. పేదరికం, కులం, లింగ వివక్ష కలగలిపి ఆ మహిళలను ఈ వృత్తిలోకి నెట్టేశాయి. కిందికులానికి చెందిన మహిళల వ్యక్తిగత భావోద్వేగాలు... ఉన్నత కులానికి చెందిన పురుషులకు అమ్మకపు సరుకులైపోయాయి.
అక్రమ సంతానంగానే...
ఈ మహిళలకు ఆ సమాజంలో కనీస గుర్తింపు ఉండదు. అదే వారిని దోపిడీకి గురి చేస్తోంది. వాళ్లలో చాలా మంది ఉన్నత కులాలకు చెందిన పురుషులకు అక్రమ సంతానాన్ని కనే యంత్రాలు మాత్రమే. అదే పుట్టింది ఆడపిల్లయితే... వెంటనే చంపేస్తారు. 'మా కాళ్ల మీద మేం ఒక మైలు నడవడమే కష్టమైన చోట... ఇక అమ్మాయిలను కనే స్వేచ్ఛ మాకెక్కడుంది?' అంటుంది ఓ ముదుసలి రుదాలి మహిళ. ఒకవేళ కొడుకు పుట్టినా వాళ్లకు తండ్రి పేరు చెప్పడానికి వీల్లేదు. వాళ్లు అక్రమ సంతానంగానే పిలవబడతారు. ఆ మహిళలింకా.. అగ్రకులాలకు చెందిన పురుషులు దీర్ఘాయిష్సులుగా ఉండాలని... తక్కువ కులానికి చెందిన యువతులను ఆకర్షించి మోహించిన బ్రహ్మచారి దేవుడు 'భెరుజీ'నే పూజిస్తారు.
పాతబట్టలు.. మిగిలిపోయిన రొట్టెలు...
మరి వాళ్లలా ఏడ్చినందుకు ఎక్కువ డబ్బు ఏమన్న పొందుతారా అంటే అదీ లేదు. 30 ఏండ్ల కిందటనుంచి ఇప్పటివరకు కిందపడి పొర్లి మరీ ఏడ్చినా... గుండెలు బాదుకుంటూ ఏడ్చినా... వాళ్లు పొందేది ఐదు లేక ఆరు రూపాయలు. అప్పుడప్పుడు కొన్ని బియ్యం, పాతబట్టలు, ఉల్లిగడ్డలు, ఇంట్లో మిగిలిపోయిన రొట్టెలు మాత్రమే. ఆ మాత్రం కోసం వాళ్లు పన్నెండు రోజులపాటు ఏడుస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఆ కాలపరిమితి ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబం ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బున్న వాళ్లయితే ఇంకా ఎక్కువ రోజులు ఏడిపించుకుంటారు.
సుర్మాతో...
వాళ్లకోసం వాళ్లు ఏడవడం ఎప్పుడో మానేసిన ఆ మహిళలు.. ఉన్నతవర్గాల కోసం ఏడ్చేటప్పుడు తమ బాధలను గుర్తు తెచ్చుకుంటారు. అయితే అన్నిసార్లు అది కుదరదు కదా. అందుకే ఏడుపుకోసం వాళ్లకు రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. కొందరు లాలాజలం ఉపయోగిస్తారు. ఇంకొందరు కళ్లకు నీళ్లు తెప్పించే ఓ చెట్టు ఆకులను కళ్ల దగ్గర పెట్టుకుంటారు. కొందరు కళ్లకు సుర్మా పెట్టుకుంటారు.. అది తాకిన కళ్లు మండి కన్నీరును వర్షిస్తాయి.
LikeShow more reactions
Comment