. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, April 23, 2014

భగ్గుమంటున్న ఒంటరితనం నన్ను దహించి వేస్తుంది

దహించివేసే నా ఆరాధన
నీ మనసుని రగిలిస్తుందన ..
అల్లల్లాడుతున్న నా విరహం
నీ మృదుస్పర్శ కోసం తపిస్తుందా


భగ్గుమంటున్న ఒంటరితనపు
సెగలు కాల్చకముందే ..
నీ బాహుబంధాల్లో నలిగిపోనీ ..
తెలియని లోతులలోకి ఇంకిపోనీ ..
అలసి కృంగిపోనీ ..

నీలోకి
అవలీలగ
చొచ్చుకపొనీ ..

రమించే మత్తులో ఎదిగిన కోరికలు
పూర్తిగా లొంగిన ఈ క్షణంలో
చివరకు అచేతనంగానైనా
ఇమిడిపోనీ ..


ఎపుడూ మెరిసే నీ కనులు
ఎందుకు ఉద్వేగంగా మారుతుందో

యదలోనీ ప్రశాంతతను
తెలియని ఏ వాంఛ
నన్ను కబళిస్తుందో
  

ఇరువురి బాధలు కరిగే
ఈ ఘడియన ..
నీ తనువు చెప్పినట్టుగానే ..
ఈ రేయిని గడవనీ ..

ఈ వెచ్చటి వేదికపై
వేతన పెట్టిన కోర్కెల
ఆహుతి ఆరే దాకా సాగనీ ..

మన నిషిద్ధ ప్రేమను
నిలువెత్తు రగిలిపోనీ ..

నేను నీలో పూర్తిగా ఒదిగిపోయేదాకా
నీలో అక్యిం అయ్యేదాకా కరిగిపోనీ
ఈ విరహపు వేడిలో పూర్తిగా దగ్దం అయిపోనీ

Saturday, April 19, 2014

మాటలకు అందనిది ఆ చేదు క్షణాలు.

నువ్వు నా జీవితపు చివరి 
క్షణం వరకు తోడురావు.
ఏదో ఒక రోజు నువ్వు నన్ను 

వదిలి వేల్లిపోతావు అని తెలుసు.
ఒక్కసారిగా నువ్వు 

నా నుండి దూరం కావు.
మెల్లగా, మెల్లగా నా శ్వాసను 

ఆపుతూ దూరం అవుతావు.
అది ఎలాగో తెలుసా?
నా శరీర బాగంలో కలిసిన నువ్వు,
నా నుండి ఒక్కోరేకుగా 

విడిపోతున్నప్పుడు,
నేను ఎంత వేదన 

పడుతున్నానో నీకు తెలుసా?
ఆ భాదను చెప్పడానికి 

మౌన బావాన్నే ఎంచుకున్నాను.
ఎందుకంటే బాధ అనుబవిమ్చే 

వారికే తెలుస్తుంది ఆ నరకం.
మాటలకు అందనిది ఆ చేదు క్షణాలు.
అయినా! నువ్వంటే నాకు ప్రాణం.
నువ్వు నాతొ ఉన్నంతవరకు 

ప్రతిక్షణం నాకు సంతోషం.
నువ్వు నానుండి విడిపోయిన 

వెంటనే నా జీవితము అంతమే.
నువ్వు ఎప్పటికి నాతొ వుండాలని 

ఆ దేవుడిని వరం అడిగాను.
అందుకు ఆ దేవుడు నాతో ఇలా అన్నాడు.
నేను బందాలు ఇస్తాను కాని 

అవి శాశ్వతంగా ఇవ్వను.
అలా ఇస్తే బందాల విలువ 

మరిచిపోతారు అన్నాడు.....
 అందుకేనేమో మనసు విలువతెలీని 

దేవుడు నిన్ను నన్ను విడదీశాడు.

Friday, April 18, 2014

పిచ్చితనానికి ప్రతిరూపమే నేను ఎందుకో తెలుసా ?

