మధుర క్షణాల మీద
మనసు పయనం సాగిస్తూ..
స్వప్న లోకంలోకి జారిపోతుంది జ్ఞాపకం .
ఎప్పుడూ గీయని
కలల చిత్రమేదో
వెన్నల హంగుతో
రంగుల్ని అద్దుకుంటుంది .
ఎన్నడూ వినని వెన్నల పాటేదో
మనసు గొంతులో నీ జ్ఞాపకంలో
హాయిగా పాడుకుంటుంది.
చీకటి గూటిలో దీపంలా
వున్న చందమామను చూస్తూ...
ఎన్నో అనుభవాల్ని తడుముతూ..
మనసు తుమ్మెదలా ఎగురుతుంది.
ఎందుకో చెప్పవూ ..
నిజాన్ని మాత్రం అబద్దం చేయకు ప్లీజ్
అందమైన దృశ్యానుభూతులు
నా మనసున ఏ మూలనో దాచిపెటుకున్న
ఎన్నో జ్ఞావకాల దొంతర్లను కదిలిస్తూ,
బాల్యంలోని గురుతులను,
అప్పటి చిలిపితనపు సరదాలనీ,
చినుకుల చిటపటలతో తట్టిలేపుతుంటే,
వర్షంలో తడుస్తూ చిందాడిన
ఆ ఆనందమైన,అద్భుతమైన క్షణాలను
ఊహిస్తూ నా తనువంతా నవ్వుకుంటుంది.
నిజమేదో అబద్దమేదో తెలియని క్షనాల్లో
మనసు పయనం సాగిస్తూ..
స్వప్న లోకంలోకి జారిపోతుంది జ్ఞాపకం .
ఎప్పుడూ గీయని
కలల చిత్రమేదో
వెన్నల హంగుతో
రంగుల్ని అద్దుకుంటుంది .
ఎన్నడూ వినని వెన్నల పాటేదో
మనసు గొంతులో నీ జ్ఞాపకంలో
హాయిగా పాడుకుంటుంది.
చీకటి గూటిలో దీపంలా
వున్న చందమామను చూస్తూ...
ఎన్నో అనుభవాల్ని తడుముతూ..
మనసు తుమ్మెదలా ఎగురుతుంది.
ఎందుకో చెప్పవూ ..
నిజాన్ని మాత్రం అబద్దం చేయకు ప్లీజ్
అందమైన దృశ్యానుభూతులు
నా మనసున ఏ మూలనో దాచిపెటుకున్న
ఎన్నో జ్ఞావకాల దొంతర్లను కదిలిస్తూ,
బాల్యంలోని గురుతులను,
అప్పటి చిలిపితనపు సరదాలనీ,
చినుకుల చిటపటలతో తట్టిలేపుతుంటే,
వర్షంలో తడుస్తూ చిందాడిన
ఆ ఆనందమైన,అద్భుతమైన క్షణాలను
ఊహిస్తూ నా తనువంతా నవ్వుకుంటుంది.
నిజమేదో అబద్దమేదో తెలియని క్షనాల్లో