. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 11, 2015

ఎదుటి వారి మనసుల్లో మౌనాన్ని గుచ్చి గానాలు చేస్తున్న

ఎన్ని నిశ్శబ్దాలు 
మాట్లాడుతున్నా  
ఎన్ని నిరాశలు 
నిన్ను కమ్మేస్తున్నా  
ఎన్ని నిస్పృహలు 
నీలో మనిషిని వెతుకుతున్నా  
ఏకాంతం ఎందుకో 
నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది 
నిదానించమని 
ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా 
అల్ల కెరటాలు కలలతో  కవాతుచేస్తున్నా 
ఆటుపోటులు తో 
అలుపెరగనీ పోరాటం చేస్తున్నా 
ఉప్పెనలు నా ఊసులని కప్పేసి 
దిగులు దిగులుగా 
దిగమింగేస్తున్నా 
నాలోని ఆవేశం
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి 
మౌనమై పగుళ్లిస్తూనే ఉంటాయి
కొన్ని నిశ్శబ్దాలు
భయంకర శబ్దాలు అవుతాయి 
కొన్ని జ్ఞాపకాలు మనసుకు 
గాట్లుగా మిగులుతాయి 
కొన్ని నీడలు 
నాగతాన్ని గుర్తుకు తెస్తాయి 
కొన్ని నమ్మకాలు 
వెర్రివాడా అని వెక్కిరిస్తాయి 
నిజాలు భగ్గుమన్నా 
నీవు భయపడవు
నీ హృదయం ముక్కలు కావు 
ఎందుకంటే నీవు మనిషివి కాదు 
శిల్పానివి  మనిషి 
రూపంలో ఉన్న రాయివి 
నీవకున్నదే నీకు ముక్ష్యం 
ఎదుటి వారి మనసుల్లో 
మౌనాన్ని గుచ్చి గానాలు 
చేస్తున్న నీవు నిజంగా గాయనివే