. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, November 30, 2012

జ్ఞాపకాలు గుచ్చుకున్నా ప్రతిసారి ఇది నా మనస్సు వేదన

ఏవరో మనసును కెలుతున్న బాద
బాదపెట్టిన వారు బాగానే ఉన్నారు
జ్ఞాపకాలనే కత్తులను మనసులొ గుచ్చి
నాకేం తెలియదని దూరంగా ఉన్నావు
కాని నా మనసెందుకో ఇంకా నిన్నే కోరుతోంది
నలిగిన కాగితం లా మారిన మనస్సు

ఆ తీయ్యతి స్వరంకోసం
మనస్సు ఇంకా వెతుకుతూనే ఉంది..
ఆ మాటలు ఏమయ్యాయి..అప్పుడన్నవి నిజాలుకావా
నేనున్నా అన్నావు... మరి ఇప్పుడు ఏమయ్యావు..
ఎక్కడున్నా పలుకరించే నీవు.. నన్ను తప్ప
అందర్నీ పలుకరిస్తున్నావు.. ఎందుకిలా
తప్పెంటో తెలియక నేనేంటీ తెలియక
నన్ను నేను మర్చి నీకోసం ఎదురు చూస్తున్నా
కాని రావని తెల్సినా నా మనస్సు వినదు..
నీవు మారావు .. కాదు నిన్ను ఏమార్చారు
అని మనస్సుకు చెప్పినా వినదు
నివెక్కడాని జ్ఞాపకాలు గూడేళ్ళో
గుచ్చుకున్నా ప్రతిసారి ఇది నా మనస్సు వేదన
ఎన్నాల్లో ఎన్నేళ్ళే తెలీదు,
ఒకప్పుడు నీవు మారతావని ఆశ ఉండేది
కాని ఎందుకో ఇప్పుడు నామీద నాకే ఆసహ్యిం

Thursday, November 29, 2012

మమత అనే అద్భుత అనుబంధానికి అంకురానివో

మంచి అనే ఉద్యానవనంలో
వికసించిన కుసుమానివో.
మది అనే నదిలో ప్రవహించే
అమౄతానివో
మమత అనే అద్భుత
అనుబంధానికి అంకురానివో

మనసు పాడే
సుమధుర గీతానికి పల్లవివో...
మనసు అనే వేదికపై వయసు
వేసే నౄత్యానివో
వయసు వేసే నౄత్యానికే
ఓ చక్కటి అభినయానివో
జ్ఞాపకమను వేదికపై చెలరేగిన
అలల తాకిడివోవెల్లువై
తీరాన్నిచేరి అలసిపోయిన
కడలి కెరటానివో...
ఊహ అనే మహాసముద్రమో
ఎగసిపడుతున్న అల నీవో
స్వప్నమను నందన వనంలో
నేను కట్టుకున్న
సౌధానివోమమకార
మను పూతోటలో
సుగంధాలు వెదజల్లే
పారిజాతానివోఅలంకారం
అను హారంలో పొందికగా
ఒదిగిపొయిన మణిపూసవో...
చెలిమి అనీ పేరుతో నీవు కోరే
చేయూతకునేను ఎల్లపుడూ
సిద్ధంమైత్రి అనే మరోపేరుతోనైనా
దరికిచేరితేకలిసి పయనిద్ధాంనిర్వచనం
లేని ప్రేమకి కుడా ఓ అందమైనఅర్ధాన్నందించిన
ఓ స్నేహమాఅంతేలేని నీ స్వరాజ్యంలో
నాకు కూడాకాసింత చోటు కల్పించవూ....

