నా ప్రతి సవ్వడి
నిశ్శబ్దం తాలూకు విస్ఫోటమే
ఎన్నో ఆరాటాలు పోరాటాల మధ్య
శరీరాన్ని అద్దెకు తీసుకుని సాగుతుంటే
ఉన్న మెదడు వదిలి అద్దె మెదడుతోనే
కాపురమని ఖరారు
కాలం లెక్కలు కుదుర్చుకున్నాక
బాగోగులకై భారీగానే తకరారు
నిశ్శబ్దం తాలూకు విస్ఫోటమే
ఎన్నో ఆరాటాలు పోరాటాల మధ్య
శరీరాన్ని అద్దెకు తీసుకుని సాగుతుంటే
ఉన్న మెదడు వదిలి అద్దె మెదడుతోనే
కాపురమని ఖరారు
కాలం లెక్కలు కుదుర్చుకున్నాక
బాగోగులకై భారీగానే తకరారు
రంగులు పొంగులు హంగుగానే
మాట్లాడుకున్నాయి
అహంకారాలు ఆడంబరాలు
అలంకరణలయ్యాయి
ఉప్పూకారంలో ఊరబెడుతూ
కోర్కెల సెగలో చల్లబడుతూ
నరనరాన్ని నాట్యం చేయించటమే
వుంటుందక్కడ అన్నారు
ఇంకేముంది
కరుకుతనం ఇరుకుతనం ఇరుసుల్లో
శరీరం దాని పని అది చేసుకుపోతోంది
కళ్ళూ కాళ్ళూ
నిగ్రహంతోనో ఆగ్రహంగానో
అద్దె మెదడులో అమరలేక
అతకలేక అల్లాడిపోతుంటాయి
నియంత్రణలేని తనంతో
నిరాశగా పగటి పరకలను
చీలుస్తూ కట్టలు కడుతూంటాను
రేయి రమించాక దులపుకోవాలంటూ
నిస్పృహలు గోడలునిండా అతుక్కుంటే
నిశీధిని కిటికీలకు అలుకుతూంటాను
ఆక్షేపణల మధ్య అస్తిత్వం కోసం
ఎప్పుడూ లోపల్లోపల
అప్పుడప్పుడూ బయట
నాతో నాకు సమస్యే మరి
రక్తమాంసాల్లో మాత్రం తీవ్రమైన జ్వాల
ఒక కాంతి రేఖగా మెరవాలని
ఒక పచ్చని చిత్రంగా ఒదగాలని
ఒక సెలయేరులా శీతలత్వాన్ని పూయాలని
నిరంతర ప్రయాసతో పయనం
దాహానికైనా దహనానికైనా దేహమేగా
బాడుగ భారాన్ని బలవంతంగా మోసుకుంటూ
దుఃఖసాగరాన్ని తలగడలో దాచుకుంటూ
ఎన్నిసార్లు మరణించానో లెక్క తేల్చలేను
క్షమించండి
జీవించటం నాకు చాతకావటం లేదు
మాట్లాడుకున్నాయి
అహంకారాలు ఆడంబరాలు
అలంకరణలయ్యాయి
ఉప్పూకారంలో ఊరబెడుతూ
కోర్కెల సెగలో చల్లబడుతూ
నరనరాన్ని నాట్యం చేయించటమే
వుంటుందక్కడ అన్నారు
ఇంకేముంది
కరుకుతనం ఇరుకుతనం ఇరుసుల్లో
శరీరం దాని పని అది చేసుకుపోతోంది
కళ్ళూ కాళ్ళూ
నిగ్రహంతోనో ఆగ్రహంగానో
అద్దె మెదడులో అమరలేక
అతకలేక అల్లాడిపోతుంటాయి
నియంత్రణలేని తనంతో
నిరాశగా పగటి పరకలను
చీలుస్తూ కట్టలు కడుతూంటాను
రేయి రమించాక దులపుకోవాలంటూ
నిస్పృహలు గోడలునిండా అతుక్కుంటే
నిశీధిని కిటికీలకు అలుకుతూంటాను
ఆక్షేపణల మధ్య అస్తిత్వం కోసం
ఎప్పుడూ లోపల్లోపల
అప్పుడప్పుడూ బయట
నాతో నాకు సమస్యే మరి
రక్తమాంసాల్లో మాత్రం తీవ్రమైన జ్వాల
ఒక కాంతి రేఖగా మెరవాలని
ఒక పచ్చని చిత్రంగా ఒదగాలని
ఒక సెలయేరులా శీతలత్వాన్ని పూయాలని
నిరంతర ప్రయాసతో పయనం
దాహానికైనా దహనానికైనా దేహమేగా
బాడుగ భారాన్ని బలవంతంగా మోసుకుంటూ
దుఃఖసాగరాన్ని తలగడలో దాచుకుంటూ
ఎన్నిసార్లు మరణించానో లెక్క తేల్చలేను
క్షమించండి
జీవించటం నాకు చాతకావటం లేదు