. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, December 28, 2014

మదిని మరిపిస్తున్న సుందరీ ఎక్కడున్నావు..


Sunday, December 21, 2014

మౌనంలో కరిగిపోతున్న గతం ..( నాలో నేను )

ఈరోజు ఉదయం చలిలో కొన్ని వణికిపోతున్న సంభాషణల్ని మనం అటూ ఇటూ రువ్వుకుంటూ కూర్చున్నాం. నీ సందేహంలోకి నేను పూర్తిగా ప్రవేశించగలనని అనుకోను కాని, ఆ దేహపు గోడల మీద పక్షినై కాసేపు రెక్కలు రెపరెప ఆడిస్తూ తిరిగానేమో బహుశా చివరి అకంకు వచ్చాము కదూ ఇన్నేళ్ళ ఇన్ని తడిపొడి బంధాల పెళుసు కాగితమ్ముక్కల చప్పుళ్ళలో ఏ ఇతర ఆకాశంలోకైనా కాస్త హాయిగా ఎగిరిపోగలనన్న నమ్మకం ఈ పక్షి గుండెకి లేదు కాదు ఊహల్లో ఎగిరె పక్ష్ రెక్కలు విరగ్గొట్టిందొ నీవే  కద ప్రతి దేహాన్నీ వొక ఇనప పంజరం చేసి, అందులో దాక్కున్న గుండెకి అన్ని అసహజత్వాలూ నేర్పుకున్న లౌక్యాల తేలిక సౌఖ్యాల కాలం కదా మనిద్దరిదీ ఇలాంటి వొకానొక స్థితిలో నువ్వడుగుతున్నావ్: “రాసిందల్లా సగంలో అబద్ధమై తెగిపోతున్నప్పుడు ఏం రాయమంటావ్? రాయకుండా వున్న రోజో, సగం రాసిన కాగితాలు చింపేసిన రోజో కాస్త ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు- రాసి, పూర్తయ్యాకక్ పడే ఉరికోతని భరిస్తూ ఎందుకూ నిద్రపట్టని రాత్రిని కావిలించుకొని?” గడిపిన ఆ రాత్రుల్లో హోరెత్తిన  నాహృదయ ఘోష నీకేం తెలుసు ..అవసరాన్ని బట్టి స్నేహాలను మారుస్తూ స్వార్దం కోసం నా మనసుకు గుండె కోత మిగిల్చి నిన్ను చూసి నీవు ఆనద పడుతున్నావు ..వీడు వీడు కాకపోతే మరోడు ..లేదంటే వాడమ్మ మొగుడు ..నీక్కావలసింది స్వార్దము ఆనందం నిజాయితి స్నేహం ప్రేమ నీకక్కర లేదు..మరి నన్నెందుకు ఎన్నుకున్నావు నా మనసుతో ఎందు ఆడుకొన్నావు నివాడే గేంలో నన్నెందుకు సమిదను చేశావు  నేను అడగలేకపోయాను కాని  అడిగే అవకాశంలేదు అడిగే ద్రైర్యాన్ని ఎప్పుడో కోల్ఫోయేలా చేశావు ..నీ ఆనందం నీది కదూ  ఏంటో సగం మాత్రమే రాసిన కాగితాలు కూడా నాకు ఉరి కంబాల్లా కనిపిస్తున్నాయి రోజూ! ఆ స్తంభాల మధ్య దిసమొలతో చావు ఆట ఆడుకుంటూ రాత్రిలోకి జారుకుంటూ వెళ్తున్నానని నీకు చెప్పాలని అనుకుంటా. కాని, ఎందుకో కర్తకర్మ క్రియలన్నీ ఎంచక్కా అమరుకుంటూ వచ్చిన వాక్యం మీద చచ్చేంత ప్రాణం చావు రేఖ మీద విలవిల్లాడుతూ కూడా ఆ వాక్యం క్రియాంతం అయినప్పుడు వొక ప్రాణాంతక క్రీడానంతరం లోపలి తెల్లప్రవాహం అంతా వొక్కసారిగా పెల్లుబికి పారిన తృప్తి అసంపుర్తిగా  మారి నన్ను దహించి వేస్తుంది  నీవు అవును అన్నా కాదన్నా ఇది నిజం 

Thursday, December 18, 2014

పరిగిడుతున్న కాలం వెనక అలిసిపోతున్నా

నవ్వు రావని తెలుస్తున్న
అందుకోడానికి నీ చేయి లేదని తెలిసిన
నా చెయ్యి చాచి నేవిపు చూస్తున్న
పరిగిడుతున్న కాలం వెనక
 నేన్ను అందుకోలేక
వేచి చూస్తున్న నే పిలుపుకే
నవ్వు నన్ను వదిలిన చోటి ఒంటరిని అయ్యి ...
విలపిస్తున్న కన్నీరే రాకుండా
కన్నులో నే రూపం చేరగాకుండదని
స్వసిస్తున్న ఊపిరి లేకున్నా
నా యెదలో నీకు ఊపిరిఅగకుండా
రెప్పవాల్చకుండా ఎదురుచూస్తున్నా


Tuesday, December 9, 2014

అమె వెల్లిపోయింది మరో కొత్త పరియంకోసం నన్నొదిలి

ఆమె ఎదురుపడింది.
తనంతట తానై వచ్చి.
గుండె వేగాన్ని పెంచేస్తూ,
కొత్త ప్రపంచానికి స్వాగతిస్తూ.

