. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, October 28, 2014

నాకు నేను ఓంటరిగా మిగిలిన చేదు జ్ఞాపకాన్ని నేను

ఎలా  చెప్పను  చెలి
హృదయపు తెల్ల కాగితం మీద
తొలి సంతకం నీవు
తెల్లటి మనసుపై 
పిచ్చిగీతల్లా మారిన
ఓ విరిగిపీయిన జ్ఞాపకాన్ని నేను 

కాలం విడిచిన
అనుభవాల పొరల్లో
చెదరని తీపిగుర్తువు నీవు
కన్నెర్ర చేసినా
నిన్నొదలని గజ్జికుక్కను నేను

సర్దుబాటుతో
గడిపే సంఘటనలెన్నున్నా
గుండెను కుదిపె స్పందన నీవు
మదిలో మెదిలినా 
గుర్తుకురాని వసంతాన్ని నేను
ఎన్నాళ్ళకు ఎన్నేళ్ళకు
కలిసినా తడి ఆరని
వెచ్చని తొలిముద్దువు నీవు
తడి ఆరిన పెదాల్లొ 
ఎండిపోయిన చర్మాన్ని నేను 

వేదనలాంటి వేసవిలో
నిరాశా నిస్పృహలతో ఉంటే
చల్లగా సేద తీర్చే చిరుజల్లువు నీవు
మెల్లగా జరిపోయిన నీటి బిందువు నేను

మోడుబారినా, మసకబారినా
నిత్యం కొత్త వెలుగు ప్రసరించే
నిత్య ఉగాదివి నీవు
వాడిపోయిన వసంతాన్ని నేను

కంటికి నీవు దూరమైనా
చిరునామా ఏదో చెదిరిపోయినా
తెలియని ఆశతో నడిపించే ఇంధనం నీవు
ఆ ఈందనంలో కాలిపోయిన కాగితం నేను 

Monday, October 27, 2014

తడిసిన మట్టి వాసనతో నేనేంటో నని వింత ప్రశ్నలు వేదిస్తాయి

కిటికీ లోంచీ వర్షాన్ని చూస్తుంటే
తెలియని రసప్రపంచపు 
రహస్య ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
మనసు రహస్యపు ద్వారాలు 
తెరచుకొని ఉప్పోగే  ఉద్వేగం 
చిరుజల్లులై నను తాకాలని 
తొందర పెడుతున్నట్టు 
నీ నవ్వుల సవ్వడిలా 
మనసును ఉల్లాస పరుస్తాయి
కాని అంతలోనే ఎదో తెలీని దిగులు
ఆకాశపు నల్లటి మేఘాల్లా కమ్ముకొంటాయి  
ఎక్కడీ ఎదో అలజది నను కమ్మేస్తుంది
నీలిరంగు చీకటిలో నీడలు కదలాడినట్లు
మార్మిక ఛాయలేవో మనసును కలవరపెడతాయి
తడిసిన మట్టి వాసనతో 
గాలి శరీరాన్ని చుడితే
సాంద్రమూ సన్నిహితమూ 
అయిన స్వప్నమేదో స్పర్శించినట్లుంటుంది
ఈ వింత అనుబూతిలో 
అంతటి చల్లని చలిలో కూడా
నేను పూర్తిగా తగలబడిన 
వాసన నాలోనుండీ పొగలై వస్తున్నట్టు
అనిపిస్తూ నన్ను నేను దహించి వేస్తుంది
నీ అలొచనలు నన్ను దగ్దం చేసే మంటల్లా
నన్ను చుట్టు ముట్టి దహించి వేస్తుంటాయి 

