నేను రాసేవి కవితలు కావు
గుర్తు తెలియని హృదయం
నన్ను గేలిచేస్తుంది
ఒంటరితనం నన్ను వేధిస్తుంది..
ఎవరొ నన్ను తరుముతున్నారు
గమ్యిం తెలియని ....దారే తెలియని
దిక్కే లేని వైపు పరుగులు పెడుతున్నా
నా రాతల్లోనిది కవిత్వమే కాదు
కల్పన కూడా అందులో లేదు
నా మౌన స్వరానికి తర్జుమాయే
చేస్తూ వాటిని అక్షరాలుగా
మార్చి నన్ను నేను
ఏమార్చుకుంటున్న క్షనాలే ఇవి
అర్ధం కాని వ్యర్దమైన భావలే ఇవి
అప్పుడప్పుడు గుండెలయలే
ఊసులై పదమాలికను
పరుపులుగా పేరుస్తున్నా
కొన్నిసార్లు కన్నీళ్ళే
నా కవితలకి కారణమై ఉప్పొంగి పొర్లుతున్నాయి
చావుబ్రతుకుల సారమెరుగని నాకు
నిజానికి అబద్దానికి మద్య నలిగిన నిజాలే ఇవి
అబద్దాలని నీ మనసుకు సర్ది
చెప్పుకున్నా అవి నిజాలు కాకపోవుగా
గుర్తు తెలియని హృదయం
నన్ను గేలిచేస్తుంది
ఒంటరితనం నన్ను వేధిస్తుంది..
ఎవరొ నన్ను తరుముతున్నారు
గమ్యిం తెలియని ....దారే తెలియని
దిక్కే లేని వైపు పరుగులు పెడుతున్నా
నా రాతల్లోనిది కవిత్వమే కాదు
కల్పన కూడా అందులో లేదు
నా మౌన స్వరానికి తర్జుమాయే
చేస్తూ వాటిని అక్షరాలుగా
మార్చి నన్ను నేను
ఏమార్చుకుంటున్న క్షనాలే ఇవి
అర్ధం కాని వ్యర్దమైన భావలే ఇవి
అప్పుడప్పుడు గుండెలయలే
ఊసులై పదమాలికను
పరుపులుగా పేరుస్తున్నా
కొన్నిసార్లు కన్నీళ్ళే
నా కవితలకి కారణమై ఉప్పొంగి పొర్లుతున్నాయి
చావుబ్రతుకుల సారమెరుగని నాకు
నిజానికి అబద్దానికి మద్య నలిగిన నిజాలే ఇవి
అబద్దాలని నీ మనసుకు సర్ది
చెప్పుకున్నా అవి నిజాలు కాకపోవుగా