. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, April 26, 2015

నిన్న గతం , నేడు నిజం ,రేపు ఊహ

"నేను" అన్నది చెరిగి పోతే..
"నువ్వు" అన్నది మరచి పోతే..
నాకు నీకు బేధం తొలగి పోతే.
మనంలో మిగిలిపోతాముగా 
నేనంటే నేను కాదు.. 
నన్ను మలచిన నా గతం..
నన్ను నాకు ఏం కాకుండా చేసింది 
రేపటికి మిగిలిన ఈనాటి జ్ఞాపకం..
మరో ఆలోచనకు పునాది గా మిగిలింది 
నిన్నటికి.. నేటికి.. మిగిలిన ఉన్న ఆశ 
రేపటికి..నా తోడు నా ఈ జ్ఞాపకం.. నా ఆశ నమ్మకం.
కాలం "సర్వరోగ నివారిణి"
నిన్న గతం , నేడు నిజం ,రేపు ఊహ
నిన్నటికి నేడు రేపు అయితే 
రేపటికి నేడు నిన్నవుతుంది .
గతాన్ని గురించి ఆలోచించేవాడు ,
భవిష్యత్తు ఊహల్లో విహరించేవాడు ..
నేడు ఆనందంగా జీవించలేడు .
గతం అనే అనుభవం పై పునాదులుగా వేసి ...
భవిష్యత్తుకు ఖచ్చితమైన నిచ్చెన వేసి అడుగు వేసే ...
ప్రతి నేటికి కాలం పూలబాటతో ఆహ్వానం పలికి 
ముందుకు వేసే ప్రతి అడుగు భవ్యిషత్తుకు పునాది