. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, November 9, 2015

ఈ రాత్రి ఒక నిశ్శబ్ద నది మౌనం వీడుతోంది

ఈ రాత్రి 
ఒక నిశ్శబ్ద నది
మౌనం వీడుతోంది 
పరవల్లు తొక్కుతున్న 
మనసు  ప్రవాహంలో 

ఏ వెన్నెల పూలూ 
నీకోసం  వెతుకుతూ 
మత్తులు వెదజల్లే 
తడి ఆరని తమకంలో విచ్చుకున్న 
దేహం పైన విచ్చుకోవు. 
నాట్య మయూర పురివిప్పి
నాట్యమాడ నిను చేర పరుగులు పెట్టనా 


ఈ రాత్రి
అనంతాలోచనా ప్రవాహంలో
విఫలమవుతున్న నా కలల వలలు
నీకౌగిలికోసం తపిస్తున్నాయి 
కానీ ఎప్పటికైనా ...
ఈ రాత్రి 
ఉషోదయానికి గురిపెట్టిన శరమై
నైరాశ్యపు 
నారిని విడవాల్సిందే 
ప్రభాతకాంతిలో మునిగి 
చిరు మందహాసాలను చెదరగొడుతూ 
దరహాస రేఖల్ని ధరిస్తూ 
త్రుళ్ళుతూ ప్రవహించాల్సిందే
అదే నీ నవ్వుల ప్రవాహమై నిను చేర 
ఎప్పటికీ చేరనని తెల్సి పరుగులు పెడుతూనే వుంటాను