ఎలా చెప్పను చెలి
హృదయపు తెల్ల కాగితం మీద
తొలి సంతకం నీవు
తెల్లటి మనసుపై
పిచ్చిగీతల్లా మారిన
ఓ విరిగిపీయిన జ్ఞాపకాన్ని నేను
కాలం విడిచిన
అనుభవాల పొరల్లో
చెదరని తీపిగుర్తువు నీవు
కన్నెర్ర చేసినా
నిన్నొదలని గజ్జికుక్కను నేను
సర్దుబాటుతో
గడిపే సంఘటనలెన్నున్నా
గుండెను కుదిపె స్పందన నీవు
మదిలో మెదిలినా
గుర్తుకురాని వసంతాన్ని నేను
ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు
కలిసినా తడి ఆరని
వెచ్చని తొలిముద్దువు నీవు
తడి ఆరిన పెదాల్లొ
ఎండిపోయిన చర్మాన్ని నేను
వేదనలాంటి వేసవిలో
నిరాశా నిస్పృహలతో ఉంటే
చల్లగా సేద తీర్చే చిరుజల్లువు నీవు
మెల్లగా జరిపోయిన నీటి బిందువు నేను
మోడుబారినా, మసకబారినా
నిత్యం కొత్త వెలుగు ప్రసరించే
నిత్య ఉగాదివి నీవు
వాడిపోయిన వసంతాన్ని నేను
కంటికి నీవు దూరమైనా
చిరునామా ఏదో చెదిరిపోయినా
తెలియని ఆశతో నడిపించే ఇంధనం నీవు
ఆ ఈందనంలో కాలిపోయిన కాగితం నేను
హృదయపు తెల్ల కాగితం మీద
తొలి సంతకం నీవు
తెల్లటి మనసుపై
పిచ్చిగీతల్లా మారిన
ఓ విరిగిపీయిన జ్ఞాపకాన్ని నేను
కాలం విడిచిన
అనుభవాల పొరల్లో
చెదరని తీపిగుర్తువు నీవు
కన్నెర్ర చేసినా
నిన్నొదలని గజ్జికుక్కను నేను
సర్దుబాటుతో
గడిపే సంఘటనలెన్నున్నా
గుండెను కుదిపె స్పందన నీవు
మదిలో మెదిలినా
గుర్తుకురాని వసంతాన్ని నేను
ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు
కలిసినా తడి ఆరని
వెచ్చని తొలిముద్దువు నీవు
తడి ఆరిన పెదాల్లొ
ఎండిపోయిన చర్మాన్ని నేను
వేదనలాంటి వేసవిలో
నిరాశా నిస్పృహలతో ఉంటే
చల్లగా సేద తీర్చే చిరుజల్లువు నీవు
మెల్లగా జరిపోయిన నీటి బిందువు నేను
మోడుబారినా, మసకబారినా
నిత్యం కొత్త వెలుగు ప్రసరించే
నిత్య ఉగాదివి నీవు
వాడిపోయిన వసంతాన్ని నేను
కంటికి నీవు దూరమైనా
చిరునామా ఏదో చెదిరిపోయినా
తెలియని ఆశతో నడిపించే ఇంధనం నీవు
ఆ ఈందనంలో కాలిపోయిన కాగితం నేను