. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, December 4, 2014

ఒంటరి రాత్రి మోసుకొచ్చే నిశ్శబ్ద నిట్టూర్పులు ..( నీకోసం నాలో నేను సంభాషించుకొంటూ )

పెదవుల కదలికల్లో..కనురెప్పల శబ్దాలు 
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి
మనసుతో మాట్లాడాలి అని వున్నా 
మనిషివి నా చెంత లేవుగా 

ఒంటరి రాత్రి మోసుకొచ్చే  నిశ్శబ్ద నిట్టూర్పులు 

నన్నెందుకో ఊరడించాలని చూస్తున్నాయి 
నన్నెందుకో అవి భయపెడుతూనో ముద్దాడుతూనో
సమూహాంతర ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి
నన్ను వంటరిగా ఉండమని వేదిస్తున్నాయి 

ఒకే ఊరిలో  వుంటూనే మనం

ముక్కలు ముక్కలుగా విసిరేయబడ్డాం 
మనిషిక్కడా మనసులే ఎక్కడో ఉన్నాయి 

సంభాషణకోసం సమయాన్ని వెదుక్కునేలోగా

ముచ్చటపడ్డ నీ రింగుటోను పాట
నా కాలర్ టోనై అది మ్రోగినప్పుడల్లా 
నన్ను గతంలోకి  లాక్కెళుతుంది

అక్షరీకరించలేని ఎన్నో సంభాషణలు

నా మనస్సు హాడిస్కు లో  నిక్షిప్తం అయివున్నా 
నీ మెమరీలో మన జ్ఞాపకాలను  డిలీట్ చేశావుగా 

కాలానికి ఎదురీదడం నాకు  కొత్తేమీ కాదు
కాలంలో కలిసిపోవడం  అలవాటు చేసెల్లావుగా 
కాని నన్ను నేను ఇలా 
అక్షరాలతో నిప్పంటిచుకొని 
గతం  జ్ఞాపకాలతో తగల బడూతూనే ఉంటా ఎప్పుడు