. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, October 30, 2015

ఓయ్ నీకేనోయ్...ఎక్కడ మొదలెట్టనూ .. (గుర్తుతెలియని వ్యక్తి అంతరంగం)

ఓయ్
నీకేనోయ్

నువ్వు గుర్తొస్తే ..ఊహూ కాదు నువ్వు కలలోకి వస్తే ...కాదు నువ్వు ఎదురుగా ఉంటే ... ఎలా చెప్పాలో తెలియటం లేదు ..పదాలకేందుకు ఇంత పరవశం ..భావాలకేందుకు ఇంత పరిమళం. అక్షరమక్షరం ఇలా తడబడుతోందేదుకు? నిన్ను ఎదురుగా చూస్తే నా అడుగులు తడబడతాయనుకున్నా. నీ తలపులు కూడా తికమక పెడుతున్నాయి నా రాతలను సైతం..!
రేయి మొత్తం నీ చిలిపి ఊసుల్లో చిదిమిన తాపం, వలపుల కలశంలో ఒంపుకుంది. ఆ గుసగుసల రవళి సొగసుల మురళీలో లీనమవుతూ అనురాగ జావళీలు పాడుతోంది. నీతో గడిపే ప్రతి క్షణం పరిమళభరితమే. ఆ ప్రేమ సుగంధం, ప్రేమైక లోకాలలో వెదజల్లుతూ జీవితాలకి ప్రేమించటం నేర్పుతుంది. ఆలోచించే, మాట్లాడే, మమతలల్లే ఈ జీవితం, కలలా కరిగిపోతుంది అనే నిజం తెలిసినా, ఆ కలని నువ్వు నిలిపేస్తావు కౌగిట్లో. ఇది చాలుగా నా జీవితానికి. బతుకు చెమ్మ రుచి చూపించే చెలికాడువి నువ్వు అని తెలిసిపోయిందిలే. కావ్యనాయికవే అంటూ కవితల్లో ముంచేస్తావు.అసలు ఆ కవితా ప్రవాహంలో సంగమించని హృదయం ఉంటుందా...చెప్పు. !
నువ్వు నా ప్రపంచపు తొలి ప్రేమవి. నిన్ను మించిన మధువు ఉందా ఈ లోకంలో ... అంత తీపిని పెదాలలో ఎలా నింపుకున్నావో గాని ఆ పదాల మత్తులో చిత్తు చేస్తున్నావుగా. పూరేకుల సొగసుని మురిపెంగా ఇచ్చుకున్న నివేదనని ఎంతో ఇచ్చకంగా ఆరగించే నీ అధరాలు ఆద్యంతం ఆఘ్రూణిస్తునే వుంటాయి. వలపుల వగలమారి నీకు తపనెక్కువే.
మాటవినని ముంగురులను మౌనంగా గాలికొప్పచెప్పి నిలబడితే, తట్టుకోలేని తమకంతో తదేకంగా చూస్తూ , ఎన్ని ఊసులు చెప్తావో తెలుసా నీకు..!
ప్రతి క్షణం నువ్వు నాకు కొత్తగా పరిచయమౌవుతూ , చిత్తుగా ఒడిస్తుంటావు. నువ్వు నాకు ఒక వరం. నీతో ఒక్కసారి మాట్లాడితే కానీ, నీ గొంతు వింటే గాని మనసు నిలవదని ఫోన్ తీసుకుని అలా పైకి వచ్చానో లేదో మల్లె పందిరి విచ్చిన పువ్వులన్నీ గుచ్చుకో అంటూ తొందరపెడుతుంటే చిలిపి చినుకులు నీ చూపుల్లా గుచ్చుకుంటు నిలబడనీయక, మనసు నీతో ఊసులకై తొందరబెడితే ఏం చెయ్యను. నీకిది న్యాయమా చెప్పు ఏ పనిమీద మనసు లగ్నం కానివ్వక, నన్ను ఆసాంతం అల్లుకుపోతున్నావు కదరా..!
పూలలోని సుకుమారాన్నంతా నీ చేతి స్పర్శలోకి తెచ్చుకుంటావేమో ..ప్రేమ సంద్రాన్ని చిలుకుతునేవుంటావు...అది వెండి వెన్నలలా ఆకాశాన్ని అద్దుకుంటోంది..తిరిగి నాపైనే అనుభూతుల చినుకులు కురిపించాలని. ప్రేమ పరుసవేదివి నువ్వు...బంగారం బంగారం అంటూ హత్తుకుంటూనే ఉంటావు. వాడిపోని, వీడిపోని మమతల పూలు తురిమావుగా .. నాపై ప్రసరించే నీ చూపులే చెప్తున్నాయి నువ్వు నా ఆత్మవని. నీ మనసు మమతానురాగాల ఇంద్ర ధనస్సు. నీ అనురాగం ఆనందాల సరాగం. విరితేనేలు అధరం అందుకుందేమో ద్రాక్షరసంతో నిండిపోయింది ...ఆ మత్తులో పెదాలు చిత్తుగా చిందులేస్తే. మళ్ళీ చిలిపిగా తాంబూలం వేసుకున్నావా బంగారు అంటూ ఆట పట్టించే నీ చూపులు నన్ను నీలవనీయవుగా.
కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా నువ్వే ..కళ్ళు ముస్తే కలల్లో నువ్వే ..ఊపిరి తీయకుండా ఆగగలను ..క్షణమైనా నీ తలపులు లేకుండా తట్టుకోలేను. అసలు నా మనసు నాదా నీదా ..నన్ను వదిలేసి నీ గురించే ఎక్కువ ఆలోచిస్తోంది.. నీకో విషయం తెలుసా అసలు పుట్టగానే నీ కోసం చూశానట. నీతో మాట్లాడటానికే మాటలు నేర్చాను.. నిన్ను రాద్దామనే భాష నేర్చాను. నా ఉశ్చ్వాసలన్నీ నీకిచ్చి , నీ నిశ్వాసలను శ్వాసలుగా చేసుకుంటున్నా. తరువుననుకో లేక తలపులననుకో ..పలకరింతలే పులకరింతలై క్షణం క్షణం పరవశిస్తున్నాను. జీవితం చిన్నదే , జ్ఞాపకాలు మాత్రం పెద్దవి.
ఎలా చెప్పను నీకు నా ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం నువ్వై పలుకుతావని.
ఎలా చెప్పను నీకు నా ప్రతి పలుకులో భావం నువ్వై ఒదుగుతావని.
ఎలా చెప్పను నీకు నా ప్రతి క్షణంలో నాదం, మోదం, ప్రాణం, ప్రణవం నువ్వై ఒలుకుతావని. 
నా ఒంటరితనం, నిన్ను మరిత దగ్గరచేస్తుంది. తొందరగా వచ్చేయ్యి ఈ విరహాన్ని చీల్చేద్దాం. నువ్వు వచ్చేదారిలో అనుభూతులన్నీ పరిచి ఉంచుతా ...అనురాగ దీప కాంతుల్లో ఆనందంగా రా.
నీ 
నేను.

