. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, November 29, 2014

తనే గెలవాలని నన్ను మానసికంగా చంపిన క్షనాలు

కవలలం ..నిజమే.. కలిసి
ఎన్నో పంచుకోవాలని కలలు కన్నాను
దగ్గర అవుతున్నా అనుకునే  కొద్దీ దూరమయ్యావు.

నీకోసం పలవరించిన ఏకాంతపు రాత్రులు
నాలో నేను కలవమని చేసిన అభ్యర్ధనలు..ప్రార్ధనలు
విదిలించి కొట్టి నా మానాన నన్నొదిలేశావు..

స్థితిగతులు మారి, నా నిస్సత్తువ గెలిచినప్పుడు
నన్ను కాక మరొకరిని గిలిపించి నప్పుడు 
తన్నను విజేతను చేసి నన్ను ఓడించిన క్షనాల్లో 
తనే గెలవాలని నన్ను  మానసికంగా చంపిన క్షనాలు 
నిస్సహాయుడనై ఒంటరిగా ఒదార్చే నీవే పదునైన కత్తివై 
గుండెల్లో గునపమై గుచ్చిన క్షనాల్లో  
నా అరుపులు ప్రతిధ్వనులై నన్నే  వెక్కిరించాయి.

నాతోనే ఉన్నావంటావా .. సాక్ష్యమేదీ ?
నా బ్రతుకంతా నువ్వు తప్పిన జ్నాపకాలే...
నువ్వెంతమందిని పిలిచావు?
ఎంతమందిని కలిశావు ?
ఏం నేచేసిన తప్పిదమేమిటి ?
వాళ్ళు నీకు చేసిన న్యాయమేంటో ..?


నా రాక.. నీకది ఇష్టంలేదేమో
నే రావడం.. అదీ కష్టమే ?
అసలాంతర్యమేమో ? ఈ ఎడబాటెందుకో ?
కలవని తెలీ ఈ కలవరింతలెందుకో ?

విధిని నమ్మిన వాడిని
నీ విధానాన్ని ప్రశ్నించాను..క్షమించు
కాలం జారుతుందిగా..
మన మధ్య దూరమూ..కరుగుతుంది.  

ఎప్పటికైనా మన కలయిక తధ్యమే  
కానీ తొందరలో చూడగలనన్న తీరని ఆశతో
ఆశ తీరదని తెల్సి తీరని ఆవేదనతో ఎదురు చూస్తూ నేను