ఇప్పుడే కురిసిన వాన జల్లు పరిసరాలని పులకరింప చేసిందిచెలి కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉందిచెలి చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...చల్ల గాలులు, కారు మబ్బులులేని వెచ్చదనాన్ని, రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...చెలి దూరంగా వుందితన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది...చెలీ రావే,వరాలీవే,వెతికా నిన్ను వీచే గాలుల్లోకన్నా నిన్ను కారు మబ్బుల్లో...వెచ్చదనం ఏదని? వెన్నెల రాదే అని?చెలీ రావే,వరాలీవే...