Monday, October 12, 2015

నీ మదిచేరని నా గుండెచప్పుళ్ళు...(38)

1) గతంలో జారిపడి మనుషుల ముఖాల్లోంచి
అదృశ్యమౌతున్న కలివిడితనంలోంచి నిరాశ ఎదురు చూస్తుంది

2) నీవు వదలి వెల్లిన దారిలో జ్ఞాపకాల 
విత్తనాలు నాటాను అవి మొక్కైమొలిస్తే జాగ్రత్తగా చూసుకో

3) నీ జ్ఞాపకాలను కాలం కొరికేస్తుంది 
అయినా గాయంగా మిగిలి మనసు భాదగా గుర్తొస్తున్నావుగా

4) నీ జ్ఞాపకాలను కాలం కొరికేస్తుంది 
అయినా గాయంగా మిగిలి మనసు భాదగా గుర్తొస్తున్నావుగా

5) నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
నా జీవితంలో ఏపేజీ అర్దంకాలేదేమో మౌనంగా తిరుగి వెల్లిపొయారు

6) లాలించే చెయ్యికోసం..పాలించే ప్రేమకోసం
ఓరకన్ను తెరచుకుని మనసు పడిగాపులు కాస్తుంది ఎప్పుడూ

7) అదృశ్యమౌతున్న కలివిడితనంలోంచి
ఒంటరితనం నన్ను ఎప్పుడూ వెక్కిరిస్తూనే వుంటుంది

8) సందేహాల సంఘర్షణల నడుమ 
నిజానికి అబద్దానికి దూరం ఎప్పటికీ అర్దంకాదు

9) ఇప్పటికీ మనసుకు సంకెళ్లు ఉన్నాయి
ఇప్పటికీ నా మనసు అశ్రద్ధకీ, సోమరితనానికీ బానిసే

10) ఎర తగిలి నా మనస్సు ఎగిరిపడ్డ చేపలా
హృదయం రక్తసిక్తమౌతుంది కిల్లీ వేసుకున్న నీనోరులా

కళ్ళ తడి నీటిచుక్కలు అవుతున్నాయెందుకని 
మనసు భరువు తెరల వెనుక సముద్రం అలల ప్రభావమేమో

11) నిశ్చలభయాల నిర్వికారాన్ని ఏకంగా
ముక్కలుగా వేరుచేసి విసిరేస్తూ తేలికై పోవాలని వుంది

12) నా నిద్రను కాజేయమని నా కల నన్ను కవ్విస్తున్నా 
మనసులో మధురంగా ఉన్న ఆ జ్ఞాపకం నాలో అలానే వుందిగా

13) ఆలోచనలు నన్ను కాదని ఎగిసిపడుతూనే ఉంటాయి
ప్రశ్నలు నిలదిస్తూనే ఉంటాయి..అయినా పొగొట్టుకున్నదే కావాలంటుది మనస్సు

14) అనుభవం అగ్ని గుండమై అనేక పాఠాలు నేర్పినా 
అవును కాదుల నడుమ ఊగిసలాడుతూనే వుంటుంది పిచ్చి మనసు.

15) నిన్నటి పేజీలో రాయలేను
రేపటి పుటలో ఏమి రాస్తానో తెలీదు.

