. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, January 13, 2015

కొన్ని నిజాలు వెంటాడుతున్నాయి( నాలోనేను సుదీర్గ పయనం)

ఏదో భయం!
నేను నేను కాకుండా 
పోతానేమోనని
నన్ను నన్నుగా నిలవనీయని 
నీజ్ఞాపకాలు 

ఏ భావోద్వేగంతోనో

ద్రవించి పోతూనే ఉన్నా
ఎక్కడో ఎదో అలజడి
ఏదో భయం!
నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంది

ఆ కల్లోల కాసారంలో

నా కవితలన్నీ
క్తపు ముద్దలై 
నన్ను నేను తుంచుకునే
పశువులా మార్చేస్తున్నాయి 
నాలోనుంచి నేను బయటపడి
నన్ను తగుల పెట్టుకుంటానేమో అని
ఏదో భయం!
ఎంతదూరం పరుగెత్తినా
ఏకాంతమనేది ఎక్కడా దొరకదు,
నిశీథిలోని సమాధుల్లో 
నన్ను నేను పూడ్చుకుంటున్నా 
నా మనసులో చెలరేగే 
అలజడుల అంతరంగంతో
దిక్కు తోచక నడుస్తునే ఉన్నా 

గాఢ నిద్రలోని కలలో మాదిరి

నాకు తెలియని
నేనై పోతానేమోనని ఏదో భయం!
నేను పెట్టుకున్నా 
నా చితిమంటల వెలుగులో
కావ్యాలు రాసుకున్నవాణ్ణి
అలవిమాలిన తెగింపునుండీ
తెగిపడిన వాడినై
నన్ను నేను నిరూపించుకోలేక
నాకు నేను కాకుండా పోతూ
ఏదో ఏదో.....
పదార్థంగానో, పవనంగానో,
పరమాణువుగానో, మారి శూన్యంగానో.....
ఏమైపోతానో, ఎలా మిగిలిపోతానో?
మిగిలిపోతానేమోనని భయం
కాదు మిగిలీపోయాని 
నన్ను నేను తగుల పెట్టుకొంటూ 
నాలోకి నేను ఒరిగిపొతున్న 
క్షనల్లో చేరుతున్న కటిక నిజాలివి

నిజాలు కల్లెదురుగా 
అవిరి అవుతూనే ఉన్నాయి
నిజాన్ని పాతిపెట్టినా

నన్ను చంపి మల్లీ బ్రతికిస్తున్న
ఆశ పదునైన కత్తిగా మారి 
నా కుత్తుక కోస్తున్నా
ఇంకా బ్రతికే ఉంటున్నా ఎందుకో
చావురాక చావలేక 
నేనిలా బయం
భయంగా బ్రతుకుతునే ఉవ్నా 

ఇప్పుడు మాట్లాడుతుంది బ్రతికున్న శవం 
నిజాలను మర్చిన ఓ అబద్దం 
కన్నీటి సంద్రంలో ఈదలేక 
నట్ట నది సముద్రంలో 
తేలియాడుతున్న  ఓ వాస్తవం 

ఎవరినో తెలియడంలేదు 
పయనమెటో అర్దం అవ్వడంలేదు 
నిజానికి అబద్దానికి మద్యి
నలిగిపొతున్నా ఓ మనిషిని
చావులో బ్రతుకు 
వెతుక్కొవడం అంటే ఇదేనా
కడలి కవ్విస్తుంటే 
వాస్తవం వద్దన్నా
గుండె చప్పుడు
వినకతప్పదు కదా
అదే ఆగినక్షనాల్లో
ఈ అక్షరాలు 
ఆగిపోతాయి కదూ 
ఆరోజుకోసం ఎదురు చూస్తున్నావు కదూ..?