. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, January 31, 2015

కన్నీరుగా మారిన జ్ఞాపకాలు


Saturday, January 24, 2015

జ్ఞాపకం కరిగి జారిపోయింది


కలల దొంతరలు..కనుమరుగౌతున్నవేల
చీకటి దారుల్లో దిక్కు తోచన
పరిగెడుతున్నా
జ్ఞాపకాల ముళ్ళులు గుచ్చుకొంటున్నా 


ఎండిన పువ్వు శిధిలాల్లో
కవిత ముసుగులో ఒదిగిన
నిలకడలేని నిజాలు 

తోడు రాలేని వసంతాలు...
కన్నీటి తెరల మధ్యగా..
ఆల పించిన మేఘమల్హరి..
చెవులకు చేరేలోపే..
జ్ఞాపకం కరిగి జారిపోయింది ..
తెరల మధ్యకే.. తిరిగి ఇంకిపోయింది.

నన్నూ నేన్ను తిట్టుకొంటూ నాలోకి నేను దూరి

అల్లకల్లోలంగా ఉన్న బ్రతుకు సంద్రంలో
రాత్రి మరకల్ని కడుక్కున్న 
మరో ఉదయం ఎర్రగా 
తడిసిన మందారంలా, నిర్మలంగా
బాహ్యాకాశంలో బరువుగా పూసింది 
కలల కౌగిలిలో వెలిగి ఆరిన
కంటి కాగడాల మధ్య
వీర తిలకం దిద్దిన కాంతి 
నల్ల కాలాన్నీ కాళ్ళకు కట్టి
నాతొపాటు బారంగా లాగేస్తున్నాయి 

దరిలేని తీరాలు, తీరని దాహాలు
అలుపెరుగని అలల మధ్య
ఊతమిచ్చే మనస్సు కోసం
ఎదురు చూపులతో.. నిన్నటిలానే
పోరాటం ముగుస్తుంది..
నిస్సత్తువుగా నాలో రేగిన 
ఆరాటమారుతుంది అలసిపోతుంది 

అలిసిన దేహానికి చీకట్లు చుట్టుకుంటూ
నిశీధిలోకి మన జ్ఞాపకం నిష్క్రమిస్తుంది
నన్నూ నేన్ను తిట్టుకొంటూ 
నాలోకి నేను దూరి 
నన్నూ నేను ప్రతిసారి 
ఇలా మోసం చేసుకుంటూ 
ఒరిగిపోతున్నా వేరేదారి లేక 

Sunday, January 18, 2015

సాహితీ వేత్త "చలం" జీవిత విషేషాలతో అయన ఆత్మ కధ చదువుతున్నా నోచ్.

1910 లో జరిగిన ఘటనలు అప్పటి పరిస్థితులకు అప్పటిలో జరిగిన వాస్తవాలు ..ఓ గొప్ప సాహితీ వేత్త "చలం" జీవిత విషేషాలతో అయన ఆత్మ కధ చదువుతున్నా నోచ్...మొత్తమ్మీద ఇన్నాళ్ళకు మళ్ళి ఓ మంచి పుస్తకం చదువుతున్నా..బుక్ మొత్తం చదివాక ఆ విషేషాలు మీతో పంచుకుంటాను  

Tuesday, January 13, 2015

కొన్ని నిజాలు వెంటాడుతున్నాయి( నాలోనేను సుదీర్గ పయనం)

ఏదో భయం!
నేను నేను కాకుండా 
పోతానేమోనని
నన్ను నన్నుగా నిలవనీయని 
నీజ్ఞాపకాలు 

ఏ భావోద్వేగంతోనో

ద్రవించి పోతూనే ఉన్నా
ఎక్కడో ఎదో అలజడి
ఏదో భయం!
నన్ను నిత్యం వెంటాడుతూనే ఉంది

ఆ కల్లోల కాసారంలో

నా కవితలన్నీ
క్తపు ముద్దలై 
నన్ను నేను తుంచుకునే
పశువులా మార్చేస్తున్నాయి 
నాలోనుంచి నేను బయటపడి
నన్ను తగుల పెట్టుకుంటానేమో అని
ఏదో భయం!
ఎంతదూరం పరుగెత్తినా
ఏకాంతమనేది ఎక్కడా దొరకదు,
నిశీథిలోని సమాధుల్లో 
నన్ను నేను పూడ్చుకుంటున్నా 
నా మనసులో చెలరేగే 
అలజడుల అంతరంగంతో
దిక్కు తోచక నడుస్తునే ఉన్నా 

గాఢ నిద్రలోని కలలో మాదిరి

నాకు తెలియని
నేనై పోతానేమోనని ఏదో భయం!
నేను పెట్టుకున్నా 
నా చితిమంటల వెలుగులో
కావ్యాలు రాసుకున్నవాణ్ణి
అలవిమాలిన తెగింపునుండీ
తెగిపడిన వాడినై
నన్ను నేను నిరూపించుకోలేక
నాకు నేను కాకుండా పోతూ
ఏదో ఏదో.....
పదార్థంగానో, పవనంగానో,
పరమాణువుగానో, మారి శూన్యంగానో.....
ఏమైపోతానో, ఎలా మిగిలిపోతానో?
మిగిలిపోతానేమోనని భయం
కాదు మిగిలీపోయాని 
నన్ను నేను తగుల పెట్టుకొంటూ 
నాలోకి నేను ఒరిగిపొతున్న 
క్షనల్లో చేరుతున్న కటిక నిజాలివి

నిజాలు కల్లెదురుగా 
అవిరి అవుతూనే ఉన్నాయి
నిజాన్ని పాతిపెట్టినా

నన్ను చంపి మల్లీ బ్రతికిస్తున్న
ఆశ పదునైన కత్తిగా మారి 
నా కుత్తుక కోస్తున్నా
ఇంకా బ్రతికే ఉంటున్నా ఎందుకో
చావురాక చావలేక 
నేనిలా బయం
భయంగా బ్రతుకుతునే ఉవ్నా 

ఇప్పుడు మాట్లాడుతుంది బ్రతికున్న శవం 
నిజాలను మర్చిన ఓ అబద్దం 
కన్నీటి సంద్రంలో ఈదలేక 
నట్ట నది సముద్రంలో 
తేలియాడుతున్న  ఓ వాస్తవం 

ఎవరినో తెలియడంలేదు 
పయనమెటో అర్దం అవ్వడంలేదు 
నిజానికి అబద్దానికి మద్యి
నలిగిపొతున్నా ఓ మనిషిని
చావులో బ్రతుకు 
వెతుక్కొవడం అంటే ఇదేనా
కడలి కవ్విస్తుంటే 
వాస్తవం వద్దన్నా
గుండె చప్పుడు
వినకతప్పదు కదా
అదే ఆగినక్షనాల్లో
ఈ అక్షరాలు 
ఆగిపోతాయి కదూ 
ఆరోజుకోసం ఎదురు చూస్తున్నావు కదూ..?