16) అనుకుంటానో ఆ క్షణాలు తిరిగి రావాలని 
కాని ఆ అనుభవాల శకలాలు గుచ్చుకున్నాక మౌనమే మిగిలిందిగా

నీ చిరునవ్వును మనసు కెమేరాతో ఫోటోలుగా తీసి
మధి ఆల్బంలో భద్రంగా దాచేసుకొని నా జ్ఞాపకాల బీరువాలో బందీని చేసానుగా

17) నాలికను చిధిమేస్తూ మాటలను తుంచేస్తూ 
కొన్ని పదాలు గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి

18) కీబోర్డు పై నుండి ఒక్కోపదం ..కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించగానే 
ఆవేశంగా రాసుకొన్న పదాలు ...గతం జ్ఞాపకాల మంటల్లో నుంచి 
రాలిపడిన నిప్పుకనికల్లా కనిపిస్తూ నాలోని ఆవేశాన్ని కాస్త తగ్గిస్తాయి

19) మనసు మూలల్లోనుండీ కలం నుండి కాగితాల్లోకి జారిపడి
కంఫ్యూటర్ కీబోర్డు ఇంగ్లేషు కీబోర్డుపై తెలుగు అక్షరాలు జ్ఞాపకాలుగా జారిపడుతున్నాయి

20) చెప్పుకున్నా తీరదు ఆ తీవ్రత విషాదపు లోతు ఉన్నదున్నట్టు 
బయటికి పంపాలంటే రాసుకోడం తప్ప వేరే దారి లేదు తడిచిన అక్షరాల సాక్షిగా

21)  తీయని తలపుల సంవేదనకాదు
చెలిమి చెలమల ఒయాసిస్సును చేరువ కాలేని ఒంటరి ప్రయాణం

పలకరించుకోవడానికి దొరకని సమయాల్లో. 
మాటలు దొరకని సందర్భాల్లో నీ మౌన సందేశం నాకు చేరిందిలే

22) పగలూ, రాత్రులూ ఒకదాన్నొకటి చంపుకుంటాయి.
మరో రోజు ఉదయిస్తుంది ఎర్రబడిన సూర్యుని సాక్షిగా నిస్సిగ్గుగా

23) తన సమక్షంలో బాల్యం తిరిగి ప్రవహిస్తుంది
తను వెల్లిపోయాక హృదయం అనుభవాల పాఠశాల్లా శిదిలమైపోతుంది

24) నవ్వులుండాల్సిన చోట కన్నీరుంది
కనీసం నిద్రలోనైనా శాంతి నివ్వండి ప్లీజ్

25) సూర్యాస్తమయం కాగానే చీకటిలో వెలుగు
మృత్యువుకి ప్రతిరూపమై, అన్నిటినీ కనుమరుగుచేస్తంది

26) విలవిలలాడుతున్న ఓ దృశ్యం
కలవరపెడుతుంది జ్ఞాపకం గాయమైన క్షనం

27) పిడుగులుగా పగిలిన ఆకాశం
నల్లటి మెఘాల్లో మొహం దాచుకొని వర్షం అయి కురుస్తోంది

28) తడిసిన కలలు తుడుచుకుంటూ
తడారిన పెదవుల్లో పదాలు రాలిపడుతూనే వున్నాయి

29) మళ్ళీ రాని నీ చిరునవ్వులు వెలుగురేకలై 
మౌనపు మాటల ద్వారపు తోరణాలల్లో వేల్లాడుతున్నాయి

30) కాలాలలో మరపురాని గురుతులెన్నో
పువ్వులవలె గుబాళించే గురుతులలో మిగిలిపోయే జ్ఞాపకాలు కొన్నే

31) నువ్వు ఇపుడు నాలో చూస్తున్న వెలుగును
నీవెల్లిపోయాక నాలో చీకటి ని ఎప్పుడైన గమనించావా

32) వర్షించడం మర్చిపోయిన కన్నీటికి 
మిగిలేది గతించిన జ్ఞాపకాలు తడి మాత్రమే

33) భావ సముద్రాల లోతుల్లోకి చూస్తున్నా
కవితారణ్య ఆడవుల్లో వెతుకుతున్నా కనిపించవెందుకని

34) అపజయాల దిగుడు బావిలో 
ఆత్మహత్యిచ్సుకొంటున్నా జ్ఞాపకాలనేమనాలి

35) నా గుండెల్లోంచి చేతులతో 
అక్షరాలను తీసి Fభ్ లో పేరుస్తున్న వెగటువాసన వస్తోంది కదూ

36) చీకట్లో కాలాన్ని విదిలించుకొ రాలిపోతున్న 
నిశ్శబ్దంలో తడుస్తూ మౌనంలో మునిగిపోయా

37) భావాలకు దాహమైనప్పుడల్లా
మనసులోని అక్షరాలను కాగితాలపై రాలుస్తోంది

38) ముద్రవేలుకి చూపుడువేలుకీ మధ్య తిరుగుతున్న "ంఔసె"
అటు ఇటు తిరిగినా ఎంత వెతికినా వెబ్ ప్రపంచంలో నీవెక్కడున్నావో చెప్పవూ

39) శబ్దానికి మరో శబ్దానికి మధ్యలో 
ఇరుక్కొని నిశ్శబ్దం మౌనంలో దాగి తొంగిచూస్తోంది