పిచ్చితనానికి ప్రతిరూపమే నేను ఎందుకో తెలుసా ?
నువ్వు నాకు అందవని తెలిసినా
అందుకోవాలని ఆరాట పడుతున్నా

 నువ్వు నాతో లేవని తెలిసినా
నేను నీ వుహలో బ్రతుకుతున్నా 

నేను అంటే నీకు ఇష్టం లేదని తెలిసినా
నేను నిన్నే కోరుకుంటున్నా

 నువ్వు ఆనందంగా వుండటం కోసం
నా మనస్సునే చంపుకున్నా
నువ్వు నాతోడులేకపోయినా
నేను మాత్రం నీకు చావులోనైనా 

తోడు వస్తా అని మాటిస్తున్నా...

నిన్నా, నేడూ , రేపూ అవును నేను ఎపుడూ ఒంటరినే

ఇక సెలవు
నాతొ గడిపిన నన్ని రోజులకు వందనం
ఈ అనంత కాల గమనంలో 

ఈ రోజుల అందించిన
వెలకట్టలేని జ్ఞాపకాలకు 

శతకోటి వందనాలు
నీ చలనవాణి నా కోసం 

వెదికినప్పుడు ఇక అందను
నీ నుంచి శాశ్వతంగా 

విడిపోయాక నీకు ఏనాడైనా
నీ విరామంలో తీరిక దొరికెతే
కనుమరుగైన రోజులను గుర్తు చేసుకో
నీకు వీలుంటే తీరికగా అడుగు
మనసులో దాగిఉన్న 

ఎన్నో నిజాలను చెబుతాయి

నా జ్ఞాపకాలు వదిలిన జాడలను
నేను కనిపించని నీజాడలు
ఆవిరిగా ఎందుకు మారానని
అందనంత దూరంకు పారిపోతున్నానని
తెల్సుకో తలచుకున్నా ..

ఇక ఎప్పటికీ తిరిగితానేమో
తెల్సిన నిజాలను గుండేల్లో 

నిక్షిప్తంచేసుకొంటున్నా
బైటపడలేక .. 

