Tuesday, November 30, 2010
ఏం ఆలోచన అది.. ?
(http://naaharivillu.blogspot.com/ బ్లాగు లోనిది బాదుంది చదవండి...)
ఏం ఆలోచన అది.. ?
అన్ని కోణాల్లోనూ ఓటమిని చూపిస్తుంది..
ప్రతీ ఓటమికి నన్నే భాద్యుణ్ణి చేస్తుంది.
ఏం ఆలోచన అది.. ?
నలుగుర్లోనూ ఒంటరిని చేస్తుంది..
ఒక్కడినే ఉన్నా, ఇంకా ఒంటరితనం కావాలంటుంది.
నన్ను ఒదిలి నేను ఎక్కడికిపోను ?
ఏం ఆలోచన అది.. ?
అందర్నీ, అన్నింటినీ ద్వేషిస్తుంది..
నన్ను నేనే ద్వేషించుకునేలా చేస్తుంది..
అందులోనే ఓదార్పుని వెతుక్కుంటుంది.
ఏం ఆలోచన అది.. ?
నా వ్యక్తిత్వాన్ని దూదిపింజెలా తీసిపారేస్తుంది..
ఎంత బలహీనుణ్ణి చేస్తుందంటే, ..
నాకు నేనే భయపడేటంత..
గుండె ధైర్యాన్ని కొల్లగొట్టి,
ఆశని మొదళ్ళకి నరికి,
కన్నీళ్ళను నాకు కానుకగా ఇచ్చి..
తానే గెలిచాననుకుని వెళ్ళిపోతుంది.
ఏం ఆలోచన అది.. ?
జ్ఞాపకమై, గుర్తొచ్చీ బాధించే ఆ ఆలోచన..
దుఃఖం కాక మరేమిటి ?
(ఆ పైనున్న స్వర్గ నరకాల మాటేమో కానీ, ఇక్కడున్నంత వరకూ, ఆనందం స్వర్గమే, నరకమంటే దుఃఖమే.. మరి అవి ఎవరి చేతిలో ఉన్నట్టు ? )http://naaharivillu.blogspot.com/ బ్లాగు లోనిది బాదుందికదా...