40) అరిచేతుల్లోంచి అదృశ్యమైన అదృష్టరేఖలు
దేహమంతా పాకి ప్రశ్నిస్తున్నాయి అదృష్టం ఏమైందని

41) ఏకాంతంలోకి నిన్ను నెట్టలేను
ఏకాంతాన్ని నీతో పంచుకోనూలేను ఇది నిజం

42) చీకటి రంగులో కలిసిపోయిన
‘నలుపు ‘ కబంధ హస్తాల్లో నేను నీకు కనిపించనులే

43) నీదో మౌనమైతే, నాదో అంతర్ముఖం
రెండు రాళ్ల మధ్య ఖాళీల్లా ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లా

44) రెండు మనసు గదుల మధ్య
పాత జ్ఞాపకాలకు కొత్త తొడుగులు తొడగనీ

45) పిలిస్తే పలికేంత దూరంలో నీవు ఉన్నప్పుడు
దూరాన్ని అమాంతం మింగే కాలన్ని తలచుకొంటే కోపం వస్తుంది

46) రేపటి నిప్పుకణికలమీద కాల్చడానికి
నీకోసం నా గతాన్ని స్వగతంలో కలిపేసాను

47) శబ్దానికి మరో శబ్దానికి మధ్య
ఎప్పుడూ నాలో నిశ్శబ్దం ముఖం చాటేస్తుంది

48) గతం జ్ఞాపకాల మడుగులో చిందులేస్తుంది 
కళ్ళల్లో కలల్ని ఒలక బోస్తుంది ప్రస్తుతం నిజంకదూ

49) మాటు వేసి ఉన్న నాలోని ఒంటరితనం
ఏమరపాటు లోంచి చొరవగా మనసులోకి చొచ్చుకొస్తుంది

50) నిలువరించలేని మనసుకి నిలకడైన నిశీథికి నడుమ
పలుమార్లు పరికించినా పలుకరింపులేవీ మోసుకురాని నా జీవితకొలమానం

51) కాల గతిలో నేను కొట్టుకుపోయినా
తిరిగొచ్చినా రాకపోయినా నీ దరి చేరినా చేరక పోయినా నీకోసం నేను ఎదురు చుస్తూ ఉంటా

52) ఓటమి తప్పని పోరాటాలు
గెలిచి ఓడిన సంఘటనలు..నిర్లిప్తంగా సర్దుకుపోయిన సన్నివేశాలు

53) మనసుకు తగిలిన గాయం మానేందుకు
మౌనం మందును మనసుకు పులిమి ముందుకు సాగలేక వెలుతున్నా

54) నా నిన్నటికి నేటికి మధ్య వంతెన మాయమయ్యింది
లోకానికి తెల్లారిందినాకు ఈ రాత్రీ కరిగి జరిగి పోయింది కరుడు గట్టిన నిజంలా

55) గుండె లోతుల్లోని కొన్ని ఊసులు
కళ్ళతో చెపితే మనసుతో వినాల్సిందే తప్పదు కదూ

56) రాయాల్సింది రాయలేని క్షణం
జీవించాల్సినప్పుడు జీవించలేని క్షణం 
భరించలేని నిరీక్షనం..ఎప్పటివరకో ...?

57)  ఆలోచనలన్నీ దాడి చేస్తే పగిలిపోయిన జ్ణాపకాలు
మనసునండి కారిన రక్తపు బొట్లను జారుతున్న కన్నీటిని వృదాచేయకు

58) అవమానం అయోమయంలో పడే అవస్థలకన్నా..
మనసు భారంతో కారే కన్నీళ్ళలో కలిసి కొట్టుకుపోవడమే.. సుఖమేమో కదూ...?

59) నీది కాదు నాది కాదు
మనల్ని కాలిస్తే మిగిలేది గుప్పెడు బూడిదే మరి

60) నిలదీస్తే వదిలేస్తావేమో అని భయంతో 
నమ్మకం నిజమా కాదా అనే అనుమానంతో ఆకలిగా చూసే ఆకళ్ళెవరి..?

61) నీ మనసు చిల్లుల సంచిలో 
ఉన్నానో తెలియని ఆందోళనలో నేనెక్కడా అని అడుగలేను

62) భావాలకు దాహమైనప్పుడల్లా
మనసు భారమైన కర్కశత్వానికి కన్నీరేగా దిక్కు

63) చించేసిన కాగితాలలో అక్షరాలు విరిగిపోయాయనుకున్నా
 అవన్నీ ఈ ముఖపుస్తకంలో పేరుస్తున్నా ఎవ్వరూ భావాన్ని ఇరగ్గొట్టలేరని

64) రెండు మనసుల నిరంతరం భయంకర నిశ్శబ్దం
మనిషి ధ్వంసానికి మహా సంగ్రామాలు అక్కర్లేదు..ఈ నిశ్శబ్ద యుద్దం చాలదూ

65) మన మౌనాన్ని బద్దలు చేయాలని అక్షర ప్రవాహం 
అలుపెరుగని పోరాటం చేస్తూనే వుంది..విజయమా ఎక్కడున్నావు

66) నిరాశ,నిస్ప్రుహ, నిరుత్సాహంలోంచి లేలేతగా
నేను చనిపోయిన ఓటమిలోంచి బ్రతకాలని చూస్తున్నా ప్లీజ్ బ్రతికించరూ

