మనసులోనే మూతపడ్డ వ్యధని
గాధగా మార్చాలని చూస్తున్నా
కరిగి కన్నీటి జల్లవనీ పన్నీటిగా
నీపై జల్లాని చూస్తున్నా
కన్నీటితో తడిసిన కోర్కెలు నాపై
రక్తాన్ని కురిపిస్తున్నాయి
ఆశల గాలిసోకి మరీ ఆరనీ
కన్నీటి చుక్కల్లో కలిసిన జ్ఞాపకం
నీకోసం తడుముకుంటోంది
నమ్మకంలో సొమ్మసిల్లిన
నీ మది తలపుల్లొ నితలపులను
నిద్రపుచ్చాలని చూస్తున్నా
మదిని మాటున దాగివున్న
మన జ్ఞాపకాల నీడల్లో
చేదతీరాలని చుస్తున్నా
విప్పారిన జ్ఞాపకా రెక్కలు విచ్చుకొని
నిన్ను తాకాలని చూస్తున్నా
నాకు నేను విహంగినై
గగనాన్ని నాకు నేను
చేరగలనేమో కాని
నిన్ను చేరలేనని తెల్సిన నేను బేలగా
ఆకాశం వైపు చూస్తున్నా
గగనంలో లో తిరుగాడే పక్షులు
నావైపు జాలిగా చూస్తున్నాయి
దారితెలియని మజిలీలు
నాదారిమొత్త ముళ్ళ దారిని చేశాయి
రేయంతా తపనతో తడిసిన
చెమటకి వేకువవేడేదో తెలుసుకోలేక
కరిగిపోబోయిన కలలని
మనోధైర్యంతో మాయ చేయలేక
నన్ను నేను ఎన్నిసార్లు మోసం చేసును
నాకే నేను జరగని వాస్తవాలను నిజాలని
అవి పైకి కనిపించే నీడలని
తెల్సి నా మౌనంలో నేను మగ్గిపోను
నీ ప్రేమనే అన్వేషిస్తూ
తూరుపు పడమరల దిక్కు తెలియక
పరులుగులు పెడుతున్నా
నామనసు జాడనీసం ఇంకా వెతుకుతూనే వుంది
గుండె పగిలి ముక్కలైన జ్ఞాపకాలను
గుడేల్లో గుచ్చుకొనే ఉన్నాయిగా
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి
నిజానికి మాయని మచ్చను అడ్డుగా పెట్టి
మచ్చలనే దాచి చందమామనై
చీకటిలో కల్సిపోయేలా చేశావుగా
గాధగా మార్చాలని చూస్తున్నా
కరిగి కన్నీటి జల్లవనీ పన్నీటిగా
నీపై జల్లాని చూస్తున్నా
కన్నీటితో తడిసిన కోర్కెలు నాపై
రక్తాన్ని కురిపిస్తున్నాయి
ఆశల గాలిసోకి మరీ ఆరనీ
కన్నీటి చుక్కల్లో కలిసిన జ్ఞాపకం
నీకోసం తడుముకుంటోంది
నమ్మకంలో సొమ్మసిల్లిన
నీ మది తలపుల్లొ నితలపులను
నిద్రపుచ్చాలని చూస్తున్నా
మదిని మాటున దాగివున్న
మన జ్ఞాపకాల నీడల్లో
చేదతీరాలని చుస్తున్నా
విప్పారిన జ్ఞాపకా రెక్కలు విచ్చుకొని
నిన్ను తాకాలని చూస్తున్నా
నాకు నేను విహంగినై
గగనాన్ని నాకు నేను
చేరగలనేమో కాని
నిన్ను చేరలేనని తెల్సిన నేను బేలగా
ఆకాశం వైపు చూస్తున్నా
గగనంలో లో తిరుగాడే పక్షులు
నావైపు జాలిగా చూస్తున్నాయి
దారితెలియని మజిలీలు
నాదారిమొత్త ముళ్ళ దారిని చేశాయి
రేయంతా తపనతో తడిసిన
చెమటకి వేకువవేడేదో తెలుసుకోలేక
కరిగిపోబోయిన కలలని
మనోధైర్యంతో మాయ చేయలేక
నన్ను నేను ఎన్నిసార్లు మోసం చేసును
నాకే నేను జరగని వాస్తవాలను నిజాలని
అవి పైకి కనిపించే నీడలని
తెల్సి నా మౌనంలో నేను మగ్గిపోను
నీ ప్రేమనే అన్వేషిస్తూ
తూరుపు పడమరల దిక్కు తెలియక
పరులుగులు పెడుతున్నా
నామనసు జాడనీసం ఇంకా వెతుకుతూనే వుంది
గుండె పగిలి ముక్కలైన జ్ఞాపకాలను
గుడేల్లో గుచ్చుకొనే ఉన్నాయిగా
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి
నిజానికి మాయని మచ్చను అడ్డుగా పెట్టి
మచ్చలనే దాచి చందమామనై
చీకటిలో కల్సిపోయేలా చేశావుగా