శిశిరంలో ఒక సాయంత్రం
చెట్ల నీడల్లో అంతులేని తాత్వికత
పక్షుల గూళ్ళల్లో చింతలేని సాత్వికత
ఏటి గలగలల్లో ఎంచలేని మార్మికత
అనుకోకుండానే అనుభూతుల ఉపరితలం మీద
అందమైన గులాబీ మొగ్గ తొడుగుతుంది
అలవాటుగానే నీతో అడుగులు కలుపుతాను
ప్రేమమయమైన చిరుగాలి తోడు వస్తానంటుంది
భావమయమైన హృదయకలం నెమలికుంచెలా
నిన్ను అన్ని కళ్ళతో పలకరిస్తూ వుంటుంది
నిశ్శబ్ద క్షణాల గుసగుసల్లో
ఎవరెవరో నడుస్తూ పరిగెత్తుతూ
పడిపోతూ, లేచి ఒగరుస్తూ
సమయాన్ని ఇంతకంటే గొప్పగా
గడపలేమంటూ నిర్లక్ష్యపు నసనసలు
బాధపడుతూ భగ్నపడుతూ
సొంతం కానీ శరీరాలంటారు
కనిపించని ఆత్మలమంటారు
అంతలేని ఆవేదనంటారు
పొంతనలేని మాటలు వింటూంటాను
ఈ రుసరుసల్లో
నిన్ను మాత్రం అదే ధ్యానంతో
అంతే ఆరాధనతో
జీవితపు పుటల్లో మరో పుటని
ఆసక్తిగా, ఆలోచనగా
ఆత్రంగా, ఆప్యాయంగా
రాసుకుంటూనే వుంటాను
ఖాళీని నింపుకుంటూనే వుంటాను
(ఈ కవిత కాపీ చెయ్యలేదు ..
బాగుందని నాకు ఎవరో పంపితే పోష్టుచేశా )
చెట్ల నీడల్లో అంతులేని తాత్వికత
పక్షుల గూళ్ళల్లో చింతలేని సాత్వికత
ఏటి గలగలల్లో ఎంచలేని మార్మికత
అనుకోకుండానే అనుభూతుల ఉపరితలం మీద
అందమైన గులాబీ మొగ్గ తొడుగుతుంది
అలవాటుగానే నీతో అడుగులు కలుపుతాను
ప్రేమమయమైన చిరుగాలి తోడు వస్తానంటుంది
భావమయమైన హృదయకలం నెమలికుంచెలా
నిన్ను అన్ని కళ్ళతో పలకరిస్తూ వుంటుంది
నిశ్శబ్ద క్షణాల గుసగుసల్లో
ఎవరెవరో నడుస్తూ పరిగెత్తుతూ
పడిపోతూ, లేచి ఒగరుస్తూ
సమయాన్ని ఇంతకంటే గొప్పగా
గడపలేమంటూ నిర్లక్ష్యపు నసనసలు
బాధపడుతూ భగ్నపడుతూ
సొంతం కానీ శరీరాలంటారు
కనిపించని ఆత్మలమంటారు
అంతలేని ఆవేదనంటారు
పొంతనలేని మాటలు వింటూంటాను
ఈ రుసరుసల్లో
నిన్ను మాత్రం అదే ధ్యానంతో
అంతే ఆరాధనతో
జీవితపు పుటల్లో మరో పుటని
ఆసక్తిగా, ఆలోచనగా
ఆత్రంగా, ఆప్యాయంగా
రాసుకుంటూనే వుంటాను
ఖాళీని నింపుకుంటూనే వుంటాను
(ఈ కవిత కాపీ చెయ్యలేదు ..
బాగుందని నాకు ఎవరో పంపితే పోష్టుచేశా )