67) మౌనం "గాయం" మైన హృదయంలో
ఏముందని అవమానపు కత్తులు దూస్తూన్నావ్

68) ఉదయం లాంటి నీ చిరు నవ్వు 
నా జ్ఞాపకంలో అస్తమించడం ఇష్టం లేక రాలిపోతున్నా

69) మనోఫలకం పై కలల్ని కాల్చేసుకొని
అనుభవాలన్ని అక్షరాలకి లొంగిపోతాయనుకోవడం అవసరమా

70) నేను చుట్టేసుకున్న వలయంలో
నేను తిరుగుతూనే వుంటాను..చీకటి తెలియని రాత్రి కోసం

71) ఎన్ని దూరాలు కలిపితే..ఒక దగ్గరితనం మనదౌతుంది

72) ఉద్వేగం తగ్గిపోతుంది..ఆవేశం ఆరిపోతుంది
బాధ మిగిలిపోతుంది ఎవరో మనసుకి అక్షరాల కాపడా పెట్టారేమో

73) జారిపోతున్న.. ప్రస్తుతం అద్రుశ్యమవుతున్నా
నా ఆలోచనలు నిశ్శబ్దంగా అరుస్తూనే వున్నాయి

74) బరువెక్కిన రెప్పల మధ్య,
నిశిరాతిరిలో నిశ్శబ్దంగా..మౌనం రగులుతోంది

75) బరువెక్కిన రెప్పల మధ్య,
నిశిరాతిరిలో నిశ్శబ్దంగా..మౌనం రగులుతోంది

76) దరిలేని తీరాలు, తీరని దాహాలు
అలుపెరుగని అలల మధ్య..ఇంకా కొట్టుకుపోతూనే ఉన్నా..?

77) నిశ్శబ్దం" హెచ్చరించి ఆ గడియారం ముల్లు 
మనసు గాయాలను గుచ్చుతోంది రక్తంఓడుతున్న నిజం సాక్షిగా

78) నీరుగారిన నిరుత్సాహంలోంచి 
లేలేతగా చనిపోయిన ఓటమిలోంచి బ్రతకాలని ఉంది..?

79) చించేసిన కాగితాలతో మాటలు విరిగిపోతున్నాయి
ఆవిరిగిన అక్షరాలను జేబులో పెట్టుకుంటే గుండెల్లో గునాపాలై గుచ్చేస్తున్నాయు


80) గుండె కన్నా పెద్ద ఇంకుడు గుంట ఏముంది
ఇవాళ అదీ నిండి నట్టుంది.. ఒలుకుతుంది కారణం చెప్పరూ..?

81) జ్ఞాపకాలు అలసటగా ఆవులిస్తున్నప్పుడు
చెక్కిళ్ళపై జేరి చోద్యం చూస్తున్న కన్నీటి కి దారేదో చెప్పరూ

82) తెల్లని నిజాన్ని దాచేసే
నల్లని అఙ్ఞానపు ముసుగులున్నాయి జాగ్రత్త

83) సూర్యి కిరణాలు సోకని ముఖ పుస్తకంలో (FB)
కన్నీల్లు అక్షరాలై గోడమీద అత్రంగా అల్లుకుంటున్నాయి

84) శూన్యం నన్ను తరుముతుంటే రాల్చుకున్న స్వేచ్చని
వెతుక్కుంటూ జారిపొయిన జ్ఞాపకాలను ఏరుకుంటూ నడుస్తున్నాను

85) మోసం చేసి ఈ క్షనం నీవు గెలవొచ్చు 
ఆ పాపం నీ కుటుంబాన్ని నిలువునా తగలబెడుతుంది ఇది కన్నీటి శాపం

86) గెలుపు గాయంగా మారిన క్షనంలో 
ఓటమిని మౌనంలో దాచుకున్నా నిశ్శబ్దంగా

87) తీరం ఎటో తెలియని ప్రయాణం
అలసట తీరని మజిలీలతో దప్పికతో దహించుకుపోతున్నా

88) స్థితిగతులు మారి, నిస్సత్తువ గెలిచినప్పుడు
గెలవాలని నన్ను మానసికంగా చంపిన క్షనాలు మౌనంగా బరిస్తున్నా

89) పొరలు పొరలుగా జారిపోతున్న ఈ నిసర్గరాత్రి
మృత్యుధ్వజంపై అచ్చేసిన బొమ్మ నాదే మీకు కనిపిస్తుందా

90) నిజానికి మనసెప్పుడూ గాజుపలకే
పగులుతూనే ఉంటుంది నిజాలు ముక్కలు ముక్కలవుతూనే ఉంటాయి

91) నన్ను నాకు ఏం కాకుండా చేసింది రేపటికి మిగిలిన ఈనాటి జ్ఞాపకం..
మరో ఆలోచనకు పునాది గా మిగిలింది నిన్నటికి.. నేటికి.. మిగిలిన ఉన్న ఆశ

92) గుప్పెడు కన్నీళ్లను చేతబట్టుకుని..
నేనున్నాను అనే ఓదార్పుకోసం..ప్రతీ వీధిలో పరుగులు పెడుతూనే ఉన్నా

93) అబద్దాలో.. నిజాలో.. తేలని అనుభవాల మధ్య.
నిస్థేజంగా నిర్జీవంగా ఒంటరిగా మిగిలిపోయా ముక్కలైన మనస్సుతో

94) నా మనసు గదిలో.. నన్ను నేను వెతుక్కుంటూ..
నాలో నేను నడిచిపోతున్నప్పుడు..ప్రపంచం ఒంటరైపోతుంది.

