Thursday, January 1, 2009
నీ సమక్షంలో...
స్నానం చేసి బాల్కనిలోకొచ్చానుఅమాంతంగా చిరు గాలి హత్తుకుని మత్తెక్కిస్తుందిఆ మత్తు ఎక్కేలోగా కవ్విస్తూ దూరంగా జారుకుంది...అప్రయత్నంగా నా పాదాలు పార్క్ వైపుకి కదిలాయిరెండు రోజుల క్రితం వాన కురిసి ప్రకృతి చల్లబడిందితేమను విడిపించుకున్న గాలి అప్పుడే రెక్కలు విచ్చుకున్నసీతాకోక చిలకలా పొడి పొడిగా వడి వడిగా ప్రవహిస్తూ మైమరిపిస్తుందిఆశ్చర్యంగా...,ఫ్లెడ్ లైట్కి దూరంగా ఆకాశంలో...మీగడ 'మబ్బు చుట్టు ' మధ్యలో జాబిల్లి మెరిసిపోతుంది...నా కళ్ళూ మెరుస్తున్నాయి... నిశ్చలంగా నేను!అసూయ చిరుగాలిని తాకినట్టుంది, అది నా వీపు చరిచిందినా పాదాలు కదిలాయిఈ ఏకాంతం నాకొక తోడుని ఆహ్వానిస్తుంది...ప్రియా... నువ్వు నా దరిదాపుల్లోనే ఉన్నావనే స్పృహలోఈ రేయి... ఈ ప్రకృతిని అనుభవించాలని ఉంది...