. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, May 27, 2015

జ్ఞాపకం నేనే నిజం.. అంటూ.. నిశ్శబ్దంగా నన్ను ఆక్రమించుకుంటుంది.

నా గదిలో.. నన్ను నేను వెతుక్కుంటూ..
నాలో నేను నడిచిపోతున్నప్పుడు..
ప్రపంచం ఒంటరైపోతుంది.

చీకటి కాలపు చట్రాల్లో నలిగి..
మనసుల ఇరుకు సందుల్లో ఊరేగి..
ఉత్తినే ఊపిరి బిగపెట్టి పరిగెడుతూ..
అంతలోనే ఆగిపోయి వెనక్కి చూసుకుంటూ.
ఆశల మజిలీల్లో.. నిస్పృహతో జట్టు కడుతూ..
అబద్దాలో.. నిజాలో.. తేలని అనుభవాల మధ్య.
నిస్థేజంగా నిర్జీవంగా ఒంటరిగా మిగిలిపోయా

గుప్పెడు కన్నీళ్లను చేతబట్టుకుని..
నేనున్నాను అనే ఓదార్పుకోసం..
రాత్రంతా.. రోజంతా..నిరంతరం..
ఆ దారులన్నీ.. వినువీధులన్నీ..
తిరిగి.. అలసి.. వేసారి.. 
నాకు ఎదురుపడుతూ ఉంటుంది..
నా గుండెలోకి తొంగి చూస్తుంది.
ఎందుకనో. నాకు నేను ఎంట ఒంటరినో తెలుస్తుంది


 ఒక్కోసారి గతం నాపై ఉప్పెనై విరుచుకుపడుతుంది..

నా ఆశల కొసల్ని వేళ్ళతో పెకిలిస్తూ..
మొదళ్ళకే  తిరిగి ముక్కలు చేస్తూ..
చిగురిస్తున్న కొమ్మల్ని.. చీల్చేస్తూ..
నిట్టనిలువనా..

ఎందుకు నేనే.. 
ఎందుకు నేనే వర్షించాలి అన్ని కన్నీళ్లు...
ఎందుకు నేనే.. ఎందుకని నేనే.. 
మరణించాలి.. అన్ని మార్లూ..
లేదు లేదు మరనిస్తూనే ఉన్నాగా రోజూ

ఏదో తెలియని పోరాటాన్ని.. ఎదలోనే ఎదుర్కుంటూ..
ఏదో తరగని పయనాన్ని నాలోనే నేను వెతుక్కుంటూ..
అనుక్షణం.. గెలుస్తూ.. ఓడిపోతూ.. ఆగక..నీకోసం
పరిగెత్తుతున్న మనస్సును అదుపులో పెట్టలేక


దానికే అనుక్షణం అర్పించుకుంటూ..
ఒక యోగిలా.. పిచ్చివాడిలా.. రాయిలా.. రాలే చినుకులా..
నాలోనే... నాతోనే.. నేనే..ఏకాంతంలో వెర్రిగా నాలో నేను నవ్వుకొంటూ


Wednesday, May 20, 2015

నా వద్ద మౌనన్ని మిగిల్చి.నాలో నీరాశను రగిల్చివెల్లావు

నువ్వు నా గుండెల్లో కెలికి
మనసంతా నీజ్ఞాపకాలను గుచ్చేసి
తడిమి తడిమి వెళ్ళిపోయావు
రమ్మనడానికి నా వద్ద మౌనన్ని మిగిల్చి
నాలో నీరాశను రగిల్చివెల్లావు

మాటలన్నీ కరిగిపోయాయి
పెదాలు పదాలు పలకలేక
మది మౌన భాషలో మూగబొయింది
నిన్నటికి నేటికి నాలో మార్పు
నీవులేవనా ..ఎప్పటికీ కాన రావనా
ఏంటీ గందరగోళం
నన్ను నేను కాకుండా పోతున్న
క్షనాలను తిరిగి రాయాలనుకున్నా
నీవు వదిలి వెల్లిన
చీకటి గుర్తులు
నన్నింకా వేదిస్తున్నాయి

అప్పటిలో నేటిని గుచ్చాలని
కలల్లో నేను చేస్తున్న ప్రయత్నం
ఒక్క ఉలిక్కి పాటుతో  
పగిలిన గాలి బుడగలై పోతున్నాయి

నీవైపు చాలా సార్లు తొంగిచూశా 
నా నా ఆనవాల్లేమైనా నీ దగ్గర కనిపిస్తాయని
కొత్త కొత్త రుచులతో అసలు నేననే ఒక గుర్తు 
నీకు లేనట్టు సంతోషంగా 
చిరునవ్వులు చిందిస్తున్నావు 
నాఖు కావాల్సింది అదే నీ పెదలపై 
చెరగని చిరునవ్వు నాకది చాలు నీవు నవ్వుతూ వుండాలి 

అందుకే నిన్నలో నేటిని దాచుకొని అదే నిజమనుకొని 
నిన్నే తలచుకొంటూ బ్రతికేస్తున్నా 
నీకెప్పటికీ కానరాని నేను గా  


Sunday, May 10, 2015

***Happy Mothers Day***

అమ్మ అమ్మ అమ్మ.
నా మోము చిన్నబోతే
తను చిన్నబుచుకుంటుంది.....
నే ముభావంగా ఉంటె...............
భారమైన నిట్టుర్పవ్తుంది

నా కంట నీరు చిమ్మితే
తానో వర్షించే మేఘమావ్తుంది.
అర్ధరాత్రి దాక నా గదిలో దీపం వెలిగితే.