95) ఇన్నోసెంట్ ఫేస్ అని నమ్మకండి...కాస్త అవకాశం ఇస్తే అవమానిస్తారు.....
ఇంత కుట్రవుంటుందా వీళ్ళ మనసులో అని ఊహించలేం..అంతదారుణమైన మనసువాల్లది

96) కలలు పరిచిన నిశీధిలో ఏరి తిరిగి కూర్చలేక బంధాలు త్రుంచి,
బరువు తీర్చమన్నట్టు నిట్టూర్పుల బలానికి అనంత వీధుల్లో..ఈ రాత్రి గాలిపటంలా ఎగరుతుంది.

97) నిన్న గతం , నేడు నిజం ,రేపు ఊహ
నిన్నటికి నేడు రేపు అయితే రేపటికి నేడు నిన్నవుతుంది

98) విరహం విషాదంలో మునిగిపోయింది 
మనసు మూగగా రోదిస్తున్న క్షనాల్లో ..నిశ్శబ్దంగా నాలోనుండి క్షణాలు జారిపోతుంటే

99) ఎంతైనా గురుగు గురువే ..ఆయనిచ్చే దైర్యం ..
ప్రపం చాన్ని జయించొచ్చు ..ఆయన మాటల్లో అందుకే గౌస్ మా బాస్ ఎప్పటికీ

100) నిజాన్ని అబద్దంలో బిగించేసి ఎదురుటి మనిషిచేసే స్వార్దపు
టక్కుటమారాలు ఎన్నాల్లు భరించాలో.. ఏమనిషిని నమ్మాలి..ఏ నటన నిజం అనుకోవాలి

101)నిజాన్ని అబద్దంలో బిగించేసి ఎదురుటి మనిషిచేసే స్వార్దపు
టక్కుటమారాలు ఎన్నాల్లు భరించాలో.. ఏమనిషిని నమ్మాలి..ఏ నటన నిజం అనుకోవాలి

102) నాలో నేను ఒదిగిపోయి.. కాలం అనే కాష్టంలో కాలిపోతూ
లేని నవ్వును మొహాన పులుముకుని ఆకాశంవైపుచూస్తున్నా వేదనగా

103) ప్రతి రాత్రి... అవే ఊసులు
చీకటి పొదల్లో ఎక్కడినుంచో నావైఉపే చూస్తున్నాయి

104) నిజమైన కళ్ళు ప్రేమిస్తే ఆ ప్రేమ కు ఆయుష్షు ఉంటుందా
మనసు ప్రేమిస్తే ఆ ప్రేమకు మరణం ఉంటుందా ? కోరిక తలయెత్తే ఆ ప్రేమలో నిజాయితీ ఉంటుందా?

105) ఓడించానని సంబర పడిపోకండి
ఓటమి తరువాత గెపుపే నన్న నిజం తెలుసుకోండి

106) తెల్లని కాగితo నలుపు సిరా లో నా నవ్వు నలిగిపోతోంది
దేవుడా ఈ నలుపును జయించే తెల్లని ఓ చిరునవ్వు నాకివ్వు.

107) అంతరాళాల్లో గజిబిజిగా తిరుగుతూ
అల్లిబిల్లిగా అల్లుకున్న మల్లె తీగల్లా నీజ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి

108) "నేను" అన్న పదంలో 
ఓ మనిషి అదృస్యిం అవుతున్నాడన్న నిజం కనిపిస్తోంది

109) నా చుట్టూ ప్రపంచం మాయమయి
చింద్రమైన మనసు గాయాన్ని నాకు వదలి బోలెడు నిశ్శబ్దాన్నీ మిగిల్చింది..

110)నేను నిశీధిలో మొలచిన పిచ్చిమొక్కను
స్పర్శ మర్చిన విగత జీవిని అన్ని అనుబందాలు వీడిన ఒంటరిని

111) ఆపదరలో ఆదుకొన్నవారిని
స్వార్దంతో పక్కనపెడితే ఆశాపం మంటై ఇంట్లోరగులుతుంది

112) కలల తెప్పపై ఒదిగిన రాత్రుల్లో
రెప్పల మాటున తడిలో కరిపోతున్నా జ్ఞాపకం

113) పెగలని "పదాలు" పెదవుల మాటునే
రాలిపోతున్నాయి కన్నీటిలో కరిగిపోతున్నాయి మౌనంగా

114) పగిలి కుట్లుపడ్డ పదాల పెదాల మీద
రక్తం చిమ్ముతూ గులాబీలా విచ్చుకుందో చిరునవ్వు

115) అవసరం ఉన్నప్పుడు ఆకాశానికి ఎత్తి
ఆపదలో ఉన్నప్పుడు అక్కరకురాని ముసుగు స్నేహితులను నమ్మకండి