Thursday, October 16, 2014

ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట మూగబొయిన జ్ఞాపకం ఇది

నా మనసులో ఏముందో వ్రాయాలి. కానీ ఎలా? ఎక్కడనుండీ మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి? ప్రేమలేఖలయితే ఎందరో వ్రాసారు. రిఫరెన్స్ దొరుకుతాయి. మరి గతంలో ఎవరయినా మనసులో మాట వ్రాసుంటారా? వ్రాస్తే మాత్రం బయటకి చెప్పుకుంటారా? ప్రేమ అనే పదానికి.. సారీ భావానికి అర్ధాన్ని వివరించాలని చరిత్రలో మొదటి పేజీ నుండి ఎందరో ప్రయత్నించారు. ఆ మహాయఙ్ఞానికి నేను సయితం సమిధనిచ్చా. అయినా ఆ మహాశక్తి విశ్వరూపం ఆవిష్కరింపబడలేదు. నిజమే అదే జరుగుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా ఏమిటి? అయినా పదాలని వివరించగలంగానీ భావాల్ని అందులోనూ ప్రేమని నిర్వచించాలనుకోవటం ఏంటి నా వెర్రి కానీ.
సరే ప్రేమని నిర్వచించలేను మరి నా మనసులో ఏముందో..పెద్ద కవిసామ్రాట్ లా ఫోజుకొట్టేవాడినాయే మనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పు అందరిలా బేలగా ఉంటే ఎలా? నాకేంటనో, నీ దురదృష్టం అనో అర్ధంవచ్చే కవిత ఒకటి అలవోకగా అలా అలా ఆశువుగా వదిలి, దర్పంగా కళ్ళు ఎగరేయాల్సిందే. అమ్మో అలా అయితే అందరూ వీడికి పొగరు అందుకే ఇలా జరిగింది అనుకుంటారేమో? గెలిచినా, ఓడినా సింపథీ ఎప్పుడూ మనవైపే ఉండేలా చూసుకోవాలి మరదే మానవనైజం. మరలా అయితే విధి ఆడే వికృత క్రీడ అనో, కధ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం బ్రహ్మ అనో అర్ధమొచ్చేలా వేదాంతంలోకి పోతే ఎలా ఉంటుంది? ఇందులో కుడా ఇబ్బంది ఉంది మరి. చూసేవాళ్ళు వయస్సేమో పాతిక, వ్రాసేది మోసేది పాత చింతకాయ పచ్చడి అంటారు. పోనీ “వదిలిపోకు నేస్తమా, నా జీవిత ప్రయాణపు చివరి మజిలీలో.” “ఙ్ఞాపకాల తట్ట నా నెత్తిన పెట్టే సహాయం మాత్రమే చేస్తావు. నా తోడు రావు. నేనెప్పుడూ ఒంటరినే అమ్ముకుంటూ ఉంటా భావావేశాన్ని ఈ విశాలరహదారుల్లో బాటసారులకి..” ఇలా రాస్తే. ఖచ్చితంగా కొందరు జాలి చూపిస్తారు. కొందరు పైశాచిక ఆనందం పొందుతారు. ఇంకొందరు ప్రాక్టికాలిటీ లేదని తేల్చేస్తారు. అయినా నేను ఏం వ్రాస్తున్నా? ఎవరికి వ్రాస్తున్నా? పార్టింగ్ నోట్ ఏమయినా శ్వేత పత్రమా? బహిరంగలేఖా? మరి ఎవరెవరో దీనికి ఎందుకు స్పందిస్తారు? పక్కవాడి వ్యక్తిగత విషయాలు అందులోనూ, ప్రేమ విషయాలు ఎంత ఆసక్తిగా ఉంటాయో కదా!
మొత్తానికి ఎక్కడ మొదలుపెట్టానో అక్కడే ఉన్నా. ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పుమనసులో మాట ఏంటి మూగబొయిన జ్ఞాపకం ఏంటి చెప్పు ఒక దృశ్యమా? ఒక ఙ్ఞాపకమా? ఒక సంఘటనా? అసలుమనసులో మాట అంటే ప్రేమ లేఖ కాదా? “నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..” “నిన్ను ప్రేమించే నేను నీ మనసుని భాందిచలేక మౌనంగా రోదిస్తూ వెళ్ళిపోతున్నా..” “నా మనసులో అపురూప కావ్యంలా ఒక గేయంలా నిలుస్తావనుకున్నా, కానీ ఒక మరుపురాని గాయంలా నిలిచిపోయావు” ఇవన్నీ మనలోని ప్రేమని