. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, February 24, 2017

నీ ఆనందం లో నా సంతోషాన్ని వెతుక్కుంతున్నాగా

గడిచిన కాలం వదిలిన జ్ఞాపకాల్లో 
నన్ను నేను చూసుకోవాలనుకున్న ప్రతిసారి
మనసనే అద్దం పగిలిన క్షనాల్లో 
అద్దం ముక్కల్ని ప్రేమగా తుడుచుకుని
పగిలి  చెదిరిన బింబాల్లో నన్ను నేను 
ఆతృతగా వెతుక్కుంటున్నాను..
ప్రతి ప్రతిబింబంలో 
నేనెక్కడ కనిపించడంలేదు 
అన్నిటిలో నీవే కనిపిస్తున్నావు 
నాన్ను నేను చూసుకుందామనుకొంటే 
ఎక్కడా కనిపించనెందుకనో 

నిజమిది అని ఒప్పుకోను
అబద్ధమని మరువలేను
తప్పు నాదని తలవంచలేను
ఒప్పు ఇది అని ఎదిరించలేను
ఇవన్నీ తెలీసే నీవు నాతో 
నాజీవితంతో ఆడుకొన్నావు 
ఆట ముగిసింది ..
నా గతమతా గాయాల పాలు చేసి 
నీ ప్రస్తుతాన్ని మాత్రం పూలవనం చేసుకొని 
ఆనందిస్తున్నావు గాఆ 
నన్ను భాదపెట్టినా 
భాదపెట్టిందినీవేగా అని నీ ఆనందం లో 
నా సంతోషాన్ని వెతుక్కుంతున్నాగా 

!!మరణ మృదంగం!! ( ఈ కవిత నాదికాదు )

అంతా సుఖమే అని భ్రమిస్తున్న జీవితంలో
కపటం చేసే కల్లోలం ఎంతో
ఒక కల నుంచి ఇంకో కలకు దొర్లిన చప్పుడు
ఒక దుఃఖం నుండి ఇంకో దుఃఖానికి పొర్లిన చప్పుడు

తెలియని గోడల్లో కన్నీళ్ళ చప్పుడు
కూలిన ఆశల శిధిలాల్లో
ఎగరలేని ఆలోచనల చప్పుడు
పచ్చని ఆకులు పగిలిన చప్పుడు
రెక్కలు విరిగిన చప్పుడు

పాట ఆగిన చప్పుడు
శ్వాస వీడిన చప్పుడు
ఆరాటాలు పోరాటాలు అలిసిన చప్పుడు
ఆఖరి పర్వంలో చీదరింపుల చప్పుడు
మనిషికి మనుగడకు మధ్య నలిగిన చప్పుడు

దిక్కులు పిక్కటిల్లిన చప్పుళ్ళ మధ్య
తేల్చుకోలేక
పోల్చుకోలేక
తెగింపులేక
మృత్యుశీతల స్పర్శలో
ఘనీభవించినపుడు
గర్వంతో ఉప్పొంగి పోవడం చాతకాలేదెపుడు

మాట్లాడుతూ
పోట్లాడుతూ
నేలకొరిగినపుడు
ఒక్కో పిలుపు
ఒక్కో ముఖం
జ్ఞాపకాల పేజీలు తిప్పుతుంటే
గతం కాకులు పొడుస్తున్న ఎద్దుపుండు మరువనీయదెపుడు

నీవెంటే మేమంటూ
తంత్రాంగాలో మంత్రాంగాలో
స్వచ్ఛత కోసం సాగుతున్న యంత్రాంగంలో
వాదించేవి
బంధాలె కాదు
బాధ్యతలు కూడా
వేధించేవి
జ్ఞాపకాలే కాదు
అనుభవాలు కూడా

Tuesday, February 14, 2017

చావేలేక బ్రతుకుతున్న ఓ మనసు నివేదన ( FB లో )

నా ప్రతి సవ్వడి
నిశ్శబ్దం తాలూకు విస్ఫోటమే
ఎన్నో ఆరాటాలు పోరాటాల మధ్య
శరీరాన్ని అద్దెకు తీసుకుని సాగుతుంటే
ఉన్న మెదడు వదిలి అద్దె మెదడుతోనే 

కాపురమని ఖరారు
కాలం లెక్కలు కుదుర్చుకున్నాక
బాగోగులకై భారీగానే తకరారు

రంగులు పొంగులు హంగుగానే 
మాట్లాడుకున్నాయి
అహంకారాలు ఆడంబరాలు 

అలంకరణలయ్యాయి
ఉప్పూకారంలో ఊరబెడుతూ
కోర్కెల సెగలో చల్లబడుతూ
నరనరాన్ని నాట్యం చేయించటమే 

వుంటుందక్కడ అన్నారు
ఇంకేముంది
కరుకుతనం ఇరుకుతనం ఇరుసుల్లో
శరీరం దాని పని అది చేసుకుపోతోంది
కళ్ళూ కాళ్ళూ
నిగ్రహంతోనో ఆగ్రహంగానో
అద్దె మెదడులో అమరలేక 

అతకలేక అల్లాడిపోతుంటాయి
నియంత్రణలేని తనంతో
నిరాశగా పగటి పరకలను 

చీలుస్తూ కట్టలు కడుతూంటాను
రేయి రమించాక దులపుకోవాలంటూ
నిస్పృహలు గోడలునిండా అతుక్కుంటే
నిశీధిని కిటికీలకు అలుకుతూంటాను
ఆక్షేపణల మధ్య అస్తిత్వం కోసం
ఎప్పుడూ లోపల్లోపల
అప్పుడప్పుడూ బయట
నాతో నాకు సమస్యే మరి

రక్తమాంసాల్లో మాత్రం తీవ్రమైన జ్వాల
ఒక కాంతి రేఖగా మెరవాలని
ఒక పచ్చని చిత్రంగా ఒదగాలని
ఒక సెలయేరులా శీతలత్వాన్ని పూయాలని
నిరంతర ప్రయాసతో పయనం
దాహానికైనా దహనానికైనా దేహమేగా
బాడుగ భారాన్ని బలవంతంగా మోసుకుంటూ
దుఃఖసాగరాన్ని తలగడలో దాచుకుంటూ
ఎన్నిసార్లు మరణించానో లెక్క తేల్చలేను

క్షమించండి
జీవించటం నాకు చాతకావటం లేదు