ఎవ్వరికి చెప్పుకోవాలో తెలీక

ఇక సెలవు
నిన్నా, నేడూ , రేపూ  

అవును నేను ఎపుడూ ఒంటరినే

Wednesday, April 16, 2014

నా చివరి సందేశం ఒక్కసారి వచ్చిపోవూ ప్లేజ్

నా మరణ విధానాన్ని 
ముందే గుర్తు చేసుకుంటున్నాను 
మరణించే వేళ ఆసన్నమౌతుందని 
ఎందుకో నకు తెలుస్తూనే ఉంది 
కారనాలు చెప్పలేను చెప్పుకోలేను 
నాలో నేను నలిగిపోతున్నాను 
నాలో మహా కార్య భావాలు 
ఆగి ఆలోచనలు సతమతమై పోతున్నాయి 
శ్వాసపై గమనం ఎక్కువైపోతున్నది 
ఎప్పుడు ఆగుతుందో తెలీదు
ఎవ్వరికి చెప్పుకోలేని 
మనసు అలజదిలో 
నాకు నాకై తెలుస్తున్న నిజం ఇది 
ఎవరికి ఏది తెలుపాలో 
మరచిపోయినవి ఏవి ఉన్నాయో
మాటలు ఆగిపోతూ మాట రాక 
మౌనంతో నాలో నేను చూస్తుంటే 
కనిపిస్తున్న సూన్యం 
కళ్ళు కూడా మసక మసకతో 
ఏదీ సరిగా కనిపించుటలేదు
మేధస్సులో ఆలోచనలు కూడా 
మరో ధ్యాసలో వెళ్లిపోయేలా 
నను నేను గజిబిజి చేస్తున్నాYఇ 
శరీర ప్రక్రియలు కూడా అస్థవ్యస్తంగా 
అవయవాల పనితీరు ఆగేలా
ఆత్మ దేనినో లాగేస్తున్నట్లు 
అనిపించేలోగా శ్వాస విశ్వంలో
ఆత్మ సూక్ష్మమైపోయి విశ్వంలో 
మర్మగా దూసుకుపోతున్నది
శరీరం నశించుటలో భావాలు లేక 
పంచభూతాలతో కలువబోతున్నాయి
మరణంతో నాలో తెలియని 
భావాలు మొదలైనాయి
తెలియకనే ముఖ భావాలు 
మారి ఆందోళనతో కన్నీరు కారేలా
ఏం చేయాలో వారికి కూడా 
మాటలు తడబడుతున్నాయి
మ్య్ద్దముద్దగా 
వస్తున్న ఆలోచనలు 
అవిరౌతున్నాయి 
కొంత సమయానికి మరణ వార్తను 
తెలిసిన వారికి తెలిపేలా చేయలేని
ఇది నా చివరి సందేసమేమో 
ఆకాశం కూడా నిర్మానుషంగా మారి 
ప్రతి జీవి మౌనమైపోయెరోజొకటి వస్తుంది
నాజీవితంలో ఇదే ఆఖరి రోజెమొ
మరో రోజు నా భావాలు వారిలో మొదలై 
నా భావ జీవితాన్ని తెలుపుకున్నాను 
మరణ భావన లేని నాకు
మరణం సంభవించినా విశ్వంలోనే ఉంటానై 
గాలిలో గాలిగా తిరుగూ 
నీ ఆలోచనలో నేను లేకున్నా 
నా తో నేనెప్పుడు ఉంటాననే నిజాన్ని 
చెప్పలేకనే నా ఈ చివరి మజిలీ 
ఒక్కసారి వచ్చి చూడవూ 
మట్టిలో కలిసి పోయే దేహాన్ని 
ఆక్కర్సారి చుసిపోవూ ప్లేజ్     