Sunday, October 11, 2015

ఎదుటి వారి మనసుల్లో మౌనాన్ని గుచ్చి గానాలు చేస్తున్న

ఎన్ని నిశ్శబ్దాలు 
మాట్లాడుతున్నా  
ఎన్ని నిరాశలు 
నిన్ను కమ్మేస్తున్నా  
ఎన్ని నిస్పృహలు 
నీలో మనిషిని వెతుకుతున్నా  
ఏకాంతం ఎందుకో 
నన్ను ఎప్పుడూ ఎక్కిరిస్తుంది 
నిదానించమని 
ఓ మౌనం నన్ను ప్రశ్నిస్తున్నా 
అల్ల కెరటాలు కలలతో  కవాతుచేస్తున్నా 
ఆటుపోటులు తో 
అలుపెరగనీ పోరాటం చేస్తున్నా 
ఉప్పెనలు నా ఊసులని కప్పేసి 
దిగులు దిగులుగా 
దిగమింగేస్తున్నా 
నాలోని ఆవేశం
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి 
మౌనమై పగుళ్లిస్తూనే ఉంటాయి
కొన్ని నిశ్శబ్దాలు
భయంకర శబ్దాలు అవుతాయి 
కొన్ని జ్ఞాపకాలు మనసుకు 
గాట్లుగా మిగులుతాయి 
కొన్ని నీడలు 
నాగతాన్ని గుర్తుకు తెస్తాయి 
కొన్ని నమ్మకాలు 
వెర్రివాడా అని వెక్కిరిస్తాయి 
నిజాలు భగ్గుమన్నా 
నీవు భయపడవు
నీ హృదయం ముక్కలు కావు 
ఎందుకంటే నీవు మనిషివి కాదు 
శిల్పానివి  మనిషి 
రూపంలో ఉన్న రాయివి 
నీవకున్నదే నీకు ముక్ష్యం 
ఎదుటి వారి మనసుల్లో 
మౌనాన్ని గుచ్చి గానాలు 
చేస్తున్న నీవు నిజంగా గాయనివే 

Saturday, October 10, 2015

కన్నీటి చుక్కల్లో కలిసిన జ్ఞాపకం నీకోసం తడుముకుంటోంది

మనసులోనే మూతపడ్డ వ్యధని 
గాధగా మార్చాలని చూస్తున్నా 
కరిగి కన్నీటి జల్లవనీ పన్నీటిగా 
నీపై జల్లాని చూస్తున్నా 
కన్నీటితో తడిసిన కోర్కెలు నాపై 
రక్తాన్ని కురిపిస్తున్నాయి 
ఆశల గాలిసోకి మరీ ఆరనీ 
కన్నీటి చుక్కల్లో కలిసిన జ్ఞాపకం 
నీకోసం తడుముకుంటోంది 
నమ్మకంలో సొమ్మసిల్లిన 
నీ మది తలపుల్లొ నితలపులను 
నిద్రపుచ్చాలని చూస్తున్నా 
మదిని మాటున దాగివున్న 
మన  జ్ఞాపకాల నీడల్లో 
చేదతీరాలని చుస్తున్నా 
విప్పారిన జ్ఞాపకా రెక్కలు విచ్చుకొని 
నిన్ను తాకాలని చూస్తున్నా 
నాకు నేను  విహంగినై 
గగనాన్ని నాకు నేను  
చేరగలనేమో కాని
నిన్ను చేరలేనని తెల్సిన నేను బేలగా 
ఆకాశం వైపు చూస్తున్నా 
గగనంలో  లో తిరుగాడే పక్షులు 
నావైపు జాలిగా చూస్తున్నాయి 

దారితెలియని  మజిలీలు 
నాదారిమొత్త ముళ్ళ దారిని చేశాయి 
రేయంతా తపనతో తడిసిన 
చెమటకి వేకువవేడేదో తెలుసుకోలేక 
కరిగిపోబోయిన కలలని 
మనోధైర్యంతో మాయ చేయలేక  
నన్ను నేను ఎన్నిసార్లు మోసం చేసును 
నాకే నేను జరగని వాస్తవాలను నిజాలని 
అవి పైకి కనిపించే నీడలని
తెల్సి నా మౌనంలో నేను మగ్గిపోను 

నీ  ప్రేమనే అన్వేషిస్తూ 
తూరుపు పడమరల దిక్కు తెలియక 
పరులుగులు పెడుతున్నా 
నామనసు జాడనీసం ఇంకా వెతుకుతూనే వుంది
గుండె పగిలి  ముక్కలైన జ్ఞాపకాలను 
గుడేల్లో గుచ్చుకొనే ఉన్నాయిగా  
అనుభవాలనే జ్ఞాపకాల వరంగా ఇచ్చి 
నిజానికి మాయని మచ్చను అడ్డుగా పెట్టి
మచ్చలనే దాచి చందమామనై 
చీకటిలో కల్సిపోయేలా చేశావుగా   

