. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, October 16, 2014

ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట మూగబొయిన జ్ఞాపకం ఇది

నా మనసులో ఏముందో వ్రాయాలి. కానీ ఎలా? ఎక్కడనుండీ మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి? ప్రేమలేఖలయితే ఎందరో వ్రాసారు. రిఫరెన్స్ దొరుకుతాయి. మరి గతంలో ఎవరయినా మనసులో మాట వ్రాసుంటారా? వ్రాస్తే మాత్రం బయటకి చెప్పుకుంటారా? ప్రేమ అనే పదానికి.. సారీ భావానికి అర్ధాన్ని వివరించాలని చరిత్రలో మొదటి పేజీ నుండి ఎందరో ప్రయత్నించారు. ఆ మహాయఙ్ఞానికి నేను సయితం సమిధనిచ్చా. అయినా ఆ మహాశక్తి విశ్వరూపం ఆవిష్కరింపబడలేదు. నిజమే అదే జరుగుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా ఏమిటి? అయినా పదాలని వివరించగలంగానీ భావాల్ని అందులోనూ ప్రేమని నిర్వచించాలనుకోవటం ఏంటి నా వెర్రి కానీ.
సరే ప్రేమని నిర్వచించలేను మరి నా మనసులో ఏముందో..పెద్ద కవిసామ్రాట్ లా ఫోజుకొట్టేవాడినాయే మనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పు అందరిలా బేలగా ఉంటే ఎలా? నాకేంటనో, నీ దురదృష్టం అనో అర్ధంవచ్చే కవిత ఒకటి అలవోకగా అలా అలా ఆశువుగా వదిలి, దర్పంగా కళ్ళు ఎగరేయాల్సిందే. అమ్మో అలా అయితే అందరూ వీడికి పొగరు అందుకే ఇలా జరిగింది అనుకుంటారేమో? గెలిచినా, ఓడినా సింపథీ ఎప్పుడూ మనవైపే ఉండేలా చూసుకోవాలి మరదే మానవనైజం. మరలా అయితే విధి ఆడే వికృత క్రీడ అనో, కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం బ్రహ్మ అనో అర్ధమొచ్చేలా వేదాంతంలోకి పోతే ఎలా ఉంటుంది? ఇందులో కుడా ఇబ్బంది ఉంది మరి. చూసేవాళ్ళు వయస్సేమో పాతిక, వ్రాసేది మోసేది పాత చింతకాయ పచ్చడి అంటారు. పోనీ “వదిలిపోకు నేస్తమా, నా జీవిత ప్రయాణపు చివరి మజిలీలో.” “ఙ్ఞాపకాల తట్ట నా నెత్తిన పెట్టే సహాయం మాత్రమే చేస్తావు. నా తోడు రావు. నేనెప్పుడూ ఒంటరినే అమ్ముకుంటూ ఉంటా భావావేశాన్ని ఈ విశాలరహదారుల్లో బాటసారులకి..” ఇలా రాస్తే. ఖచ్చితంగా కొందరు జాలి చూపిస్తారు. కొందరు పైశాచిక ఆనందం పొందుతారు. ఇంకొందరు ప్రాక్టికాలిటీ లేదని తేల్చేస్తారు. అయినా నేను ఏం వ్రాస్తున్నా? ఎవరికి వ్రాస్తున్నా? పార్టింగ్ నోట్ ఏమయినా శ్వేత పత్రమా? బహిరంగలేఖా? మరి ఎవరెవరో దీనికి ఎందుకు స్పందిస్తారు? పక్కవాడి వ్యక్తిగత విషయాలు అందులోనూ, ప్రేమ విషయాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో కదా!
