రాయాలని కలం పట్టగానే
ముసిరే ఆలోచనలు
కాస్త కళ్ళుమూస్తే
ఓ అస్పష్టపు రూపం
పదే పదే
మనసు మానిటర్ పై
కదుల్తూ వెంటాడుతోంది
అందమైన ఆ రూపం
నా మనస్సు
ఎప్పుడూ నాతో పోరాడుతూ
మాట్లాడుతోది, ఏడ్పిస్తోంది
ముసిరే ఆలోచనలు
కాస్త కళ్ళుమూస్తే
ఓ అస్పష్టపు రూపం
పదే పదే
మనసు మానిటర్ పై
కదుల్తూ వెంటాడుతోంది
అందమైన ఆ రూపం
నా మనస్సు
ఎప్పుడూ నాతో పోరాడుతూ
మాట్లాడుతోది, ఏడ్పిస్తోంది
చెంపలపై చారికల్ని
తుడుచుకుంటూ
చివరి మజిలీకి సాగిపోతున్న
నా దేహంపై
ఎవరో రక్తాన్ని జల్లుతున్నారు
చీకటి నేత్రంలోపడి
కబేళాల కండలుగా దేహాన్ని కోస్తున్న
కత్తుల ఉచ్చుల్లో బిగిసిన
జ్ఞాపకం పుండులా మారి వేదిస్తోంది
జ్ఞాపకంలో చిక్కుకొని మనస్సు
గిలగిలలాడినప్పుడు
చెదపట్టిన చెట్టులా
శిధిలమౌతున్న జీవనాన్ని
ఎవరిదాహార్తికోసమో నిలువునా
తగలబెట్టుకొంటున్నానేమో