చెప్పేవేగా మరలాంటప్పుడు ఇవి ప్రేమలేఖలు కావా? కాకపోతే మరి ప్రేమలేఖ అంటే ఏంటి? నాకు ఇప్పుడు మెల్లగా అర్ధమవుతుంది ప్రపంచమంతా ప్రేమనే భావంలో కాదు భ్రమలో మునిగితేలుతున్నారని. మనమంతా పువ్వుయొక్క సువాసనని అనుభూతి చెందుతున్నాం తప్పా, నిజమైన పువ్వుని, దానిలో నిఘూడమైన అందాలని,రహస్యాలని కనుగొనలేకపోయాం అని. కేవలం అనుభూతుల అలలే ఇంత ఆవేశాన్ని,ఉన్మాదాన్ని కలిగిస్తే, నిజంగా ప్రేమసాగరంలో ఆకేంద్రంలో లోతుల్లో ఇంకెంత విలయం ఉందో, అది ప్రపంచాన్ని ఇంకెంత కుదిపేస్తుందో కదా! కాదు కాదు నిజంగా ఆ ఉన్నత భావం విశ్వరూపం సందర్శనమయితే, నిజరూపం ఆవిష్కరింపబడితే మన మానవ మేధస్సు అర్ధం చేసుకోగలిగితే…. అరరే నేను ఏమి వ్రాస్తున్నా? నాకేమయింది? నేను వ్రాయాల్సింది మనసులో మాట కదా?నా ముందిప్పుడు రెండు మార్గాలున్నాయి. ఒకటి నా మనస్సు మీద కమ్ముకున్న ముసుగులను,ఇగోలను,అపోహలను,అందరూ ఏమంటారో అనే స్పృహను ప్రక్కనపెట్టాలి. అప్పుడే నాతో నేనే నటిస్తూ, నన్ను నేనే మోసంచేసుకునే పరిస్థితిని దాటగలను. లేదా పార్టింగ్‌నోట్ అనే ఆలోచనను పూర్తిగా వదిలేయాలి. మొదటిదే చేస్తా ఎందుకంటే అందరిముందు మంచి ఇంప్రెషన్ సంపాదించటం నాకు ముఖ్యం కాదేమో ఇప్పుడు. అన్ని ముసుగులను ఆభిజాత్యాలను వదిలేసా. నేను నేనుగా ఉన్నా. కాదు కాదు, నా మనస్సు కేవలం ఒక మనస్సుగా మిగిలింది. నేను అనే ప్రభావం, నా ఆలోచనలు దాని పైన లేవు. మకిలిపట్టిన ముత్యపు చిప్పలో అపురూపంగా దాచబడ్డ ముత్యంలా ఉన్న మనస్సు. ఇప్పుడు వ్రాయాలనే స్పృహ నాకు లేదు. నా మనస్సు నడిపిస్తుంది.
” ఎప్పుడూ నా జీవితంలో సంభోదన శూన్యమేనేమో. సరే కానీ..
ఎక్కడ మొదలుపెట్టాలో తెలియకపోయినా, మొదలుపెట్టక తప్పదుగా. వీడుకోలు తప్పదని తేల్చేసావుగా. అందుకే ఎవరికీ అన్యాయం జరగకుండా పెంచుకున్న భందాన్ని, పంచుకున్న అనుభూతుల్ని చెరిసగం వాటా వేసేద్దామని ఈ లేఖ. 
 ఙ్ఞాపకాలను నా గుండెలో కుడ్యచిత్రాలుగా చిత్రించి, ఆ దృశ్యాల్లో నన్ను నేను లిఖించుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇన్నివేల క్షణాలకి శ్రోతను కాగలిగానే కానీ ప్రత్యక్ష సాక్షిని కాలేని నా దురదృష్టాన్ని నిందిచుకుంటున్నా. ఏరోజుకైనా శాశ్వతంగా నా వద్దకు వచ్చేస్తావుగా అనుకున్నా. కానీ ఈరోజున ఇలా వదిలివెళ్ళిపోతావని 
ఎప్పుడయినా నువ్వు కిచెన్ లో ఒంటరిగా వంటచేస్తున్నప్పుడు, అల్లరిగా నాచేతులు నిన్ను అల్లుకుంటాయన్న ఆలోచన నీకెప్పుడు రాదని మాటిస్తే ఖచ్చితంగా చెరిపేస్తా. భవిష్యత్తులో నీసొంతవాళ్లయినా “ఐ లవ్ యూ” అని చెప్పినప్పుడు. వాడు పదే పదే చెప్పే ఈమాటలో ఉండే ఫీల్ వీళ్ళు మొదటిసారి చెప్పినప్పుడు కూడా లేదేంటి? అనే అనుమానం ఎప్పటికీ కలగదని మాటివ్వు. నువ్వడిగినట్టే ఙ్ఞాపకాల్ని అతకలేని ముక్కలు చేసేద్దాం.” అంతకు మించి ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నా ...అన్నీ తెల్సి నన్ను నేను మోసం చేసుకొంటూ నేనేంటో తెల్సిన క్షనాలు కదా ఇవి

