వాళ్ళన్నదే నిజం..వాళ్ళు చెప్పిందే వాస్తం...వారిలోకంవారిదే
కాలం,సమాజం,ప్రక్రుతి,స్నేహం,విలువలు...వారికి పట్టవు
మన కల్చర్ అంటే చిన్నచూపు...వారేదో ప్రత్యేకంగా పుట్టారని వారి నమ్మకం
ఎదుటిమనిషి భావాలు,ఆవేదనలు,అంతరంగం వేదన అన్నీ ట్రాష్ అంటారు
జీవివతంలో విలువలు.మోరల్ వాల్యూస్...కన్నీళ్ళు,ఇవేమి వాళ్ళకు పట్టవు
ఎదుటివారిని అర్దం చేసుకోవాలని వారు అనుకోరు..
ఎందుకంటే మేమింతే అయితే ఏంటంట...
అనేది మాత్రమే వాళ్ళకు తెలుసు ఎదుటి వారు భాధ పడుతున్నారని తెల్సినా
అయితే ఏంటంట అని వారిమాటవారిదే
అర్దంచేసుకుందాం అన్నా ఆలోచన అస్సలు ఉండదు
వారికి భాదలుంటాయి అర్దచేసుకునే మనస్సు ఉంటుంది కాని...
ఆతిక్క...అదే తాను నమ్మిందే నిజం..తాను అనుకున్నదే కరెక్టు అన్న ఆలోచన
ఒక్కోసారి కాప్రమైజ్ అవుతారు కాని ...మళ్ళీ అయితే...
ఏంటంటా అనే మళ్ళీ సమధానం..అందుకే నాకనిపిస్తుంది
తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళు అన్న వారిసమాధానంతో
మూడుకాళ్ళ మనుషులు అని అనిపిస్తుంది...నా ఫిలింగే ఇది..
ఇదే నిజం అని మాత్రం చెప్పను...నేను అందరీ ఫీలింగ్స్ కు వాల్యూఇస్తాను
నా ఫీలిగ్స్ అర్దం చేసుకోవాలని కొరుకుంటా కాని అదే అందరు నమ్మాలని అనుకోను
లేక పోతే మీరు నన్ను మూడుకాళ్ళ మనిషి అనుకోగలరు కదా..?
( నా ఫీలింగ్స్ లొ ఎంతనిజముందో చెప్పగలరా ..? )