Sunday, April 6, 2014

ఎదౌతున్న తలపులు తడుముతు కన్నీరై మనసును తడుపుతుంటే

గెలుపుని ఓటమిలో కల్పి ..
కలగా మనకలయిక కన్నీరై మిగిలింది
నిజంలో దాగున్న అబద్దాన్ని 
అప్యాయంగా కౌగిలించుకొని 
కనిపించని ఆ ఓదార్పు కోసం 
తపనపడుతున్న మనస్సు
గజిబిగి గందరగోళంలో జరిగింది 
జరుగుతుంది జరగబోయేది 
ఏదీ నాది కాదని తెల్సి నన్ను 
చూసి నేనే నవ్వుతున్న నా మనస్సు 
నీలో నేను వున్నానో లేనో తెలీదు .. 
ఎంతవెతికిన ఎక్కడో కనిపిస్తున్న
మినుగురు పురుగులా మెరిచే 
ఆ కాస్త మెరుపుకోసం 
చిన్న ఆనందమో ఎదురు చూసిన క్షనాల్లో 
ఎదురు చూడని నిజాల్లో ఏమన్లో తెలీక 
మౌనంగా రోదించిన నా మనరు నివేదన 
నీకు చేరినా నన్ను నేను మర్చి నీకోసం 
పడ్డతపన నేను నాలో నేను తన్నుకు చస్తున్నా 
ఏమన్లో తెలీక ఏమౌతుందో అర్దం కాక 
అర్దంలేని అపార్దాల్లొ అన్ని మిగిలున్న 
కరిగిపోతున్న క్షనాలను ఎన్నని లెక్కపెట్టను 
పదిమందిలో ఉన్నా 
ఎందుకో ఒక్కడినే ఉన్నా అనిపిస్తుంది 
ఎందరిలో ఉన్నా నీలో నేనుంటే 
ఇక్కడ నేనెలా కనిపిస్తాను 
నాదన్నది నీదైనప్పుడు 
నీదన్నది నాది కాదని తెల్సినప్పుడు
ఎవరికి ఏమని చెప్పుకోను .. తెలియని నిజాలు 
తెల్సి తెల్సి నన్నే వెతుక్కుంటూ 
నన్ను చేరి వెక్కిరిస్తున్నాయి 
నిజమో బ్రమనో తెలీక .. ఏమౌతుందో అర్దంకాక 
కన్నీటిలో జారిపోతున్న క్షనాల సాక్షిగా 
ఎదౌతున్న తలపులు ఎదర్ను కన్నీరై 
మనసును  తడుపుతుంటే 
ఆ కన్నీటి తడిలో చిత్తడౌతున్న నా జ్ఞాపకాల 
ముళ్ళు నన్ను గుచ్చి గుచ్చి నిన్ను అడుతుతుంటే 
ఎక్కడున్నావని చెప్పను తడుముకున్న ప్రతిసాతి 
గుచ్చుతున్న గతం నన్ను అడుగుతున్న 
సమాదనం చెప్పే పరిస్తితుల్లో లేనెందుకని 
ఏంటో నన్ను నేనే అడుతున్న ప్రశ్నలకు 
నాదగ్గర సమాదానంలేక చుట్టూ చూస్తున్నా 
కరిగిపోతున్న జీవితాన్ని నిలుపుకోవాలన్న 
ఆశలేదు .. ఆశయాలన్ని నీకోసం 
గుండెల్లో సమాది చేశాను 
మట్టిలో కల్సిపోయే దేహానికి 
మనసులో తడిమే జ్ఞాపకానికి 
ప్రత్యెక్ష సాక్షివి నీవు 
అన్నీ తెల్సు ..కాని 
ఏం టెలియంట్టు ఉన్న నిన్ను చూసి 
నా మనస్సెప్పుడూ పైకి నవ్వుతూ 
లోపల పగల బడీ ఏడుస్తూనే ఉంది 
ఎదలో జరిగిఏ అలజడి నిన్నే కావాలంటున్నా 
నీకోసం ఎక్కడని వెతకను ఏమూలన ఉన్నావో 
నీ ఎదురుచూపులు నాకోసం కాదని తెల్సి కూడా 
నా ఎదురు చూపులు ఎప్పుడూ నిన్నే తడుముతుంటాయి 

సమాదానం దొరకని ప్రశ్నలోతో సతమతమౌతూ నేనెప్పుడూ

నిశిరేయి నిదురలో నిన్ను అడిగాను..?
నాకు దొరకని సమాదానం నీదగ్గరే ఉంచుకున్నావుగా..

నన్ను వీడి దూరమయ్యావెందుకని?
దగ్గర ఉన్నా గుర్తించలేని పరిస్తితుల్లొ ఉన్ననీవు ఎలా గుర్తిస్తావులే 

నీ కంట జారే నీరు చూసి ఏమడగను..?
ఏమడిగినా అది కోరేది నిన్నే .. ఆకన్నీరు తపన పడేది నీకోసమే ..

మరి ఎందుకు నన్ను ఏడిపించావని..?
నన్ను ఏదిపిస్తూ నీవేదిస్తే ఆ ఏడుపులో నిజాన్ని గుర్తించవా 

నాకు తెలుసు నన్ను నీవు మరిచావని...?
మరిచానని అనుకొంటున్నావు మరిచి పొమ్మని బలవంతం చేస్తుంది నీవేగా

నీవు అనుకోకు నేను నిన్ను మరిచానని...?
నేలో నేణు చూసుకున్న ప్రతిసారి కనిపించేది నీవే అని నీకూ తెల్సు 

మనిద్దరి వలపూ ఎన్నటికీ వమ్ముకాదని...?
ఆ నమ్మకమే ఇప్పటికే బ్రతికిస్తుంది అదెన్నాల్లో తెలీక 

నీవుకాదు విధిరాతే నన్ను వంచించిందని..?
ఆ విధి రాతలో  .. గతితప్పిన మనస్సైంది నాది ఏమని చెప్పను

Wednesday, April 2, 2014

అంతులేని కథని అన్వేషిస్తూ..అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...

