ఉరుముల మెరుపులు
మెరుపులు వెలిసి పోయా ఎప్పుడో
ఉరుమొచ్చినట్లు తలుక్కున మెరిసే నీ నవ్వు
మౌనంలో వినిపిస్తుందేమోనని
నీ మాటల నడకల చప్పుడుకోసం
చెవులు రిక్కించి వింటున్నా
పాదాల అందియలు
గుండె లయను తప్పీంచే
కానీ ఎందుకో
నీకూ మాకూ మధ్య
ధ్వని మనసులోకి దూరలేని
శూన్యపు గోడలు అడ్డూకొంటూన్నాయి
సృష్టి రహస్యం తెలిసిపోకుండా
ఊహలకు కొలతలు వేసేలోపే
వాస్తవం కల్లముందు కదిలాడూతుంటే
నిశ్శబ్దం నిజమై నను తాకుతూనే వుంది
మెరుపులు వెలిసి పోయా ఎప్పుడో
ఉరుమొచ్చినట్లు తలుక్కున మెరిసే నీ నవ్వు
మౌనంలో వినిపిస్తుందేమోనని
నీ మాటల నడకల చప్పుడుకోసం
చెవులు రిక్కించి వింటున్నా
పాదాల అందియలు
గుండె లయను తప్పీంచే
కానీ ఎందుకో
నీకూ మాకూ మధ్య
ధ్వని మనసులోకి దూరలేని
శూన్యపు గోడలు అడ్డూకొంటూన్నాయి
సృష్టి రహస్యం తెలిసిపోకుండా
ఊహలకు కొలతలు వేసేలోపే
వాస్తవం కల్లముందు కదిలాడూతుంటే
నిశ్శబ్దం నిజమై నను తాకుతూనే వుంది