ఆమె పరిచయమయింది.
గతాన్నంతా చెరిపేస్తూ,
నాలో ప్రేమను గుర్తుచేస్తూ.
నన్ను నేనే మర్చిపోయేలా చేస్తూ .


ఆమె కలిసిపోయింది.
ఊపిరై మనసులొకి చేరుతూ,
ఊహలై మదిలో తిరుగుతూ.
మదిలో మౌనరాగాలు పైలికిస్తూ.

ఆమె కోపగించుకుంది.
నా ప్రేమను తిరస్కరిస్తూ,
నా మనసుకి గాయంచేస్తూ.

ఆమె వెళ్ళిపోతుంది.
నా ఆనందాలను మూటగట్టేస్తూ,
మరొకరిని వెతుక్కుంటూ.
తన్ ఆనందం కోసం గుండెకు గాయం చేసి
నా కన్నుల నిండా నీరు నింపేస్తూ, 
నన్ను  సజీవ సమాధి చేసిసమాది చేసి

Monday, December 8, 2014

మృత్యువా .. నాప్రేయసికంటే గొప్పదానివా ...?


గుండెల్లో తీరని వేదనతో ఇంకా బరువై
అప్పటిదాకా బరువుగా నున్న శరీరంలో మార్పు
గుండెల్లో అంతబారంగా ఉన్నా ఎందుకో గాళ్ళో తెలినట్టుంది
నిజాకి అబద్దానికి మద్య పెద్ద గొయ్యి తవ్వుతున్నారు 
ఏంటో మాఇంట్లో అంతా సందడి చెట్టూకింద కూర్చున్న 
నన్నెవరు ఎందుకు పకలించడంలేదు
పిలిచినా అరిచినా చూసి చూడనట్టు వెలుతున్నారు
అదేంటి అందరి కళ్ళలో నీరు ..
ఎందుకు అందరూ విషాదంగా ఉన్నారు.. 
బుజ్జీ ...బుజ్జీ అని నా బిడ్డను పిలుస్తున్నా
ఎందుకేడుస్తుందో తెలీదు  ..కన్నీరు వరదలైనట్టు 
తనుకుడా ఏటో చూస్తుంది ఏంటీ ఏం జరుగుతోంది 
ఏవరో  లీలగా  నన్ను పిలుస్తున్నారు 
నల్లగా చూస్తేనే బయంకరంగా ఉన్నాడు 
నన్ను పలుకరించి నవ్వుతున్నాడు 
విరగబడి నవ్వుతున్నాడు
ఎందుకో వాడి నవ్వు అంత భాదనిపించలేదు 
ఎందుకంటే .. వయ్యారి నవ్వులు నవ్వి 
గుండెల్లో గుచ్చేసి మరొకరి చెంత చేరిన 
నా ప్రేయసి గుర్తుకొచ్చి నాకు  నవ్వొచ్చింది 
అమే తో పోలిస్తే మృత్యువు గొప్ప అనిపించలేదు
అది బ్రతికున్నప్పుడే చంపేసింది 
ఇది చచ్చాక చంపేస్తుంది 
  

Thursday, December 4, 2014

ఒంటరి రాత్రి మోసుకొచ్చే నిశ్శబ్ద నిట్టూర్పులు ..( నీకోసం నాలో నేను సంభాషించుకొంటూ )

పెదవుల కదలికల్లో..కనురెప్పల శబ్దాలు 
ధ్వనించే అంతరంగంతో సంభాషించాలి
మనసుతో మాట్లాడాలి అని వున్నా 
మనిషివి నా చెంత లేవుగా 

ఒంటరి రాత్రి మోసుకొచ్చే  నిశ్శబ్ద నిట్టూర్పులు 

నన్నెందుకో ఊరడించాలని చూస్తున్నాయి 
నన్నెందుకో అవి భయపెడుతూనో ముద్దాడుతూనో
సమూహాంతర ప్రవాహంలోకి నెట్టేస్తున్నాయి
నన్ను వంటరిగా ఉండమని వేదిస్తున్నాయి 

ఒకే ఊరిలో  వుంటూనే మనం

ముక్కలు ముక్కలుగా విసిరేయబడ్డాం 
మనిషిక్కడా మనసులే ఎక్కడో ఉన్నాయి 

సంభాషణకోసం సమయాన్ని వెదుక్కునేలోగా

ముచ్చటపడ్డ నీ రింగుటోను పాట
నా కాలర్ టోనై అది మ్రోగినప్పుడల్లా 
నన్ను గతంలోకి  లాక్కెళుతుంది

అక్షరీకరించలేని ఎన్నో సంభాషణలు

నా మనస్సు హాడిస్కు లో  నిక్షిప్తం అయివున్నా 
నీ మెమరీలో మన జ్ఞాపకాలను  డిలీట్ చేశావుగా 

కాలానికి ఎదురీదడం నాకు  కొత్తేమీ కాదు
కాలంలో కలిసిపోవడం  అలవాటు చేసెల్లావుగా 
కాని నన్ను నేను ఇలా 
అక్షరాలతో నిప్పంటిచుకొని 
గతం  జ్ఞాపకాలతో తగల బడూతూనే ఉంటా ఎప్పుడు