ఓ మగువ.... 
నీ మనసు లోతుని
అన్వేషిస్తున్న బాటసారిని....
నీకోసం ఆక్రోసిస్తున్న ఆత్మబందువుని 

నా ప్రయాణంలో ఎన్ని ఓటములో
అన్నే గెలుపులు, మలుపులు
ఓటమి చివరమాత్రం ఎప్పుడూ నేనే

 నా మనసు ఓ అంతులేని కథ
ఎన్నిసార్లు ఓడినా అదో తీయని వ్యధ 
  
పొగమంచు మేలి ముసుగులో
ఓ మనసా పలకరిస్తావు...
కనుమరుగై కన్నీరు పెట్టిస్తావు

దరిచేరి మసుగు తీసే లోపే కరిగి
నేనొక మాయనని వెక్కిరిస్తావు... 
మరికరి వంచన చేరి వెక్కిరిస్తావు

సముద్రాన్ని దాచుకున్నావు...
ఒక్క అలనైనా తాకనీయవు...
ఆకాశనికి .. బూమికి పోలిక ఎక్కడంటు వెక్కిరిస్తావు 

ఆకాశంలో సగం నేనేనంటావు
శూన్యం తప్ప ఇంకేదీ కనపడనీయవు
నన్ను అందులోనే  ఉండిపొమ్మని ఆర్దేస్తావు

అగాధం అంచున ఉంటానంటావు....
ఆ అగాధానికి అంతేలేదని నువ్వే చెప్తావు....
అన్నీ తియ్యగా చెప్పి అఘాదాల్లో ఉండిపో అని నెట్టేస్తావు

చిక్కుముడుల చిత్రాన్ని నేనంటావు...
విప్పిన కొద్దీ కొత్త ముడిని చిత్రిస్తూనే ఉంటావు...
నాజీవితానికి చిక్కుముడులతో జీవితాన్ని చింద్రం చేస్తావు

మనసు పొరలు మరుల తరువంటావు
ఆ పొరల చెరలో కన్నీటి చుక్కనీ నేనే అంటావు
కన్నీరు ఇంకేవరకు ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటావు

కలల వలలో చిక్కుతావని అంటే...
కనులు మూసుకున్నాను....
కళ్ళు తెరచి చూస్తే అంతా చీకటి చేశావు

ఆ కలల వల నాపైనే విసిరి...
కలత నిదురవై వెళ్లిపోయావు... 
ప్రతిరాత్రి నిశిరాత్రి చేసి ఏకాంతంలో ఏడిపిస్తున్నావు

ఎట్టకేలకు....
మససు వాకిట నిలబడి తలుపు తడితే...
లక్షప్రశ్నల నిలువెత్తు శిల్పమై మాయమయ్యావు...

అంతులేని కథని అన్వేషిస్తూ....
అంతం తెలియని దూరం ప్రయాణిస్తూ...
చిక్కుప్రశ్నలకు బదులు వెదుకుతూ...
నా... అన్వేషణ నీకోసం సాగుతూనే ఉంది...

వీడని చిక్కుముడి కోసం ఆరాటమెందుకని... 
నా పిచ్చి మనసుని చూసి జాలిపడి .. 
ఆ మనసు... ఓ నవ్వు నవ్వి....
పొగ మంచు మేలి ముసుగులో కరిగిపోయింది...  
మట్టిలో కల్చిపోయేందుకు నాదేహం ఇప్పుడు సిద్దం అయింది అందుకేనేమో నీవు నన్ను శిలలా చేసి ఆడుకొన్నావు

Tuesday, April 1, 2014

ఉగాది సందర్బంగా సి నారాయన రెడ్డితో నేను అయన పాటలతో


ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సి.నారాయణ రెడ్డిగారితో ఆయన ఉగాది గురించి చెప్పిన విశేషాలను  మీకోసం .. అలాంటి గొప్పవ్యక్తితో మాట్లాడే అవకాశం దొరికింది ... అమూళ్యమైన విషయాలు నా ద్వారా ఆయనరాసిన అద్బుతమైన పాటలను మీకోసం