మరణమా ఎక్కడున్నావు
రా ..... నువ్వు రా ....
మరణమా ఎటువెల్తున్నావ్
రా ..... ఇటు రా ......
ఎంత పిలచినా పలకవే నువ్వు
దగ్గరగానే ఉండి దూరంగా వున్నట్టు
కవ్విస్తావెందుకు ..
కాటేసేందుకు వచ్చి
ఆ మొసలి కన్నీల్లు దేనికి
నాటకమా అందరిలా నీవు నటిస్తున్నావా
ఎంత అరచినా చూడవే నువ్వు
ఎందుకు ఎందుకు ఎందుకు ?
ఓ మరణమా మరణమా మరణమా
నాకోసం మాటువేసిన నిన్ను చూశా
మరి దరిచేరవెందుకు రమ్మని పిలుస్తున్నాగా
బెట్టుచేస్తావేం ..నేను నీకోసం ఎప్పుడో సిద్దంగా ఉన్నా
నా గుండె అలసిపోయింది
నా అడుగు నన్ను విడిపోయింది
నా ఉనికి నన్ను మర్చిపోయింది
నా తనువు మాత్రమే నాతో ఉంది
నిరాశతో నిండిన హృదయంతో వేచి సూస్తున్నా
నిస్సహాయత చుట్టుముట్టింది
నిరాశే నాకు మిగిలింది
ఆశ అడ్డు రానంటుంది
నా శ్వాస మాత్రమే నాలో ఉంది
నవ్వు నన్ను వెక్కిరిస్తుంది
భాద నన్ను పలకరిస్తుంది
నీ జ్ఞాపకం నన్ను
సూన్యంలోకి త్రోసివేసింది
నా నీడ మాత్రమే నాతో ఉంది
నా ఆయువెంత వరకుంది
నా క్షణము మంట పెడుతుంది
నా ఋణము రోదిస్తుంది
నా ఆత్మ మాత్రమే నాలో ఉంది
నేను ఎప్పుడో విగతజీవుడనైనా
ఇప్పుడు నేను బ్రతికున్న శవాన్ని
అందరూ నమ్మకంగా నన్నేప్పుడో చంపేశారు
అన్ని నిజమని నమ్మించి
మాససికంగా నన్నెప్పుడో కుళ్ళబొడిచారు
ఊపిరి ఆడినట్టు నీకు అనిపిస్తుందా మరణమా
అధి నీబ్రమ నిజం కాదు
బ్రతికున్న శవాన్ని రా దగ్గరకు రా
రా ..... నువ్వు రా ....
మరణమా ఎటువెల్తున్నావ్
రా ..... ఇటు రా ......
ఎంత పిలచినా పలకవే నువ్వు
దగ్గరగానే ఉండి దూరంగా వున్నట్టు
కవ్విస్తావెందుకు ..
కాటేసేందుకు వచ్చి
ఆ మొసలి కన్నీల్లు దేనికి
నాటకమా అందరిలా నీవు నటిస్తున్నావా
ఎంత అరచినా చూడవే నువ్వు
ఎందుకు ఎందుకు ఎందుకు ?
ఓ మరణమా మరణమా మరణమా
నాకోసం మాటువేసిన నిన్ను చూశా
మరి దరిచేరవెందుకు రమ్మని పిలుస్తున్నాగా
బెట్టుచేస్తావేం ..నేను నీకోసం ఎప్పుడో సిద్దంగా ఉన్నా
నా గుండె అలసిపోయింది
నా అడుగు నన్ను విడిపోయింది
నా ఉనికి నన్ను మర్చిపోయింది
నా తనువు మాత్రమే నాతో ఉంది
నిరాశతో నిండిన హృదయంతో వేచి సూస్తున్నా
నిస్సహాయత చుట్టుముట్టింది
నిరాశే నాకు మిగిలింది
ఆశ అడ్డు రానంటుంది
నా శ్వాస మాత్రమే నాలో ఉంది
నవ్వు నన్ను వెక్కిరిస్తుంది
భాద నన్ను పలకరిస్తుంది
నీ జ్ఞాపకం నన్ను
సూన్యంలోకి త్రోసివేసింది
నా నీడ మాత్రమే నాతో ఉంది
నా ఆయువెంత వరకుంది
నా క్షణము మంట పెడుతుంది
నా ఋణము రోదిస్తుంది
నా ఆత్మ మాత్రమే నాలో ఉంది
నేను ఎప్పుడో విగతజీవుడనైనా
ఇప్పుడు నేను బ్రతికున్న శవాన్ని
అందరూ నమ్మకంగా నన్నేప్పుడో చంపేశారు
అన్ని నిజమని నమ్మించి
మాససికంగా నన్నెప్పుడో కుళ్ళబొడిచారు
ఊపిరి ఆడినట్టు నీకు అనిపిస్తుందా మరణమా
అధి నీబ్రమ నిజం కాదు
బ్రతికున్న శవాన్ని రా దగ్గరకు రా