నిండిన కళ్ళతో
మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది
విశ్రాంతినిస్తుంది
నను విడిన బంధాలని,
విగత భావాలని
వక్రించిన విధి నన్ను వెక్కిరిస్తూ
మనసుపర్చిన
నిస్పృహల్లో ఆరేస్తుంది
కంటి గానుగనుండి
కలల సారాన్ని ఆస్వాదిస్తూ
సాగే నీడకు నిర్లిప్త
ప్రేక్షకుడిగా ఉండిపోయాను
అలల దాగుడు మూతల్లో
నిద్రనోచుకోని నేను
ఆప్యాయత కోసం
ఎదురు చూస్తున్నాను
నిలవని అడుగు జాడల్లో
తడబడే అడుగుల్లో
ఆత్మీయత వెదుక్కుంటున్నాను
మసకబారిన నా ప్రస్తుతాన్ని
విడమరిచి విశదీకరిస్తుంది
విశ్రాంతినిస్తుంది
నను విడిన బంధాలని,
విగత భావాలని
వక్రించిన విధి నన్ను వెక్కిరిస్తూ
మనసుపర్చిన
నిస్పృహల్లో ఆరేస్తుంది
కంటి గానుగనుండి
కలల సారాన్ని ఆస్వాదిస్తూ
సాగే నీడకు నిర్లిప్త
ప్రేక్షకుడిగా ఉండిపోయాను
అలల దాగుడు మూతల్లో
నిద్రనోచుకోని నేను
ఆప్యాయత కోసం
ఎదురు చూస్తున్నాను
నిలవని అడుగు జాడల్లో
తడబడే అడుగుల్లో
ఆత్మీయత వెదుక్కుంటున్నాను