Friday, October 10, 2014

నన్ను నాలోనుంచి సగంగా చీల్చావు ఏం సాదించావు


ఎప్పటికీ ఇంకిపోదనుకున్న 
ఇంకు హఠాత్తుగా ఇంకిపోయింది
సరదాకు చిరునామా 
జాడలేని లోకాలకు నన్ను నెట్టేస్తున్నావు 
మిగిలి ఉన్న జీవితాన్ని వదిలేసి
ఒక చిరునవ్వును లాగేసుకున్నావు 

తొందరలు.. తొక్కిసలాటలు... 
మితిమీరిపోవటాలు
పత్రికల నిండా.. టీవీల నిండా ఎన్నెన్ని 
ఆత్మాహుతులు.. రక్త ప్రవాహాలు.. క్రౌర్యాలు..
ఎన్ని చూడలేదు.. ఎన్ని రాయలేదు..
నీ దాకా వచ్చేసరికి చిన్న 
పిచ్చి హేతువు చాలిందా 

పైకి కనిపించకుండా లోలోపల తొలచి తొలచివేసే 
బడబాగ్ని వంటి అనుభవం నీకు మాత్రమే తెలుసు
దినం గడుస్తున్న కొద్దీ పలుచబడకుండా గాఢమయిన 
ఆవేదన నీకు మాత్రమే తెలుసు
అంచనాలు తలక్రిందులయినాయి
ఓడిపోయిన అదనంతో తలవంచాను 

ఆ క్షణంలో ఏం జరిగింది
నిన్ను నువ్వు తిరస్కరించుకోలేని 
ఆదేశం నీవే ఇచ్చేసుకున్నావు
నేను  నిర్మించుకున్న 
కలల పరిధులను చేరుకోకముందే 
అచంచలంగా నిశ్చయించుకున్నావ్
మృత్యువు గుహలోకి 
నన్ను నువ్వే తోసేస్తున్నావు
ఎందుకింత తొందర?

