కలల దొంతరలు..కనుమరుగౌతున్నవేల
చీకటి దారుల్లో దిక్కు తోచన
పరిగెడుతున్నా
జ్ఞాపకాల ముళ్ళులు గుచ్చుకొంటున్నా
ఎండిన పువ్వు శిధిలాల్లో
కవిత ముసుగులో ఒదిగిన
నిలకడలేని నిజాలు
తోడు రాలేని వసంతాలు...
కన్నీటి తెరల మధ్యగా..
ఆల పించిన మేఘమల్హరి..
చెవులకు చేరేలోపే..
జ్ఞాపకం కరిగి జారిపోయింది ..
తెరల మధ్యకే.. తిరిగి ఇంకిపోయింది.