Saturday, October 3, 2015

ఓ మృత్యువా రా నన్ను కబలించు

ఓ మృత్యువా, ఆమె ఇపుడున్న చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చి నాదగ్గరకు రా నువ్వు నా దగ్గరకి వచ్చేటపుడు
నువ్వు సమాధి వాసన వేస్తూ రాకు...నీవు అందరిని మభ్యి పెడుతూ  రాకు నాదగ్గరకు ..నీవు నన్ను కబలించేప్పుడు అందరు నవ్వుతూ వుండాలి ...నేను చనిపొయాను అని తెలిశాక కూడా నమ్మలేనంతగా ..అందుకే ఓ మృత్యువా, శూన్య నిస్వనముతో రాకుఅడుగులు సడిచేయకుండా, మురికిచేతులతో రాకు. అతు ఎటు చూడు  నీ నిర్మానుష్య, అగోచరమైన ఆవాసముకంటే చికటి కంటే భయంకరంగా లేకుండా కాస్త వెలుగులో నాదగ్గరకు వచ్చేయి నేను ఆనందంలో వున్న అనుకోకు ఇప్పుడు నేనేం తక్కువ ఒంటరితనం అనుభవించడం లేదు.కానీ, ఆమెని తాకిన ప్రతి వస్తువుకీ అంటుకునే సుగంధం లాంటి సుగంధం, పరీవ్యాప్తమైన ఆమె సహజ పరిమళంతో రా ఆమె మృదు,శీఘ్రతర కరస్పర్శ అరువు తెచ్చుకో ఆమె కురులవెలిగే లేత పసిడి రంగునద్దుకుని ఓ మృత్యువా, నను చేర రా. నీ అడుగులు తేలికగాపడి ఆమె వచ్చిందేమోనని నేను భ్రమించాలి, భ్రమించి నా మృత్యుశయ్యపై ఒత్తిగిల్లాలి.మృత్యువా నీవు నన్ను కబలించినప్పుడు ప్రశాతంగా ఊపిరిలేని నాశరీరం సాక్షిగా నేను బ్రతికి వున్ననేమొ అన్న బ్రమ ఉండేట్టు చేసి నన్ను తీసుకపో అమె నాకోసం ఎప్పటికీ ఏడ్వదు..కాని నేను పోయానని తెల్సి నటిస్తుందేమో  అదితలచుకొని నామనస్సు గడ్డకడుతున్న నా నవనాడులూ వేడెక్క వచ్చు ఆమె స్వరం అనుకరిస్తూ నన్ను పేరుపెట్టి పిలు నన్ను చేరేలాచూడూ ఇదే నా ఆకరి కోరిక అపుడు ఓ మృత్యువా, నేను నిన్ను గమిస్తాను.ఇది ఊహే కాని ఏదీ నిజం చేయకు  ఓ మృత్యువా, ఆమె ఇపుడున్న చీకటిలోంచి వెలుగులోకి తీసుకొచ్చి నాదగ్గరకు రా నువ్వు నా దగ్గరకి వచ్చేటపుడు
నువ్వు సమాధి వాసన వేస్తూ రాకు...నీవు అందరిని భ్యపెడుతూ రాకు నాదగ్గరకు ..నీవు నన్ను కబలించేప్పుడు అందరు నవ్వుతూ వుండాలి ...నేను చనిపొయాను అని తెలిశాక కూడా నమ్మలేనంటగా ..అందుకే ఓ మృత్యువా, శూన్య నిస్వనముతో రాకుఅడుగులు సడిచేయకుండా, మురికిచేతులతో రాకు. అతు ఎటు చూడు  నీ నిర్మానుష్య, అగోచరమైన ఆవాసముకంటే చికటి కంటే భయంకరంగా లేకుండా కాస్త వెలుగులో నాదగ్గరకు వచ్చేయి నేను ఆనందంలో వున్న అనుకోకు ఇప్పుడు నేనేం తక్కువ ఒంటరితనం అనుభవించడం లేదు.కానీ, ఆమెని తాకిన ప్రతి వస్తువుకీ అంటుకునే సుగంధం లాంటి సుగంధం, పరీవ్యాప్తమైన ఆమె సహజ పరిమళంతో రా ఆమె మృదు,శీఘ్రతర కరస్పర్శ అరువు తెచ్చుకో ఆమె కురులవెలిగే లేత పసిడి రంగునద్దుకుని ఓ మృత్యువా, నను చేర రా. నీ అడుగులు తేలికగాపడి ఆమె వచ్చిందేమోనని నేను భ్రమించాలి, భ్రమించి నా మృత్యుశయ్యపై ఒత్తిగిలాలి.మృత్యువా నీవు నన్ను కబలించినప్పుడు ప్రశాతంగా ఊపిరిలేని నాశరీరం సాక్షిగా నేను బ్రతికి వున్ననేమొ అన్న బ్రమ వుండేత్తు చేసి నన్ను తీసుకపో ఏంటీ గడ్డకడుతున్న నా నవనాడులూ వేడెక్క వచ్చు; ఆమె స్వరం అనుకరిస్తూ నన్ను పేరుపెట్టి పిలు నన్ను చేరేలాచూడూ ఇదే నా ఆకరి కోరిక అపుడు ఓ మృత్యువా, నేను నిన్ను అనుగమిస్తాను.ఇది ఊహే కాని ఏదీ నిజం చేయకు నన్ను నీదగ్గరకు తీసుకపోయి నీ ఆకలి తీర్చుకో మృత్యువా