. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 8, 2014

నాలోకి నేను కాకుండా నా నించి నేను దూరంగా...

పగలంతా ఒద్దికగా 
కూర్చున్న జ్ఞాపకం
ఉండుండి వీచేగాలిలా
వళ్ళు విరుచుకుని
రాత్రి నా మనసుపై దాడి చేస్తుంది
మనసు వాకిలి పొడవునా 
రాలిన పారిజాతాలతో
కాసేపు గతి తప్పిన 
అక్షరాలతో 
అక్షరాభ్యాసం చేసుకోవాలి!
మనస్థాపాల మసకతెరలను 
దాటుకోవాఅని
నన్ను నేను 
దాచుకొని పరిగెత్తుతున్నా
నేను నానీడ తొ 
గొడవపడాల్సి వస్తుంది
అందుకే ఈ నిశిరాత్రిని
ఈ నింపాది రాత్రిని 
నీకు పరిచయం చేయాలి
అందుకే నీకోసం వెతుకుతున్నా 
కాస్త కనిపించవూ ..

కటిక చీకటిలో 
మనసుపై మిగిలిపోయిన
ఆఖరి కన్నీటి 
చారికను అదృశ్యం చేస్తూ
చీకటి చిక్కపడుతుంది..
ఆకాశమల్లెలు 
ఒక్కొక్కటిగా విరబూస్తాయి
నాలుగు మాటలు 
చెప్పుకోడానికో
లేక తప్పిపోయిన 
కలల్ని వెదుక్కోడానికో
ఓంటరిగా ఆకాశంవైపు చూస్తు
ఆక్షనంలో ఏం చేస్తున్నావంటూ
నీజ్ఞాపకం నన్ను 
ఆడిగితే ఏమని చెప్పను

ఎందుకో అనిపిస్తుంది 
జ్ఞాపకాల శకలాలనీ..
సుదూర స్వప్నాలనీ
పగటి పాట్లనీ
వాటంతట వాటికి వదిలేసి
ఈ రాత్రిని జీవించాలని ఉంది
నాలోకి నేను కాకుండా
నా నించి నేను దూరంగా..
నన్ను నేను గా
ముక్కలుగా 
వేరుచేసి విసిరేస్తూ
తేలికై పోవాలి.. 
నాలో నేను ఏకమై పోవాలి
జాబిల్లి ఆకాశంలో ముసిముసి
నవ్వులు నవ్వుతోంది
అది జరిగదులే అని 
వృదారయాస అని నిజమే కదూ