దరి చేరిన నిద్రదేవిని దూరంగా పొమ్మంటుంది.
కలత మనసుతో నేను కనిపిస్తే తను కకావికలమవ్తుంది.....
ఉద్దోగ భారంతో ఊసురుమని ఇంటికొస్తే ఊద్దేపించే ఊదార్పువ్తుంది ......
బడలికతో బద్దకిస్తే.................
బలవంతపు గోరుముద్దవ్తుంది ..........................
అస్సలు ఏమాత్రం తనకి నే సమయం ఇవ్వకపోయినా.................
అహరహం నాకై సతమతమవ్తుంది...........
మౌనంగా నా పని నే చేసుకుంటున్న 

మనిషినైన ఎదుట ఉన్నానని మురిసిపోతుంది.........................
పుట్టి బుద్దిఎరుగక పనిలో ఎ సహాయం చేయకపోయీన 

పదిమందికి నా బిడ్డ సహాయపడుతుంది అని గొప్పలు చెబుతుంది..
పదిమంది దగ్గర ప్రదర్శిచిన ప్రశాంత తన దగ్గర 
చిరాకు ప్రదర్శిచిన నా చిట్టి తండ్రికి అంత కష్టం వచిందేమో అని
చింత పడుతుంది.అందకే నాకుఅమ్మంటే అంత పిచ్చి 



Sunday, May 3, 2015

నాగుండెలపై వాలి... శూన్యంలోకి మగతగా చూసే నిన్ను.... నాతో పెదాలు కలిపి మూసిన కళ్ళ వెనుక


" ఇవన్నీ ఒకప్పుడు జరిగిన వాస్తవాలు ..వాడు ప్రేమగా రాసుకున్న పదాలు.."
అందుకేనేమో వాడు నిజం అయ్యాడు నేను అబద్దం అయ్యా

" వెన్నెల ప్రవాహం...... పగటి వెలుగులో ముడుచుకుని. రాత్రి నిశ్శబ్దంలో విచ్చుకున్న మల్లెల నవ్వు... "
" మలుపులు తిరుగుతూ సాగుతున్న దారులు రెండు. యూసఫ్ గూడ కేఫ్ లో. కలుసుకున్న సాయంత్రం. మెరిసే కళ్ళు , నవ్వే "
" కొన్నిటిలో మూర్ఖుణ్ణయి... ఎదో చూసి..ఏదో విని... ఏదో అనుభూతించి... ఒక్క క్షణం అసలెక్కడా అని ఆగి , వెనక్కి చూసుకుంటే ... "
"అందమయిన అక్షరాలు..... అందమయిన అక్షరాలు మాట్లాడే అక్షరాలు రాగం తీసే అక్షరాలు అరకులోయలో ఒంటరి ప్రేయసిలా ."
" ఈ దేహాన్ని, చైతన్యాన్ని పట్టి ఉంచిన దేనినో అన్వేషిస్తూ... ఈ సంతోషానికి ,దిగులుకు మూలం ఎక్కడా అని యోచిస్తూ ..."
" ఙ్ఞాపకాలు వెంటాడుతాయి......కొన్ని చూపులు వెంటాడుతాయి.అలాగే కొన్ని అక్షరాలు కూడా.చదివేపుడు అవి కలిగించిన ."
" ఎవరు ....??ఎవరామె..??అంత స్వేచ్చగా రెండు రెక్కలు సాచి విహరిస్తోంది.....?నచ్చిన చోటికల్లా....,విరగబూసిన పూదోటల్లో... "
" జీవితం ఎందుకో, ఎటుపోతున్నాననే సందేహం,అలోచన నిరంతరం వెంటాడుతోంది.అర్థం లేని వెదకులాట. కాలం అలా సెకన్లు ."
" నీకూ నేనొక రహస్యంలాగే కనిపిస్తానా? నా మీసాలు,గడ్డాలూ, చేతుల్లో బలం....అన్నీ.. నాకయితే నువ్వెపుడూ నిలువెత్తు "
" నీ మౌనంలో........ నిదురించిన నా ఙ్ఞాపకాలు మేల్కొంటాయి... నీ నవ్వు నా చెవుల్లో మ్రోగేంతవరకూ... నీ ఙ్ఞాపకాల అలల్లో "
" సృష్టి పలికిస్తోంది...అనాదిగా.... నాదాన్ని ...ప్రణయ గీతాన్ని ...... ఒక్కొక్కరినుంచి..... ఒకప్పుడు నీనుంచి.......తీయగా."
" 1 సెప్టెం 2008 – మలుపులు తిరుగుతూ సాగుతున్న దారులు రెండు. యూసఫ్ గూడ కేఫ్ లో. కలుసుకున్న సాయంత్రం. మెరిసే ..."
" ఎన్ని స్పర్శలు. నీ శ్వాసతో నులివెచ్చని స్పర్శ. నన్ను కాల్చేసే గోర్వెచ్చని సుగంధపు స్పర్శ. నీ కంటి చూపు తాకగానే ..."
" నాగుండెలపై వాలి... శూన్యంలోకి మగతగా చూసే నిన్ను.... నాతో పెదాలు కలిపి మూసిన కళ్ళ వెనుక. ఙ్ఞాపకాలు నేనెలా పట్టను ..."