. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, January 3, 2017

వ్యక్తపరచలేని నీ మాటల లేమి

కన్నీరు అడ్డొచ్చి
వెక్కిళ్ళు మాటలను మింగేసిన క్షణంలో
నీ మౌనాన్ని వింటాను.

నాలో  నువ్వు 
పడుతున్న సంఘర్షణను
వ్యక్తపరచలేని నీ మాటల 
లేమి నాకు వినిపిస్తుంది.

పదాల కోసం వెతుక్కునే 
నీ నిస్సహాయత నిట్టూర్పును  
 మౌనంలో వింటాను
అక్షరాలలో ఒదగలేని 
నీ భావాలను నా కళ్ళతో చూస్తాను

మాట్లాడుతూ మాట్లాడుతూ
నువ్వు హటాత్తుగా ఆగిపోతావే
అప్పుడు నీ నిశ్శబ్దం  నా చెవులలో విస్పోటకాలవుతాయి….మౌనంగా 

Monday, January 2, 2017

సువిసైడ్


ఆ రెండు కన్నీటి చుక్కలు

కనుకోనలలో వేళాడుతున్నాయి

వాలే భుజం లేక…..



ఆ రెండు మాటలు

నాలికను చిధిమేస్తూ

గొంతుకలో నొక్కివెయ్యబడుతున్నాయి

వినే మనసు లేక…..



ఆ విసుగు నిస్పృహై

శూన్యంలోకి జారిపోతుంది
ఆశకు ఆసరా లేక…..


ఆ తనువు తనను 
తాను శిక్షించుకుంటూ
మరణాన్ని ప్రేమించి నిష్క్రమించింది
హత్యో ఆత్మహత్యో ముద్దాయిలెవరో
తేల్చుకోలేని ప్రశ్నలను
మనకు వదిలేస్తూ…..



మనం
ఆ మనసులను
ఆ ఆ  అంతరంగపు 
లోతులను తడమగలిగి
వారి ఆత్మలను ముద్దాడిఉంటే
ఒక మాట, ఒక చేయూత, 
ఒక ఆసరా, 
ఒక సహానుభూతి, 
ఒక ఆశ….ఇచ్చివుంటే
ఎన్ని కొత్త చిగురులు 
తొడిగేవో కదూ ఆ జీవితాలు.
చిదిమేసుకున్న ప్రతీ 
జీవితం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది

source :- https://alochanalu.wordpress.com

మరణించాను

 ఓ చెరిగిపోయిన అక్షరాల్లారా కరిగిపోయిన క్షణాల్లారా! ప్రవహించండి నా కలంలో సిరాలాగ ! సరే మరణించాను నాకు   చచ్చిపోవాలని ఉంది. బహుశ విమాన ప్రమాదంలో, లేదా జలగండం వల్ల ?బైక్ ప్రమాదంలోనో... బస్సు క్రింద పడో.. అదీ ఇదీ కాకపోతే నేల మీదనే కాలధర్మం. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు. "ఎందుకేడుస్తున్నారు, ఇప్పుడేమయిపోయిందని" అని నేనెంత ధారాపాతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. " అనంతర కార్యక్రమం గురించి ఆలోచించామన్నా" రెవరో! దహన సంస్కారం ఎజండాలోకి వచ్చింది. అదే వీల్లేదన్నాన్నేను. మతానికి సంబంధించిన ఏ విధమైన కర్మకాండకీ నా (సజీవ లేదా నిర్జీవ) కళేబరాన్ని అంకితం చెయ్యడం అనే పనికి నేను సుతరాము అంగీకరించను.     
            చుట్టూ మూగిన వాళ్ళలో కొంతమందికి నేనొకసారి రాసిన మరణశాసనం జ్ఞాపకం వచ్చింది. అందులో నేను, "నేను చచ్చిపోయాక జరగవలిసిన మొట్టమొదటి పని నా శవాన్ని ఉస్మానియా హాస్పిటల్ లో అప్పగించడం" అని రాశాను. ఆ తర్వాత జరగవలసిన పని అక్కడున్న మెడికల్ కాలేజి విద్యార్దుల్లోని నిరీశ్వరవాదుల ఆధ్వర్యం కింద జరగాలని నా ఆకాంక్ష. ఏడ్చి, ఏడ్చి ఆగిపోయిన వాళ్ళు, ఆగిపోయినా, ఏడుస్తున్న వాళ్లింకా ఏడుస్తూనే ఉన్నారు. ఎడవమనండి నాకు అభ్యంతరం లేదు. విరసం వాళ్ళు నన్నూరేగిస్తామన్నారు. నా అభ్యంతరం లేదు. నా శవం మీద ఎర్రజెండా కప్పడం మాత్రం మరిచిపోకండని మరీ మరీ అభ్యర్ధించాను.  
                       నా కొడుకే వచ్చి తన చేతుల్తో నా తలకి కొరివి పెడతానన్నాడు. ఇది వాడికి పుట్టిన బుద్దికాదనుకుంటాను. ఎవరో చెప్పించిన ట్యూషన్ అయినా అదే వీళ్ళేదంటాన్నేను.

                                                                                                      .....  శ్రీ శ్రీ