నాలో నేను..ఎవ్వరికి అర్దంకాను..
ప్రక్రుతి...లో ఎన్నో విషేషాలు వింతలు..అన్నీ మనకోసం..ఇచ్చినవే
పువ్వు తాను పరిమళిస్తూ నేవ్పిస్తుంది...తనలా ఆనందంగా వుంటూ అందరికి ఉపయోగపడాలని నేర్పుతోంది
పచ్చని పంటపొలాలు లనుచి వచ్చే చల్లని పిల్లగాలులు...జీవితంలో విజయాన్ని అందరి తోషేర్ చేసుకొమ్మన్నట్టు ఉంటుంది కదా
పచ్చని చెట్టుకు కాసిన కాయలు స్వార్దాన్ని విడిచి మనం ఎలాబాగుంటామో అందరూ అలాఉండాలని పదిమంది కి ఉపయోగ పడాలని కోరుకోవాలన్నట్టు ఉంటుంది కదా
ఇవేకాదు....సమాజంలో జరిగే పనులు అన్యాయాలు నేనిక చూడలేనంటు సూర్యి భానుడు భగ భగ మండుతున్నాడు అన్నట్టు ఉంటుంది కదా
అందుకే ప్రక్ర్తుతి చెబుతోంది స్వార్దాన్ని వీడమని అందరికీ అందుబాటులో ఉండమని కాని అంతాస్వార్దం..మంచికి రోజులు లేవు మంచిగా వుండేవాడు చేతగాని వాడు...మోసంచేసేవాడు గొప్పవాడు...
మంచివాన్ని మరచి స్వార్దపరులకోసం ఏమైనా చేసే మనుషులే ఎక్కువ...
స్వార్దమెరుగక ఉండాలనే ఆలోచన..తప్పేమో ననిపిస్తుంది
అందరి లా లైఫ్ ను ఎందుకు ఎంజాయి చేయకూడదనే ఆలోచన వెంటాడుతుంది..
మంచిగా ఉండకుండా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగంచేసుకొంటూ అందరిలా లైఫ్ ఎంజాయ్ చేయాలా అని నాలో నేను మదనపడుతున్నను..
ఆదిశగా ప్రయత్నాలు మోదలు పెట్టాను..ఇలాంటి విజయం లో ఎలాంటి ఆనందం వుంటుందో మరి..(ఇదే ప్రస్తుతం నాలో నేను)