. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, May 27, 2015

జ్ఞాపకం నేనే నిజం.. అంటూ.. నిశ్శబ్దంగా నన్ను ఆక్రమించుకుంటుంది.

నా గదిలో.. నన్ను నేను వెతుక్కుంటూ..
నాలో నేను నడిచిపోతున్నప్పుడు..
ప్రపంచం ఒంటరైపోతుంది.

చీకటి కాలపు చట్రాల్లో నలిగి..
మనసుల ఇరుకు సందుల్లో ఊరేగి..
ఉత్తినే ఊపిరి బిగపెట్టి పరిగెడుతూ..
అంతలోనే ఆగిపోయి వెనక్కి చూసుకుంటూ.
ఆశల మజిలీల్లో.. నిస్పృహతో జట్టు కడుతూ..
అబద్దాలో.. నిజాలో.. తేలని అనుభవాల మధ్య.
నిస్థేజంగా నిర్జీవంగా ఒంటరిగా మిగిలిపోయా

గుప్పెడు కన్నీళ్లను చేతబట్టుకుని..
నేనున్నాను అనే ఓదార్పుకోసం..
రాత్రంతా.. రోజంతా..నిరంతరం..
ఆ దారులన్నీ.. వినువీధులన్నీ..
తిరిగి.. అలసి.. వేసారి.. 
నాకు ఎదురుపడుతూ ఉంటుంది..
నా గుండెలోకి తొంగి చూస్తుంది.
ఎందుకనో. నాకు నేను ఎంట ఒంటరినో తెలుస్తుంది


 ఒక్కోసారి గతం నాపై ఉప్పెనై విరుచుకుపడుతుంది..

నా ఆశల కొసల్ని వేళ్ళతో పెకిలిస్తూ..
మొదళ్ళకే  తిరిగి ముక్కలు చేస్తూ..
చిగురిస్తున్న కొమ్మల్ని.. చీల్చేస్తూ..
నిట్టనిలువనా..

ఎందుకు నేనే.. 
ఎందుకు నేనే వర్షించాలి అన్ని కన్నీళ్లు...
ఎందుకు నేనే.. ఎందుకని నేనే.. 
మరణించాలి.. అన్ని మార్లూ..
లేదు లేదు మరనిస్తూనే ఉన్నాగా రోజూ

ఏదో తెలియని పోరాటాన్ని.. ఎదలోనే ఎదుర్కుంటూ..
ఏదో తరగని పయనాన్ని నాలోనే నేను వెతుక్కుంటూ..
అనుక్షణం.. గెలుస్తూ.. ఓడిపోతూ.. ఆగక..నీకోసం
పరిగెత్తుతున్న మనస్సును అదుపులో పెట్టలేక


దానికే అనుక్షణం అర్పించుకుంటూ..
ఒక యోగిలా.. పిచ్చివాడిలా.. రాయిలా.. రాలే చినుకులా..
నాలోనే... నాతోనే.. నేనే..ఏకాంతంలో వెర్రిగా నాలో నేను నవ్వుకొంటూ