Wednesday, November 28, 2012

మాది జీవన పోరాటమా...జీవిత పోరాటమా తెలియక పరుగులు తీస్తూనే ఉంటాం

పోరాడి గెలవానలే ఆరాటం
ఉరుకుల పరుగుల జీవితం
పరుగుల్లో పడ్డా లేచినా
అడిగేవారు లేరు
అందరు మీడియా అంటే కడగాలని చూసేవారే
మాదారి ముళ్ళదారి అని మాకే తెల్సు

అయినా గోదారిన్ ఒడ్డున సేదతీరాలనే
అత్యాస తీరక పరుగులు పెడుతూ
ఆరాట పడుతూనే ఉంటాం
తప్పదు పొట్టతిప్పలు
ఓవైపు పోటీ పడి ముందుండాలనే తపన లో
మా మనసులతో మేమే తన్నుకు చస్తున్నాం
అందరు వెలెత్తే చూపిస్తే .. సమాజాన్ని
జరుగుతున్న వాస్తవాల్ని చూపించేది ఎవరు
చూడాల్సిన వాళ్ళూ చూస్తూ వూరకుంటే
నీవు నిజాలు తెల్సుకునేది ఎప్పుడు
ఒక్కోసారి నిజం నీడై మమ్మల్ని వెంటాడుతుంది
సమాజానికి సమాదానం చెప్పుకోలేని నిజాన్ని ఒప్పుకోలేక
ఓ చుక్క గొంతులోకి దిగితే గాని అలుపు తీరదు
అయినా అది శాశ్వితం కాకపోయినా
ఆకాస్తసమయానికి .. ఊరట
తెల్లారుతుంటే మళ్ళీ మొదలౌతుంది మాపరుగు
మీ చేతిలో రిమోట్ ఆడుతుంటే
ఒకచోట నేను పరుగులుతు తీస్తే
మరో చోట మా మిత్రుడు పరుగులు తీస్తాడు
అప్పటికప్పుడూ వేడి వేడి వార్తలు మికిచ్చేందుకు
తప్పదు మాది జీవన పోరాటమా
జీవిత పోరాటమా తెలియక పరుగులు తీస్తూనే ఉంటాం

Sunday, November 25, 2012

అవును నేనూ ఇంకా గుర్తున్నానా..ప్రియా!

కలనైనా చూద్దామని
కనులు మూస్తే,

నీటి సుడుల మాటు
నీరూపం కరిగిపోయింది,
జ్ఞాపకాల సుడిగుండం
నన్ను ముంచివేస్తుంది,

నా హ్రుదయం లయ
తప్పుతున్నట్టుగా వుంది,
నా చెక్కిలి చెమ్మగిల్లుతోంది,

ఇంతలోనే.....
తీయ్యటి స్వరం
పలుకరించింది
మదిలో మొదలైంది
కలవరింత
నా చెక్కిలిని తడుముతూ..
నను ఓదార్చుతున్నట్టుగా వుంది,
అది నీవే కదా ప్రియా!
అవును నేనూ ఇంకా గుర్తున్నానా..
అంతమంది నీస్నేహితులమద్యి నేను ..నా పిచ్చిగాని..
నీవు నన్ను గుర్తుపెట్టుకునేంత గొప్ప బందం కాదుకదా
ప్రతిక్షనం తలచుకొనేంట..ప్రేమ నా పైనీకు లేదుగా
ఏంటో ఎప్పుడూ ఇలా పిచ్చిగా ఆలోచిస్తాను నీగురించి..
ప్రియా అంతకు మించి ఏంచేయలేను..
ఏంచేయగలను చెప్పు ప్రియా

ఎదో ఒక అదృస్యి హస్తం నన్ను చంపేస్తోంది...ప్రియా

గుండె నిండానీవు
మదినిండా నీతలపులు
ప్రపంచం అంతా గజిబిజి
నీవు లేని నా ఊహ
బరించడం కష్టంగా ఉంది
ఎదో ఒక అదృస్యి హస్తం
నన్ను చంపేస్తోంది...
అది నీజ్ఞాపకాల ప్రతిరూపమా
చుట్టూ మట్టి మరకలు
ఎదో అయిపోతున్నా ప్రియతమా
నీవు లేని నా చావు నాకు ఇక్కడ కనిపిస్తోంది
ఈ జన్మలో కనిపించమేమో
అందుకే మరో జన్మకొసం నీకు దూరంగా
వెల్లి పోతున్నా మిత్రమా
నీకు గుర్తుకొస్తే ఒక్క కన్న్నీటి బొట్టూ ను కూడా
వేష్టు చేయ్యకు ప్రియాతమా...?

