నీ కోసం నేను రాల్చే
ఒక్కో కన్నీటి చుక్క
వేల వేల ప్రళయాలై
అగ్ని గోలాల్లా మండుతూనే వున్నాయి
నీ జ్ఞాపకాల సడిలో
ఓ విషాదగీతం
నా గొంతును నులిపేస్తు
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది
నా నిశబ్దపు గోడలను
తడుముతున్న
నీ జ్ఞాపకాల ప్రతిధ్వని
నిశ్శబ్దంగా ..నన్ను
తనలో కలిపేసుకుంటూనే
చీకటి రాత్రుళ్ళు
నామదిలో కదలాడే
నీ ఛాయా చిత్రాలు
నా మనస్సును
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి
కదలాడుతూ కదలాడుతూ
ఆగిపోయే కాలం సాక్షిగా
హమ్…ఎన్నని చెప్పను?
నాగుండెల అలజడి
గాయాల నిట్టూర్పులు
రాయిలా మారలేని
నా అసహాయతను గుర్తుచేస్తున్న
ఈ గుళకరాళ్ళను
నా నిశ్చల మదిలో నిండుగా
గుమ్మరిస్తున్నది ఎవరు?
నువ్వా? నేనా?
ఆనువ్వు నీనవ్వు ఎక్కడుందో
ఎవ్వరి మనసు గుప్పెటలో
నీనవ్వుల మల్లెలను పూయిస్తున్నావో
అంటూ నీ తలపులతో
తడబడే మాటలతో
నాలో నేను మాట్లాడుతూనే వుంటాను వెర్రిగా
ఒక్కో కన్నీటి చుక్క
వేల వేల ప్రళయాలై
అగ్ని గోలాల్లా మండుతూనే వున్నాయి
నీ జ్ఞాపకాల సడిలో
ఓ విషాదగీతం
నా గొంతును నులిపేస్తు
నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంది
నా నిశబ్దపు గోడలను
తడుముతున్న
నీ జ్ఞాపకాల ప్రతిధ్వని
నిశ్శబ్దంగా ..నన్ను
తనలో కలిపేసుకుంటూనే
చీకటి రాత్రుళ్ళు
నామదిలో కదలాడే
నీ ఛాయా చిత్రాలు
నా మనస్సును
ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి
కదలాడుతూ కదలాడుతూ
ఆగిపోయే కాలం సాక్షిగా
హమ్…ఎన్నని చెప్పను?
నాగుండెల అలజడి
గాయాల నిట్టూర్పులు
రాయిలా మారలేని
నా అసహాయతను గుర్తుచేస్తున్న
ఈ గుళకరాళ్ళను
నా నిశ్చల మదిలో నిండుగా
గుమ్మరిస్తున్నది ఎవరు?
నువ్వా? నేనా?
ఆనువ్వు నీనవ్వు ఎక్కడుందో
ఎవ్వరి మనసు గుప్పెటలో
నీనవ్వుల మల్లెలను పూయిస్తున్నావో
అంటూ నీ తలపులతో
తడబడే మాటలతో
నాలో నేను మాట్లాడుతూనే వుంటాను వెర్రిగా