అంతా సుఖమే అని భ్రమిస్తున్న జీవితంలో
కపటం చేసే కల్లోలం ఎంతో
ఒక కల నుంచి ఇంకో కలకు దొర్లిన చప్పుడు
ఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖానికి పొర్లిన చప్పుడు
తెలియని గోడల్లో కన్నీళ్ళ చప్పుడు
కూలిన ఆశల శిధిలాల్లో
ఎగరలేని ఆలోచనల చప్పుడు
పచ్చని ఆకులు పగిలిన చప్పుడు
రెక్కలు విరిగిన చప్పుడు
పాట ఆగిన చప్పుడు
శ్వాస వీడిన చప్పుడు
ఆరాటాలు పోరాటాలు అలిసిన చప్పుడు
ఆఖరి పర్వంలో చీదరింపుల చప్పుడు
మనిషికి మనుగడకు మధ్య నలిగిన చప్పుడు
దిక్కులు పిక్కటిల్లిన చప్పుళ్ళ మధ్య
తేల్చుకోలేక
పోల్చుకోలేక
తెగింపులేక
మృత్యుశీతల స్పర్శలో
ఘనీభవించినపుడు
గర్వంతో ఉప్పొంగి పోవడం చాతకాలేదెపుడు
మాట్లాడుతూ
పోట్లాడుతూ
నేలకొరిగినపుడు
ఒక్కో పిలుపు
ఒక్కో ముఖం
జ్ఞాపకాల పేజీలు తిప్పుతుంటే
గతం కాకులు పొడుస్తున్న ఎద్దుపుండు మరువనీయదెపుడు
నీవెంటే మేమంటూ
తంత్రాంగాలో మంత్రాంగాలో
స్వచ్ఛత కోసం సాగుతున్న యంత్రాంగంలో
వాదించేవి
బంధాలె కాదు
బాధ్యతలు కూడా
వేధించేవి
జ్ఞాపకాలే కాదు
అనుభవాలు కూడా
కపటం చేసే కల్లోలం ఎంతో
ఒక కల నుంచి ఇంకో కలకు దొర్లిన చప్పుడు
ఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖానికి పొర్లిన చప్పుడు
తెలియని గోడల్లో కన్నీళ్ళ చప్పుడు
కూలిన ఆశల శిధిలాల్లో
ఎగరలేని ఆలోచనల చప్పుడు
పచ్చని ఆకులు పగిలిన చప్పుడు
రెక్కలు విరిగిన చప్పుడు
పాట ఆగిన చప్పుడు
శ్వాస వీడిన చప్పుడు
ఆరాటాలు పోరాటాలు అలిసిన చప్పుడు
ఆఖరి పర్వంలో చీదరింపుల చప్పుడు
మనిషికి మనుగడకు మధ్య నలిగిన చప్పుడు
దిక్కులు పిక్కటిల్లిన చప్పుళ్ళ మధ్య
తేల్చుకోలేక
పోల్చుకోలేక
తెగింపులేక
మృత్యుశీతల స్పర్శలో
ఘనీభవించినపుడు
గర్వంతో ఉప్పొంగి పోవడం చాతకాలేదెపుడు
మాట్లాడుతూ
పోట్లాడుతూ
నేలకొరిగినపుడు
ఒక్కో పిలుపు
ఒక్కో ముఖం
జ్ఞాపకాల పేజీలు తిప్పుతుంటే
గతం కాకులు పొడుస్తున్న ఎద్దుపుండు మరువనీయదెపుడు
నీవెంటే మేమంటూ
తంత్రాంగాలో మంత్రాంగాలో
స్వచ్ఛత కోసం సాగుతున్న యంత్రాంగంలో
వాదించేవి
బంధాలె కాదు
బాధ్యతలు కూడా
వేధించేవి
జ్ఞాపకాలే కాదు
అనుభవాలు కూడా