నాకు మొబైలిప్పుడు కేవలం
సాంకేతిక సమాచార సాధనమే కాదు
నా దేహాన్ని, ఆలోచనల్ని వైబ్రేట్‌చేసే పరికరం కూడా.
అవసరాలమధ్య అనుసంధానమౌతున్న
అనేకనెంబర్లతోపాటు
నీ నంబరు అలానేవుంది
అప్పుడప్పుడూ ఏదొకటి వెదకుతున్నప్పుడు
నీ పేరుతో నంబరు కన్పిస్తుంది
అంతటి వెదకులాటలో
ఓ జ్ఞాపకం మనసును సన్నగా తడుతుంది
ఒక్కసారి ప్రయత్నిద్దామని మదిలో తొలుస్తుంది
ప్రయత్నించిన వెనువెంటనే కలిసుంటే
రింగ్ అవుతుంది కానీ వెంతనే కట్ చేస్తావుగా
అందుబాటులో లేవనో, పరిథిలో లేవనో పదే పదే పలుకుతుంది
మొబైల్ లో కొత్త ఆప్సన్స్ నీకు
మంచి అవకాశం కలిపించాయి
బ్లాక్ లో పెట్టడం..
నీవు బ్లాక్ చేసిన నెంబర్లలలో మొదటిది నాదే కదూ
దగ్గరవ్వాలనే ఆలోచనకు
విభజన రేఖేదో అడ్డమొస్తుందేమో!
వాణిజ్య బేరీజులమధ్య నెంబర్లు
మారుస్తుంటాము
కానీ ఆది నా దగ్గర వుండదు..
కానీ నీ నెంబర్ అలానే వుంది
కొత్తనెంబర్ కూడా సేవ్ అయి వుంది
కాని ఫోన్ చేసేంత దైర్యం అయితే మాత్రం లేదు
వాడని నెంబర్లను తీసివేస్తుంటాము
మరి నా నంబరు నీ దగ్గరుందో లేదో
నాకిప్పుడు
నీ పిలుపునుంచో, మాటల్లోంచో పొందే తరంగ తాకిడికోసం
మనసెప్పుడూ తడుముకొంటూనే ఉంటుంది
నీ నుంచి రింగు కావాలి
నా మొబైల్ కు నీ వాయిస్ ద్వారా ఏదో సందేశం రావాలి
అది ఒకప్పుడు స్వీట్ వాయిస్ కాని ఇప్పూడు
తిట్లదండకం ఎవరో ఎదో చెబితె నిజం తెలుసుకొకుండా
ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం
పిచ్చి మనస్సు అలాగైనా నీ వాయిస్ వినొచ్హని
ఆరాటపడుతుంది నీ కు చీ అనిపించదంలేదు ...?
నా నెంబరు మారలేదు సుమా!
హఠాత్తుగా
జీవితాన్ని ఏమీ మార్చలేదు