. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, October 30, 2015

ఓయ్ నీకేనోయ్...ఎక్కడ మొదలెట్టనూ .. (గుర్తుతెలియని వ్యక్తి అంతరంగం)

ఓయ్
నీకేనోయ్

నువ్వు గుర్తొస్తే ..ఊహూ కాదు నువ్వు కలలోకి వస్తే ...కాదు నువ్వు ఎదురుగా ఉంటే ... ఎలా చెప్పాలో తెలియటం లేదు ..పదాలకేందుకు ఇంత పరవశం ..భావాలకేందుకు ఇంత పరిమళం. అక్షరమక్షరం ఇలా తడబడుతోందేదుకు? నిన్ను ఎదురుగా చూస్తే నా అడుగులు తడబడతాయనుకున్నా. నీ తలపులు కూడా తికమక పెడుతున్నాయి నా రాతలను సైతం..!
రేయి మొత్తం నీ చిలిపి ఊసుల్లో చిదిమిన తాపం, వలపుల కలశంలో ఒంపుకుంది. ఆ గుసగుసల రవళి సొగసుల మురళీలో లీనమవుతూ అనురాగ జావళీలు పాడుతోంది. నీతో గడిపే ప్రతి క్షణం పరిమళభరితమే. ఆ ప్రేమ సుగంధం, ప్రేమైక లోకాలలో వెదజల్లుతూ జీవితాలకి ప్రేమించటం నేర్పుతుంది. ఆలోచించే, మాట్లాడే, మమతలల్లే ఈ జీవితం, కలలా కరిగిపోతుంది అనే నిజం తెలిసినా, ఆ కలని నువ్వు నిలిపేస్తావు కౌగిట్లో. ఇది చాలుగా నా జీవితానికి. బతుకు చెమ్మ రుచి చూపించే చెలికాడువి నువ్వు అని తెలిసిపోయిందిలే. కావ్యనాయికవే అంటూ కవితల్లో ముంచేస్తావు.అసలు ఆ కవితా ప్రవాహంలో సంగమించని హృదయం ఉంటుందా...చెప్పు. !
నువ్వు నా ప్రపంచపు తొలి ప్రేమవి. నిన్ను మించిన మధువు ఉందా ఈ లోకంలో ... అంత తీపిని పెదాలలో ఎలా నింపుకున్నావో గాని ఆ పదాల మత్తులో చిత్తు చేస్తున్నావుగా. పూరేకుల సొగసుని మురిపెంగా ఇచ్చుకున్న నివేదనని ఎంతో ఇచ్చకంగా ఆరగించే నీ అధరాలు ఆద్యంతం ఆఘ్రూణిస్తునే వుంటాయి. వలపుల వగలమారి నీకు తపనెక్కువే.
మాటవినని ముంగురులను మౌనంగా గాలికొప్పచెప్పి నిలబడితే, తట్టుకోలేని తమకంతో తదేకంగా చూస్తూ , ఎన్ని ఊసులు చెప్తావో తెలుసా నీకు..!
ప్రతి క్షణం నువ్వు నాకు కొత్తగా పరిచయమౌవుతూ , చిత్తుగా ఒడిస్తుంటావు. నువ్వు నాకు ఒక వరం. నీతో ఒక్కసారి మాట్లాడితే కానీ, నీ గొంతు వింటే గాని మనసు నిలవదని ఫోన్ తీసుకుని అలా పైకి వచ్చానో లేదో మల్లె పందిరి విచ్చిన పువ్వులన్నీ గుచ్చుకో అంటూ తొందరపెడుతుంటే చిలిపి చినుకులు నీ చూపుల్లా గుచ్చుకుంటు నిలబడనీయక, మనసు నీతో ఊసులకై తొందరబెడితే ఏం చెయ్యను. నీకిది న్యాయమా చెప్పు ఏ పనిమీద మనసు లగ్నం కానివ్వక, నన్ను ఆసాంతం అల్లుకుపోతున్నావు కదరా..!
పూలలోని సుకుమారాన్నంతా నీ చేతి స్పర్శలోకి తెచ్చుకుంటావేమో ..ప్రేమ సంద్రాన్ని చిలుకుతునేవుంటావు...అది వెండి వెన్నలలా ఆకాశాన్ని అద్దుకుంటోంది..తిరిగి నాపైనే అనుభూతుల చినుకులు కురిపించాలని. ప్రేమ పరుసవేదివి నువ్వు...బంగారం బంగారం అంటూ హత్తుకుంటూనే ఉంటావు. వాడిపోని, వీడిపోని మమతల పూలు తురిమావుగా .. నాపై ప్రసరించే నీ చూపులే చెప్తున్నాయి నువ్వు నా ఆత్మవని. నీ మనసు మమతానురాగాల ఇంద్ర ధనస్సు. నీ అనురాగం ఆనందాల సరాగం. విరితేనేలు అధరం అందుకుందేమో ద్రాక్షరసంతో నిండిపోయింది ...ఆ మత్తులో పెదాలు చిత్తుగా చిందులేస్తే. మళ్ళీ చిలిపిగా తాంబూలం వేసుకున్నావా బంగారు అంటూ ఆట పట్టించే నీ చూపులు నన్ను నీలవనీయవుగా.
కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా నువ్వే ..కళ్ళు ముస్తే కలల్లో నువ్వే ..ఊపిరి తీయకుండా ఆగగలను ..క్షణమైనా నీ తలపులు లేకుండా తట్టుకోలేను. అసలు నా మనసు నాదా నీదా ..నన్ను వదిలేసి నీ గురించే ఎక్కువ ఆలోచిస్తోంది.. నీకో విషయం తెలుసా అసలు పుట్టగానే నీ కోసం చూశానట. నీతో మాట్లాడటానికే మాటలు నేర్చాను.. నిన్ను రాద్దామనే భాష నేర్చాను. నా ఉశ్చ్వాసలన్నీ నీకిచ్చి , నీ నిశ్వాసలను శ్వాసలుగా చేసుకుంటున్నా. తరువుననుకో లేక తలపులననుకో ..పలకరింతలే పులకరింతలై క్షణం క్షణం పరవశిస్తున్నాను. జీవితం చిన్నదే , జ్ఞాపకాలు మాత్రం పెద్దవి.
ఎలా చెప్పను నీకు నా ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం నువ్వై పలుకుతావని.
ఎలా చెప్పను నీకు నా ప్రతి పలుకులో భావం నువ్వై ఒదుగుతావని.
ఎలా చెప్పను నీకు నా ప్రతి క్షణంలో నాదం, మోదం, ప్రాణం, ప్రణవం నువ్వై ఒలుకుతావని. 
నా ఒంటరితనం, నిన్ను మరిత దగ్గరచేస్తుంది. తొందరగా వచ్చేయ్యి ఈ విరహాన్ని చీల్చేద్దాం. నువ్వు వచ్చేదారిలో అనుభూతులన్నీ పరిచి ఉంచుతా ...అనురాగ దీప కాంతుల్లో ఆనందంగా రా.
నీ 
నేను.