తెల్లవారు జామున
నులివెచ్చని కిరనాలు
నీ కౌగిలిని గుర్తుకు తెస్తున్నాయి
నీ జ్ఞాపకాల సెగలు ఎప్పుడు
దుఃఖపు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి
జరిగిన ఘటనలు
చావుకీ బతుక్కీ మధ్య
వేలాడుతున్న గతం
గింగిరాలు తిరుగుతూనే ఉంది
గతంలో జరిగిపోయిన
క్షనాలను బెట్టు కొంటూ
మనసు పేజీ మడతలో
జీవితపు కాలీలను
నింపుకొంటు నిర్వేదంగా
జీవితాన్ని ఇలా కొనసాగిస్తూనే వున్నా
ఎప్పటికీ రాని ఎదురు చూస్తూ