ఎంత ఒత్తిడి.. ఎంత వ్యధ..
ఎంత నిరాశ? ఎంత తొక్కిడి..
ఇంతమందిమి ఉన్నాం..
ఎవరమూ వెనక్కి లాగలేకపోయాం
కళ్ల ముందే ఉదయాస్తమయాలు 
యథావిధిగా వెళ్లిపోతున్నాయి
నీవు వదిలి వెళ్లిన ఆ క్షణం 
మాత్రం చిత్తంలో పదిలంగా ఉండిపోయింది

నన్ను నాలోనుంచి సగంగా  చీల్చావు 
మిగిలిన సగంలో ఏదో గుర్తించరాని లోపం
నడకలో... నడతలో మమ్మల్ని ఆవహేళన చేస్తోంది
అందిందంతా అఇష్టమైన చోట పంచుతూ
అయిష్టమైన చీకట్లోనే సంతృప్తిని వెతుక్కున్నావు
నీ వారి ఇష్టాల హోరులో నీ అయిష్టం కలగలిసిపోయింది
ఎదుగుతున్న కొద్దీ ముక్కలుగా తరిగిపోతూ
నువ్వు నడిపిన జీవితం ఒక సమరం
ఇందులో ఓటమి లేదు.. గెలుపు లేదు.

Wednesday, October 8, 2014

చీకటీ రాత్రుల్లలో నీకోసం తడుముకున్న క్షణాల వేదన ఇది ...

రాత్రంటే కేవలం చీకటే కాదు
అందంగా ఆకాశాన్ని చుట్టుకునే నక్షత్రాలూ
చల్లని జాబిల్లి చుట్టూ చేరే
మినుగురు ల చెకుముకి మెరుపులు
రాత్రంటే -ఎందరి ప్రయాసలనో ఒడిలో చేర్చుకొని
లాలించి నిదురపుచ్చే నేస్తం
ఎన్నో హృదయాలను ఒకటిగా కలగలిపే
అమృత ఘడియల సమాహారం 
ఎన్నో మౌనాలను  మేల్కొలిపే
కొందరికి తీయని రాగం,.సరాగాల సమ్మేలనం 
ఎన్నో జ్ఞాపకాలను కొత్తగా
హత్తుకునే జ్ఞాననేత్రం
మనసులో భావాలను 
కల రూపంలో 
మనసుపై చిలకరించుకొని 
నిజంలో ఓడినా 
ఊహల నిద్రలో గెలిచే మధుర క్షనాలు 
నిన్ను నాలో కలుపుకొని 
నీవు దూరమైనా 
ఆక్షనంలో నిన్ను అబద్దంలో గెలుచుకొని
ఊహాలోకంలో తేలుతున్న చివరి క్షనాలు 

కనుపాపలలో... కనురెప్పల చాటున

కనిపించని కారానలెతుక్కొని 
గమ్మత్తు మత్తు 
కమ్ముకున్న దేహం లోపల
అర్ధగోళమూ రాత్రే...చీకటి మాటున సాగే 
నిశ్శబ్దంగా వీచే చెట్ల గుసగుసలు రాత్రి!
పురుడు పోసుకునే వేకువకు
నొప్పుల చీకటి రాత్రి
వెలుగుకు గుర్తింపు నిచ్చేది
ఎన్నో కలాలకు... కలలకు పనిచెప్పేది
ప్రశాంతంగా పడక గదికి మోసుకెళ్లేది
ఓ తియ్యని సందేల గువ్వల
ఊసుల కు మువ్వలు కదిలే రాత్రి 

నీజ్ఞాపకాల అలజడులకు  

ఉలిక్కి పడిలేచి
చిమ్మచీకత్లో ఎవ్వరూ చూడకుండా
ఎదసిపడే హృదయం 
నీకోసం పరితపిస్తూ
మౌనంగా వెక్కి వెక్కి ఏడ్చిన క్షనమూ 
ఆ చీకటీ రాత్రే ..నీవు హాయిగా నిద్రపోతున్నా
ఇక్కడ నీ జ్ఞాపకాలతో 
నిద్రలేని రాత్రుల్లతో 
ఎర్రబడిన గతాన్ని తలచుకొని 
రోదిస్తున్న చీకటి జ్ఞాపకాల రాత్రులు ఇవే 
నీకోసం ఊపిరి ఆగేదాకా 
నాకీ చీకటిమాటున వేదన తప్పదేమో  

Monday, October 6, 2014

నా మనస్సుతో నాకెందుకు ఈ పోరాటం ....?