మొత్తానికి ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నా. ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పుమనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పు ఒక దృశ్యమా? ఒక ఙ్ఞాపకమా? ఒక సంఘటనా? అసలుమనసులో మాట అంటే ప్రేమ లేఖ కాదా? “నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..” “నిన్ను ప్రేమించే నేను నీ మనసుని భాందిచలేక మౌనంగా రోదిస్తూ వెళ్ళిపోతున్నా..” “నా మనసులో అపురూప కావ్యంలా ఒక గేయంలా నిలుస్తావనుకున్నా, కానీ ఒక మరుపురాని గాయంలా నిలిచిపోయావు” ఇవన్నీ మనలోని ప్రేమని చెప్పేవేగా మరలాంటప్పుడు ఇవి ప్రేమలేఖలు కావా? కాకపోతే మరి ప్రేమలేఖ అంటే ఏంటి? నాకు ఇప్పుడు మెల్లగా అర్ధమవుతుంది ప్రపంచమంతా ప్రేమనే భావంలో కాదు భ్రమలో మునిగితేలుతున్నారని. మనమంతా పువ్వుయొక్క సువాసనని అనుభూతి చెందుతున్నాం తప్పా, నిజమైన పువ్వుని, దానిలో నిఘూడమైన అందాలని,రహస్యాలని కనుగొనలేకపోయాం అని. కేవలం అనుభూతుల అలలే ఇంత ఆవేశాన్ని,ఉన్మాదాన్ని కలిగిస్తే, నిజంగా ప్రేమసాగరంలో ఆకేంద్రంలో లోతుల్లో ఇంకెంత విలయం ఉందో, అది ప్రపంచాన్ని ఇంకెంత కుదిపేస్తుందో కదా! కాదు కాదు నిజంగా ఆ ఉన్నత భావం విశ్వరూపం సందర్శనమయితే, నిజరూపం ఆవిష్కరింపబడితే మన మానవ మేధస్సు అర్ధం చేసుకోగలిగితే…. అరరే నేను ఏమి వ్రాస్తున్నా? నాకేమయింది? నేను వ్రాయాల్సింది మనసులో మాట కదా?నా ముందిప్పుడు రెండు మార్గాలున్నాయి. ఒకటి నా మనస్సు మీద కమ్ముకున్న ముసుగులను,ఇగోలను,అపోహలను,అందరూ ఏమంటారో అనే స్పృహను ప్రక్కనపెట్టాలి. అప్పుడే నాతో నేనే నటిస్తూ, నన్ను నేనే మోసంచేసుకునే పరిస్థితిని దాటగలను. లేదా పార్టింగ్‌నోట్ అనే ఆలోచనను పూర్తిగా వదిలేయాలి. మొదటిదే చేస్తా ఎందుకంటే అందరిముందు మంచి ఇంప్రెషన్ సంపాదించటం నాకు ముఖ్యం కాదేమో ఇప్పుడు. అన్ని ముసుగులను ఆభిజాత్యాలను వదిలేసా. నేను నేనుగా ఉన్నా. కాదు కాదు, నా మనస్సు కేవలం ఒక మనస్సుగా మిగిలింది. నేను అనే ప్రభావం, నా ఆలోచనలు దాని పైన లేవు. మకిలిపట్టిన ముత్యపు చిప్పలో అపురూపంగా దాచబడ్డ ముత్యంలా ఉన్న మనస్సు. ఇప్పుడు వ్రాయాలనే స్పృహ నాకు లేదు. నా మనస్సు నడిపిస్తుంది.
” ఎప్పుడూ నా జీవితంలో సంభోదన శూన్యమేనేమో. సరే కానీ..
ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోయినా, మొదలుపెట్టక తప్పదుగా. వీడుకోలు తప్పదని తేల్చేసావుగా. అందుకే ఎవరికీ అన్యాయం జరగకుండా పెంచుకున్న భందాన్ని, పంచుకున్న అనుభూతుల్ని చెరిసగం వాటా వేసేద్దామని ఈ లేఖ. 
 ఙ్ఞాపకాలను నా గుండెలో కుడ్యచిత్రాలుగా చిత్రించి, ఆ దృశ్యాల్లో నన్ను నేను లిఖించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇన్నివేల క్షణాలకి శ్రోతను కాగలిగానే కానీ ప్రత్యక్ష సాక్షిని కాలేని నా దురదృష్టాన్ని నిందిచుకుంటున్నా. ఏరోజుకైనా శాశ్వతంగా నా వద్దకు వచ్చేస్తావుగా అనుకున్నా. కానీ ఈరోజున ఇలా వదిలివెళ్ళిపోతావని 
ఎప్పుడయినా నువ్వు కిచెన్ లో ఒంటరిగా వంటచేస్తున్నప్పుడు, అల్లరిగా నాచేతులు నిన్ను అల్లుకుంటాయన్న ఆలోచన నీకెప్పుడు రాదని మాటిస్తే ఖచ్చితంగా చెరిపేస్తా. భవిష్యత్తులో నీసొంతవాళ్లయినా “ఐ లవ్ యూ” అని చెప్పినప్పుడు. వాడు పదే పదే చెప్పే ఈమాటలో ఉండే ఫీల్ వీళ్ళు మొదటిసారి చెప్పినప్పుడు కూడా లేదేంటి? అనే అనుమానం ఎప్పటికీ కలగదని మాటివ్వు. నువ్వడిగినట్టే ఙ్ఞాపకాల్ని అతకలేని ముక్కలు చేసేద్దాం.” అంతకు మించి ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ...అన్నీ తెల్సి నన్ను నేను మోసం చేసుకొంటూ నేనేంటో తెల్సిన క్షనాలు కదా ఇవి