నిదురిస్తే మళ్ళీ మేలుకొంటానా,
మరణిస్తే మళ్ళీ పుడతానా
ఎందుకు బ్రతకాలి
బ్రతికి సాదించేదేముందొ
ఇపుడే చూడగలిగినంత చూసుకోవాలి
నా మెలకువ బెలూనులో జ్ఞాపకాలను
చాతనైనంత నింపుకోవాలి..
నన్ను నేను దాచుకోవాలి
ఈ విశాలమైన ఆకాశంతో,
నక్షత్రాలతో, చలిగాలులతో
నాకిక పనిలేదు నేను
ఇప్పుడూ ఓంటరిని
నామీద నాకు అసహ్యం వేస్తుంది
నీన్నేమనగలను
అర్హత లేని మనస్సుకదా నాది
నిద్రరాని ఈ రాత్రి,
నా మనసు గది తలుపులు తెరిచి
నన్ను నేణు చూసుకున్నా
అన్ని అరల్లో
అన్ని పొరల్లో నేవే వున్నావు
నాకోసం నేను
ఎక్కడన్న కనిపిస్తేనేమో అని
లేదు నాలోనే నేను లేనప్పుడూ
నేనేందుకు బ్రతకాలి
చలికి ఒణికిన గాలితెర
ఒకటి మళ్ళీ జీవితం తాకినట్టు తాకివెళ్ళింది
అది నిజం అనుకున్నా
కాదు అది బ్రమని తెల్సింది
అద్దంలాంటి ఆకాశంలోకి
ప్రశ్నలన్నీ పక్షుల్లాగా ఎగిరిపోయాయి
కొన్ని గద్దలై నన్ను పొడుస్తున్నాయి
ఈ రాత్రి ఎంత బావుంది
రేపటి రాత్రిని చూడలేనేమో
ఈ చల్లదనమూ,
ఆకాశమూ ఎంత బావున్నాయి
ఇవన్నీ ఇప్పుడూ నాకోసం లేవేమో
వీటన్నిటినీ చూడటమెంత బాగుంది
కాని రేపటిని కనలేని నాఖు
ఇప్పుడు తలచుకొని చుస్తే అన్నీ
వింతగ కనిపిస్తున్నాయి
రేపటి వెలుగులు చూడలేనేమొ
ఇప్పుడూ మూసిన కనులు
రేపటికి తెరువలేనేమో