ఇంత బాధని వొర్చుకోలేవా అని
దైవం ఆభాదను నాకు వదిలేస్తే

ఎవరో ప్రేమించిన మనస్సును 
నాదే అనుకొని అదేనిజమనుకొని
ప్రేమించే వరమనుకుని 
అమాయకంగా తనే కావాలని కోరుకున్నాను,

నను వీడి వెళిపోతుంటే
తిరిగిరానని తేల్చి చెబుతుంటే
పచ్చిగా గుండెలదిరేలా ఏడ్చాను 
ఎందుకు పిచ్చిగా ఆశలు పెట్టుకున్నాను? 
అని నామనసును నేను 
అడిగితే పిచ్చోడా అని తిట్టింది ..

తనకోసం అరచి అరచి
నరాలు తెగిపోతుంటే 
గుండె గోడలు పగిలిపోతుంటే
వూపిరి ఆగిపోతుందేమో 
అని ఎందుకు భయపడుతున్నాను?
బ్రతకాలని లేదుగా 
తను తిరిగి వస్తుంది అన్న ఆశకూడా లేదు  
మరెందుకో  ఈ ఆరాటం ..
నా మనస్సుతో నాకెందుకు ఈ పోరాటం 

మరుజన్మ కి కూడా నిను పొందలేనని 
ఎప్పుడో తేలిపోయింది 
నీవు వాడ్కొని గాలికొదిలిన 
నా మనస్సు నివేదన ఇది ప్రియతమా
ఈ జ్ఞాపకాలుకూడా 
మిగలవేమో అని బ్రతుకుతున్నాను ...
ఎందుకోతెలుసా 
అవమానాలతో ఆజ్ఞాపకాలను 
పగులకొడుతున్న నిన్ను చూసి 
నవ్వాలో ఏద్వాలో తెలీక ఎందుకో నేనిలా ...?

Sunday, October 5, 2014

ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు.


నువ్వు నా జీవితపు చివరి క్షణం వరకు తోడురావు.
ఏదో ఒక రోజు నువ్వు నన్ను వదిలి వేల్లిపోతావు అని తెలుసు.
ఒక్కసారిగా నువ్వు నా నుండి దూరం కావు.
మెల్లగా, మెల్లగా నా శ్వాసను ఆపుతూ దూరం అవుతావు.
అది ఎలాగో తెలుసా?
నా శరీర బాగంలో కలిసిన నువ్వు,
నా నుండి ఒక్కోరేకుగా విడిపోతున్నప్పుడు,
నేను ఎంత వేదన పడుతున్నానో నీకు తెలుసా?
ఆ భాదను చెప్పడానికి మౌన బావాన్నే ఎంచుకున్నాను.
ఎందుకంటే బాధ అనుభవింవే వారికే తెలుసు  ఆ నరకం.
మాటలకు అందనిది ఆ చేదు క్షణాలు.
అయినా! నువ్వంటే నాకు ప్రాణం.
నువ్వు నాతొ ఉన్నంతవరకు ప్రతిక్షణం నాకు సంతోషం.
నువ్వు నానుండి విడిపోయిన వెంటనే 
నా జీవితము అంతిమ దశకు చేరుకుంది .
నువ్వు ఎప్పటికి నాతొ వుండాలని ఆ దేవుడిని వరం అడిగాను.
అందుకు ఆ దేవుడు నాతో ఇలా అన్నాడు.
నేను బందాలు ఇస్తాను కాని అవి శాశ్వతంగా ఇవ్వను.
అలా ఇస్తే బందాల విలువ మరిచిపోతారు 
అది నిజమే నువ్వు ఉన్నంతవరకు నీ విలువ తెలియలేదు.
నువ్వు నానుండి దూరం అయిన తరువాతే నీ విలువ నాకు తెలిసింది.