మనసు అను క్షణం నీ కోసం పరుగులు తీస్తుందిఅలసట తెలియకూడదని కబుర్లు చెప్తూ నేనూ దానితో.....మెరిసీ మెరిసి అలసిన సూరీణ్ని పడమర తన లోయలో దాచుకొంటోందినిత్యం పరుగులు తీసే గోదారికీ సంద్రం చేతులు చాస్తుందిచీకట్లో మగ్గే నింగికీ జాబిల్లి జాబునిస్తుందిమరి నా నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుంది...?నీ సంగమంలో ఈ పరుగు ఎప్పుడు నిలుస్తుంది...?ఆ క్షణాలిచ్చే మధురానుభూతితోనడవగలను జీవితాంతం నీతోనేనిక పరుగెట్టలేను...