Friday, November 23, 2012

నాకోసం నిన్ను నీవు దహించుకొంటూ..నన్ను ఓదారుస్తూ ?

నాలో పుడతావు..
నాలో ఆనందం ఉన్నప్పుడు
చల్లగా ఉంగే చుట్టూ చేరతావు
మరీ ఆనందం ఎక్కువైతే
నీన్ను నీవు తమాయించుకొలేక
కళ్ళనుండి బైటికొద్దామా వద్దాని చూస్తావు
గుండెళ్ళో భాద ఎక్కువైనప్పుడు ..
గుండె మండినప్పుడు
దగ్దమౌతున్న గుండె వేడికి తట్టుకోలేక
ఆ గుండె వేడిని తగ్గీంచేందుకు
నీతో ఆగుండె వేడిని తీసుకొని
కళ్ళలోంచి బైటికొచ్చి
మనసుకు ఊరటనిస్తావు
నీకు నానుంచి దూరం కావాలని లేకున్నా
నాకోసం నిన్ను నీవు దహించుకొంటూ
నన్ను ఓదారుస్తూ 
నాలో ఉన్న మలినాన్ని ఉప్పగా మార్చి
కన్నీరుగా బైటి కొస్తావు..నీవేగా కన్నీరు

నీవు బైటికొస్తూ నాలోని భాదను వేదనను
నీతో తీసుకెలుతూ .. నన్ను వోదర్చే
మరపురాని స్నేహితుడవు నీవు
నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోను
అందరూ కాదన్నా.. అందరూ నమ్మించి మోసం చేసినా
నీవు మాత్రం ఎప్పుడూ నాతోడుగా ఉంటూ
నాకంతూ భాదలో ,,,సంతోషంలో
నమ్మకం అయిన స్నేహితుడవు
ప్రపంచంలో నిన్ను మించిన
స్నేహితుడు నీకెవ్వరూ సరిరారు మిత్రమా నా ప్రాణమా

Thursday, November 22, 2012

ప్రియా రెండక్షరాల్లోనన్ను,,, నీవు ముద్దుగా పిలిచే పిలుపు...?

ప్రియా ఏంటి ఈ మద్యి
గుండెళ్ళో అలజడి
నీవు నాతో మాట్లాడి
ఏన్ని రోజులైంది
కాని ఈ మద్యి
ఎందుకో పక్కనే ఉండి

ముచ్చట్లు చెప్పినట్టుంది
ఏదో చెబుతున్నావు...
మనసుకు చాలా చాలా దగ్గరగా
ప్రియా చెవిని చేరుతున్న
నీ తీయ్యని మాటలు
రెండక్షరాల్లోనన్ను
నీవు ముద్దుగా పిలిచే పిలుపు
ప్రియా మద్యి మద్యి లో
నీవు పెట్టే ముద్దుల శబ్దాలు
ఏంటి అని తమాయించుకునే
ఉలిక్కిపడి నీకోసం వెతికితే
లోపు ఏమీ కానరాదు
కళ్ళలో కన్నీరు తప్ప
ఏది నిజం ఏది అబద్దం ప్రియా
నీవన్నది నిజం నేనన్నది అబద్దం
మరి ఏంటీ ఆందోలన
మాట్లాడేది నీవేనా అది నాతోనే
ఇది నమ్మలేని నిజం
గుండెల్లో గుబులు ..
నేనెక్కడ నీవెక్కడా
అని తలచుకొంటే
మళ్ళీ ఆందోళన
కాని నిజం కాదని తలవు రాగానే
తెలియగానే దిగులు
నిజానికి అబద్దానికి
మద్యి నేను వారధిని నేనే కదా..?
నిజమే అప్పుడు అన్నావు
నీవెక్కడా నేనేక్కడా అని
ఆనిజం అబద్దం గా మారుతుందా
ఎందుకీ గుండేల్లో అలజడి ప్రియా
నీగురించి ఆలోచనలే
నన్ను అంతం చేసేలా ఉన్నాయి ప్రియా